For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ కుబేరుల్లో 10మంది హైదరాబాదీలు, ఫార్మా నుండే 7గురు

|

హైదరాబాద్: భాగ్యనగరం స్థిరంగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రతి ఏడాది బిలియనీర్లను సృష్టిస్తోంది. హూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 తాజా, 10వ ఏడిషన్‌లో నగరానికి చెందిన పది మంది బిలియనీర్లు చోటు సంపాదించుకున్నారు. వీరి ఆదాయం రూ.1,65,900 కోట్లు లేదా 22.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఆదాయం 15 జనవరి 2021 నాటి వరకు లెక్కలు. ఈ పదిమందిలోను ఏడుగురు ఫార్మా దిగ్గజాలు ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎనిమిదో స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే.

ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ, అమెరికాతో మనోళ్లు పోటీప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ, అమెరికాతో మనోళ్లు పోటీ

హైదరాబాద్ నుండి టాప్ 10 వీరే

హైదరాబాద్ నుండి టాప్ 10 వీరే

హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో హైదరాబాద్ నుండి మురళీ దివి అండ్ ఫ్యామిలి (దివిస్ ల్యాబ్స్) రూ.54,100 కోట్లతో భారత్‌లో 20వ స్థానంలో, ప్రపంచంలో 385వ స్థానంలో నిలిచారు.

పీవీ రాంప్రసాద్ రెడ్డి అండ్ ఫ్యామిలీ రూ.22,600 కోట్లతో భారత్‌లో 56వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 1,096వ స్థానంలో ఉంది.

పార్థసారథి రెడ్డి అండ్ ఫ్యామిలీ రూ.16,000 కోట్లతో భారత్‌లో 83వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 1,609వ స్థానంలో ఉంది.

సతీష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ (డాక్టర్ రెడ్డీస్) రూ.12,800 కోట్లతో భారత్‌లో 108వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,050వ స్థానంలో ఉంది.

జీవీ ప్రసాద్, జీ అనురాధ (డాక్టర్ రెడ్డీస్) రూ.10,700 కోట్లతో భారత్‌లో 133వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,238వ స్థానంలో ఉంది.

పిచ్చిరెడ్డి (మెఘా ఇంజినీరింగ్) రూ.10,600 కోట్లతో భారత్‌లో 134వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానంలో ఉంది.

రామేశ్వర్ రావు జూపల్లి అండ్ ఫ్యామిలీ (మైహోమ్ ఇండస్ట్రీస్) రూ.10,500 కోట్లతో భారత్‌లో 138వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానంలో ఉంది.

పీవీ క్రిష్నా రెడ్డి (మెఘా ఇంజినీరింగ్) రూ.10,200 కోట్లతో భారత్‌లో 140వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానంలో ఉంది.

ఎం సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ (ఎంఎస్ఎన్ ల్యాబ్స్) రూ.9,800 కోట్లతో భారత్‌లో 143వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,530వ స్థానంలో ఉంది.

వీసీ నన్నపనేని (నాట్కో ఫార్మా) రూ.8,600 కోట్లతో భారత్‌లో 164వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,686వ స్థానంలో ఉంది.

పిన్న వయస్కులు

పిన్న వయస్కులు

భారత కుబేరుల జాబితాలో అతిపిన్న వయస్కుడిగా జెరోధా నిఖిల్ కామత్(34), ఇన్‌స్టాకార్ట్ అపూర్వ మెహతా(34) నిలిచారు. కుబేరుల జాబితాలో ముంబైలో 60 మంది కుబేరులు ఉండగా, ఢిల్లీలో 40, బెంగళూరులో 22 మంది చొప్పున ఉన్నారు. మహిళల్లో బయోకాన్ కిరణ్ మజుందార్ షా, గోద్రేజ్ స్మిత వి క్రిష్ణ, లుపిన్ మంజు గుప్తా చోటు దక్కించుకున్నారు. మొత్తం 177 మంది భారత కుబేరుల్లో 118 మంది స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చినవారు.

వారానికో బిలియనీర్

వారానికో బిలియనీర్

2020లో మన దేశంలో వారానికి ఓ బిలియనీర్ అవతరించారు. దేశంలో 177 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ కుబేరుల్లో ముకేష్ అంబానీకి 8వ స్థానం లభించింది. ఈయన సంపద 17 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

ఆనంద్ మహీంద్రా, బైజు రవీంద్రన్ సంపద రెట్టింపయింది.

English summary

ప్రపంచ కుబేరుల్లో 10మంది హైదరాబాదీలు, ఫార్మా నుండే 7గురు | 10 Hyderabad billionaires on Global Rich List

Hyderabad has not only been consistently attracting investments but creating billionaires year-on-year. The latest and the 10th edition of Hurun Global Rich List 2021 names 10 billionaires from the city with a cumulative wealth of Rs 1,65,900 crore ($22.6 billion). Wealth calculations are as of 15 January, 2021.
Story first published: Wednesday, March 3, 2021, 9:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X