For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రవ్యోల్బణం డిసెబంర్ నాటికి 8.2 శాతానికి చేరే అవకాశం: మోర్గాన్ స్టాన్లీ

By Nageswara Rao
|

Inflation is likely to remain high at near 8 per cent: Morgan Stanley
న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో ద్రవ్యోల్బణం కాస్త ఊరట కలిగించినా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్ నాటికి 8.2 శాతానికి చేరే అవకాశం ఉందని గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్ద మోర్గాన్ స్టాన్లీ తన రీసెర్చి నివేదికలో వెల్లడించింది. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి (36 బేసిస్ పాయింట్లు) 7.45శాతంగా నమోదయినప్పటికీ.. డిసెంబర్‌లో మాత్రం ఈ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఐతే మార్చి చివరికి కాస్త తగ్గుముఖం పట్టి 7 నుండి 7.5 శాతానికి దిగి వస్తుందని అంచనా వేసింది.

అంతక ముందు సెప్టెంబర్‌లో 7.81 శాతంగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం వడ్డీరేట్లు తగ్గించాలంటే ద్రవ్యోల్బణం 5 నుండి 5.5 శాతానికి దిగిరావాల్సిందేనని పేర్కొంటుంది. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి, కరెంట్ లోటు వంటి స్దూల ఆర్దిక స్దిరత్వ సూచీలు సవాళ్లు కొనసాగుతుండడంతో పాటు ఎగుమతులు మందగించడంతో రీటెయిల్‌ ద్రవ్యోల్బణం పెరగడంతో వృద్ధి రేటు గాడిలో పడుతున్నందన్న అంచనాలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చునని నివేదికలో అభిప్రాయపడింది.

అక్టోబర్‌ 30న జరిగిన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమా వేశంలో కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వడ్డీరేట్లు ఈ ఏడాది చివరి వర కు ఇలానే ఉంటాయని 2013 Q1 నుండి వడ్డీరేట్లు తగ్గవచ్చునని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం నుంచి ద్రవ్యోల్బణం అదుపులోకి రావచ్చునని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. 2013లో ఆర్‌బీఐ కీలకవడ్డీరేటు 50 నుంచి 75 బేసిక్‌ పాయింట్లు తగ్గించవచ్చునని మోర్గాన్‌ స్టాన్లీ రీసెర్చి నివేదికలో పేర్కొంది.

తెలుగు వన్ఇండియా

English summary

ద్రవ్యోల్బణం డిసెబంర్ నాటికి 8.2 శాతానికి చేరే అవకాశం: మోర్గాన్ స్టాన్లీ | Inflation is likely to remain high at near 8 per cent: Morgan Stanley | ద్రవ్యోల్బణం డిసెబంర్ నాటికి 8.2 శాతానికి చేరే అవకాశం


 Inflation is likely to remain high at near 8 per cent levels by December end due to high government deficit and strong growth in rural wages, says a report by Morgan Stanley.
Story first published: Monday, November 19, 2012, 12:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X