For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్ - డిసెంబర్ జీడీపీ వృద్ది రేటు 4.5 శాతం

By Nageswara Rao
|

Chidambaram
న్యూఢిల్లీ: మైనింగ్, వ్యవసాయంతో పాటు తయారీ రంగం కుదేలవడంతో ప్రస్తుత ఆర్దిక సంవత్సరం అక్టోబర్ - డిసెంబర్ జీడీపీ వృద్ది రేటు 4.5 శాతానికి పడిపోయినట్లు ప్రభుత్వపు డేటా తెలిపింది. ఈ దశాబ్దంలో త్రైమాసికంగా చూస్తే ఇదే చాలా తక్కువ స్దాయి. 2013-14వ ఆర్దిక సంవత్సరానికి గాను నిన్న ఆర్దిక మంత్రి పి చిదంబరం సమర్పించిన బడ్జెట్‌లో దీనిపై ఆందోళన చెందారు. జీడీపీ వృద్ది రేటును పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, వచ్చే ఆర్దిక సంవత్సరంలో ఇది ఆరు శాతానికి మించి నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గత ఏడాది ఇదే అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు ఆరు శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-డిసెంబర్) కాలంలో వృద్ధి రేటు 5.1 శాతం మాత్రమే. అంతకముందు ఏడాది ఇదే వ్యవధిలో జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదు అయింది. 2012-13లో వృద్ధిరేటు క్యూ-1లో 5.5 శాతం, క్యూ-2లో 5.3 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి.

సంవత్సరం మొదట్లో వృద్ధి 5.4 శాతం ఉంది కాబట్టి మొత్తం సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5 శాతం నమోదవుతుందన్న అంచనా సరైనదేనని... అయితే ద్వితీయార్ధంలో వృద్ధి కచ్చితంగా 5 శాతం దిగువనే ఉంటుందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.1-6.7 శాతం స్థాయిలో నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసిన సంగతి తెలిసిందే.

ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్‌పై ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహాన్ సింగ్ ప్రతి స్పందిస్తూ 9 శాతం వృద్ధిరేటు కష్టమేనని, అయినా సాధిస్తామనే నమ్మకం ఉందని గురువారం అన్నారు. చిదంబరం ప్రశంసనీయమైన బడ్జెట్‌ను రూపొందించారని ఆయన అన్నారు. పెట్టుబడుల సమీకరణకు ఆర్థిక మంత్రి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని ఆయన అన్నారు.

తెలుగు వన్ఇండియా

English summary

అక్టోబర్ - డిసెంబర్ జీడీపీ వృద్ది రేటు 4.5 శాతం | Third quarter GDP slows to 4.5%, worse than expected | జీడీపీ వృద్ది రేటు 4.5 శాతం


 India's economy grew at a worse-than-expected 4.5 per cent in the quarter ending December 31, hurt by a slowdown in agriculture, mining and manufacturing, government data showed on Thursday.
Story first published: Friday, March 1, 2013, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X