For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న అదానీ సంపద పతనం, నేడు జంప్: ముంబైలోని టాప్ 10 కుబేరులు

|

భారత, ఆసియా రెండో కుబేరుడు గౌతమ్ అదానీ నిన్న తన సంపదను పెద్ద ఎత్తున కోల్పోయారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచ, భారత మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో అదానీ సంపద నిన్న ఒక్కరోజే 4 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. దీంతో అతని సంపద రూ.82.8 బిలియన్ డాలర్లుగా నిలిచింది. ఫిబ్రవరి 14 నాటి మార్కెట్ పతనం సందర్భంగా అదానీ స్థాయిలో నష్టపోయిన కుబేరులు ఎవరూలేరు. అయితే నేడు స్టాక్స్ పుంజుకున్నాయి. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్స్ నిన్న 1.5 శాతం నుండి 9.8 శాతం మేర నష్టపోయాయి. నేడు మాత్రం ఈ స్టాక్స్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి. దీంతో ఆయన సంపద నేడు పెరిగింది.

గౌతమ్ అదానీ అహ్మదాబాద్‌లో నివసిస్తారు. ప్రధాన కార్యాలయాలు కూడా దాదాపు అక్కడే ఉంటాయి. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువమంది కుబేరులు ఉంటారు. ఈ నేపథ్యంలో ముంబైలో నివసించే టాప్ 10 కుబేరుల జాబితా చూద్దాం...

10 Of The Richest Businessmen In Mumbai, Mukesh Ambani on top

ముఖేష్ అంబానీ ముంబైలోని తన నివాసం ఆంటిలీనాలో నివసిస్తారు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్‌‍పెన్సివ్ హౌస్. ముఖేష్ సంపద 91.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ముంబై సదరన్ ప్రాంతంలో నివసిస్తారు. ఈయన సంపద 10.7 బిలియన్ డాలర్లు.
ఇండస్ట్రియలిస్ట్, ఫిలాంత్రపిస్ట్ రతన్ టాటా కొలాబాలోని తన రిటైర్మెంట్ హోమ్‌లో నివసిస్తారు. ఆయన సంపద 1 బిలియన్ డాలర్లు.
ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార్ బిర్లా మలబార్ హిల్స్‌లో నివసిస్తారు. ఆయన నికర ఆదాయం 11.8 బిలియన్ డాలర్లు.
సన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత దిలిప్ షాంఘ్వీ ముంబై ప్రాంతంలోని జుహూలో ఉంటారు. ఆయన సంపద 12.8 బిలియన్ డాలర్లు.
ఎస్సెల్ గ్రూప్ చైర్ పర్సన్ సుభాష్ చంద్ర సంపద 5 బిలియన్ డాలర్లుగా ఉంది.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనావాలా లిన్‌కాల్న్ హౌస్‌లో నివసిస్తారు. ఆయన సంపద 11.5 బిలియన్ డాలర్లు.
డీమార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీ సంపద 10 బిలియన్ డాలర్లు. ఆయన ముంబైలోని అట్లామౌంట్ రోడ్‌లో నివసిస్తారు.
వాడియా గ్రూప్ చైర్మన్ నుసిల్ వాడియా సంపద 3.7 బిలియన్ డాలర్లు. గోద్రేజ్ చైర్ పర్సన్ ఆది గోద్రేజ్ సంపద 2.5 బిలియన్ డాలర్లు. ఆయన ముంబై సబర్పన్‌లో ఉంటారు.

English summary

నిన్న అదానీ సంపద పతనం, నేడు జంప్: ముంబైలోని టాప్ 10 కుబేరులు | 10 Of The Richest Businessmen In Mumbai, Mukesh Ambani on top

India's second richest person and Adani Group Chairman Gautam Adani lost almost $4 billion in total worth on February 14 as his group’s stocks plunged amid the market crash.
Story first published: Tuesday, February 15, 2022, 18:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X