For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులకు గుడ్‌న్యూస్, ఎంఎస్ఎంఈ పరిధిలోకి...

|

రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులకు ఊరట. వీరిని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ కిందకు తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుననారు. ఈ నేపథ్యంలో కేంద్రం భారీ రిలీఫ్ అందించింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులు ల‌బ్ధి పొందుతారు.

MSME వంటి ప్రాధాన్య రంగాల‌కు తేలికగా రుణాలు మంజూరు చేయాల‌ని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు ఆర్బీఐ నిబంధనలు విధించింది. గ్రోత్ రేట్‌కు MSME ఇంజిన్ వంటిద‌ని పేర్కొన్నారు. క‌రోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో ఇబ్బందుల్లో చిక్కుకున్న వ్యాపారుల‌ను MSME ప‌రిధిలోకి తీసుకు వచ్చామని, దీంతో ప్రాధాన్య రంగంగా వీరికి ఆర్థిక సాయం అందించ‌డం తేలిక అవుతుందని తెలిపారు.

Retail, wholesale trade brought under MSME

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమని, చారిత్రాత్మకమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అభివర్ణించింది. ఏడాదిగా పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని, ఇప్పుడు ఊరట దక్కిందని చెబుతున్నారు.రిటైల్, హోల్ సేల్ వ్యాపారులను ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకు రావడం వల్ల తక్కువ వడ్డీపై రుణాలు వస్తాయి.

English summary

రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులకు గుడ్‌న్యూస్, ఎంఎస్ఎంఈ పరిధిలోకి... | Retail, wholesale trade brought under MSME

The government on Friday included retail and wholesale traders under the MSME (micro, small and medium enterprises) classification making them eligible for priority sector advances by banks and financial institutions per RBI guidelines.
Story first published: Sunday, July 4, 2021, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X