For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకులకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక! త్వరలో DFI.. ఏమిటిది?

|

కరోనా వైరస్ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.3 లక్షల కోట్లకు పైగా రుణాలు ఇస్తోంది. ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఇందుకు సంబంధించిన స్కీం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ECLGS) కింద రుణాలు ఇస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు ఇబ్బందులు కూడా పడుతున్నాయి. ఇది తన దృష్టికి రావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

<br><strong>భారత్ సహా ఆ దేశాల దెబ్బతో టిక్‌టాక్ ఉక్కిరిబిక్కిరి, దిక్కుతోచక కీలక నిర్ణయం!</strong>
భారత్ సహా ఆ దేశాల దెబ్బతో టిక్‌టాక్ ఉక్కిరిబిక్కిరి, దిక్కుతోచక కీలక నిర్ణయం!

బ్యాంకులకు నిర్మల హెచ్చరిక!

బ్యాంకులకు నిర్మల హెచ్చరిక!

అత్యవసర రుణ హామీ పథకం కింద రుణాలు తీసుకోవడం ఎంఎస్ఎంఈలకు కష్టంగానే ఉందనే అంశంపై నిర్మల మాట్లాడుతూ.. ఈ పథకం కింద వచ్చే ఎంఎస్ఎంఈలకు రుణాన్ని బ్యాంకులు తిరస్కరించకూడదని, అలాంటివి ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అప్పుడు తానే స్వయంగా చర్యలు తీసుకుంటానని బ్యాంకులను హెచ్చరించారు.

రూ.1.30 లక్షల కోట్లు మంజూరు

రూ.1.30 లక్షల కోట్లు మంజూరు

అత్యవసర రుణ సదుపాయాల పరిధిలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (MSME) బ్యాంకులు రుణాలను తిరస్కరించలేవని నిర్మల చెప్పారు. కాగా ECLGS పథకం కింద జూలై 23వ తేదీ నాటికి ప్రభుత్వం, ప్రయివేటు రంగ బ్యాంకులు రూ.1.30 లక్షల కోట్ల రుణం మంజూరు చేశారు. ఇందులో రూ.82,065 కోట్లు విడుదల చేశారు.

DFI బ్యాంకు.. ఏమిటిది?

DFI బ్యాంకు.. ఏమిటిది?

పరిశ్రమ అత్యవసర రుణాల కోసం డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్‌ను (DFI) ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని, దీనిని పరిశీలిస్తున్నామని, త్వరలో ఇది సాకారం కావొచ్చునని నిర్మల చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు పరిశ్రమలు కొత్త మార్గాలను కనుగొనాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్రాపై మరిన్ని పెట్టుబడులు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో నిర్మల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్పీఏలు, బ్యాడ్ లోన్స్‌తో ఇబ్బందిపడుతున్న బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితులు తక్కువ అని భావిస్తున్నారు. రానున్న అయిదేళ్లలో 111 ట్రిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం పెట్టుబడి ప్రణాళికలను ఉన్నతస్థాయి ప్యానెల్ రికమండ్ చేసింది. రుణదాతల నుండి రుణాలు పొందలేని ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి సాధారణంగా ప్రభుత్వానికి చెందిన సంస్థ DFI. మన దేశంలో ఇలాంటి సంస్థల కొరత ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

English summary

బ్యాంకులకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక! త్వరలో DFI.. ఏమిటిది? | Nirmala warns banks against refusing credit to MSMEs under ECLGS

“Banks cannot refuse credit to MSMEs covered under emergency credit facility. If refused, such instances must be reported. I will look into it,” Finance minister Nirmala Sitharaman said.
Story first published: Saturday, August 1, 2020, 11:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X