For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దెబ్బ మీద దెబ్బ: ముందే పెరిగిన ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు

|

దేశంలో కరోనా వైరస్-లాక్‌డౌన్‌కు ముందే ఉద్దేశ్యపూర్వక పన్నుఎగవేతదారులు పెరిగారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సంస్థ లేదా వ్యక్తి చెల్లించేగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ చెల్లింపులు జరపడం లేదు. రుణదాతలు మార్చి క్వార్టర్‌లో రూ.24,765.5 కోట్ల రికవరీ కోసం 1,251 కేసులను నమోదు చేసినట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ డేటా వెల్లడిస్తోందంటున్నారు. రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్నవారిని డిఫాల్టర్లుగా పరిగణించారు. ఇప్పుడు కరోనా వల్ల ఆర్థిక కార్యకలాపాలు చిన్నాభిన్నం కావడంతో డిఫాల్టర్లు పెరుగుతారని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

72 లక్షల మంది PF ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ఆగస్ట్ వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్72 లక్షల మంది PF ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ఆగస్ట్ వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్

ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 82 శాతం

ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 82 శాతం

కరోనా, లాక్ డౌన్ దెబ్బతో వ్యాపారాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకున్నప్పటికి డిమాండ్ లేమి కనిపిస్తోంది. ఇది వ్యాపారులు, వ్యక్తుల బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యంపై ప్రభావం చూపింది. మొత్తం ఉద్దేశ్యపూర్వ ఎగవేతదారుల్లో 82 శాతం పబ్వలిక్ సెక్టార్ బ్యాంకులవి ఉన్నాయి. ప్రయివేటు సెక్టార్ బ్యాంకుల వాటా 17.7 శాతంగా ఉండగా, మిగతా మొత్తం విదేశీ బ్యాంకులకు చెందినవి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్దేశ్యపూర్వక రుణాలు రూ.20,310 కోట్లు, ప్రయివేటు రంగ బ్యాంకుల రుణాలు రూ.4,378 కోట్లు, విదేశీ బ్యాంకు రుణాలు రూ.76 కోట్లుగా ఉంది.

మందగమనం దెబ్బ.. కరోనా మరో దెబ్బ

మందగమనం దెబ్బ.. కరోనా మరో దెబ్బ

ఇప్పటికే మందగమనం వ్యాపారవృద్ధిని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసిందని, కరోనా-లాక్ డౌన్ కారణంగా ఈ ప్రభావం మరింత భారీగా పడిందని చెప్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ మారటోరియె వెసులుబాటును కల్పించింది. అన్-లాక్ ప్రారంభమయ్యాక ఇప్పటికే కొన్ని సంస్థలు లేదా వ్యక్తులు మారటోరియం నుండి తప్పుకుంటున్నారు. మారటోరియం ఆప్షన్ ఉపయోగించుకుంటున్న వారిలో ఐదు శాతం నుండి పది శాతం మంది రుణాలు రిస్క్‌గా భావిస్తున్నారు.

బ్యాడ్ లోన్స్, ఎన్పీఏలు

బ్యాడ్ లోన్స్, ఎన్పీఏలు

ఎంఎస్ఎంఈలు సహా వివిధ సెగ్మెంట్‌లలో బ్యాంకుల బ్యాడ్ లోన్స్ లేదా ఎన్పీఏలు పెరగవచ్చునని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ జూన్ 25న రిపోర్ట్‌లో తెలిపింది. మారటోరియం కారణంగా గ్రాస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో పెరగకుండా ఉంటాయని తెలిపింది. కరోనా కారణంగా ఎస్ఎంఈ, రిటైల్, వ్యక్తిగత రుణాలు సహా వివిధ సెగ్మెంట్‌లలో పెరుగుదల ఉండవచ్చునని పేర్కొంది.

English summary

దెబ్బ మీద దెబ్బ: ముందే పెరిగిన ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు | willful defaulters rose before coronavirus lockdown

India's number of wilful defaulters — an entity or a person that has does not pay back a loan despite the ability to repay it —increased before the country was locked down for almost two months late March to contain the spread of the coronavirus pandemic, data shows.
Story first published: Thursday, July 9, 2020, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X