For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంఎస్ఎంఈలకు బకాయిలు చెల్లించండి, కార్పోరేట్లకు సూచన

|

సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థ (MSME)లకు చెల్లించాల్సిన రుణాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయివేటు సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌తు ప్రభుత్వం సూచించింది. దేశంలోని టాప్ 500 కార్పోరేట్ గ్రూప్స్‌ను ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కోరింది. ఆన్ లైన్ ద్వారా కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలకు లేఖలు పంపించింది. ఎంఎస్ఎంఆఈలు మనుగడ సాగించాలన్నా, ఈ రంగంలో ఉద్యోగాలు నిలబడాలన్నా వాటికి నిధులు అవసరమని తెలిపింది.

ఎంఎస్ఎంఈలలో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది ఉద్యోగులకు శాలరీలు అందాలని, అప్పుడే వారిపై ఆధారపడిన వారి జీవనం సాగుతుందని, అందుకే సత్వరం బకాయిలు తీర్చాలని, తదుపరి దశలో మిగిలిన కార్పోరేట్ సంస్థలకు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాలు చెబుతామని పేర్కొంది. ఎంఎస్ఎంఈలకు చెల్లించాల్సిన బకాయిలపై ఆరు నెలలకు ఒకసారి కార్పోరేట్ వ్యవహారాల శాఖకు కార్పోరేట్ సంస్థలు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉందని తెలిపింది.

కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఆఫర్!కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఆఫర్!

private sector to clear payments due to MSMEs

కరోనా నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ పేరిట కేంద్రం ఎంఎస్ఎంఈలకు ఉద్దీపనలు ప్రకటించింది. అదే సమయంలో 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుండి ఎంఎస్ఎంఈలకు రూ.10వేల కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. ప్రయివేటు దిగ్గజ సంస్థల నుండి కూడా నిధులు సాధ్యమైనంత తవరగా విడుదల చేయించాలని భావిస్తోంది.

English summary

ఎంఎస్ఎంఈలకు బకాయిలు చెల్లించండి, కార్పోరేట్లకు సూచన | private sector to clear payments due to MSMEs

The Ministry of micro, small and medium enterprises has asked private sector enterprises in the country to clear dues of small businesses on priority.
Story first published: Tuesday, September 15, 2020, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X