For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

credit guarantee: MSMEలకు కేంద్రం శుభవార్త.. సులభంగా రుణాలు ఇచ్చేందుకు..

|

credit guarantee: చైనాకు ధీటుగా ఎదిగేందుకు భారత ప్రభుత్వం శత విధాల ప్రయత్నిస్తోంది. డ్రాగన్ కంట్రీకు ప్రత్యామ్నాయంగా, ప్రపంచ కర్మాగారంగా మారాలని చూస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (MSME) ప్రోత్సహిస్తూ.. తయారీ, సేవల రంగంలో భారీగా ఉద్యోగావకాలతో పాటు సంపద సృష్టికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా 9 వేల కోట్ల రూపాయలతో క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు.

పూచీకత్తుకు ప్రభుత్వం సిద్ధం

పూచీకత్తుకు ప్రభుత్వం సిద్ధం

ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ గ్యారెంటీ మొదలుపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 2 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వం షూరిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. తద్వారా పలు సమస్యలు, నిధుల కొరతతో ఉన్న MSME రంగానికి నిధులు అందుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.

సరైన పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మొగ్గుచూపరు. అటువంటి పరిస్థితుల్లో క్రెడిట్ గ్యారెంటీ పథకం వారికి ధీమా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆతిథ్యానికి పెద్దపీట

ఆతిథ్యానికి పెద్దపీట

ప్రభుత్వ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ను మార్చి 2022 నుంచి ఏడాది పాటు పొడిగించారు. దీని హామీ కవరేజీకి 50 వేల కోట్లను జోడించి 5 లక్షల కోట్లకు విస్తరించారు. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 'దేఖో అప్నా దేశ్' కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకానికి నిధులు అందించే ఉద్దేశంతో ఆ అదనపు మొత్తాన్ని ఆతిథ్య రంగం సంబంధిత సంస్థల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

సులభంగా, సమర్థవంతంగా..

సులభంగా, సమర్థవంతంగా..

MSME పరిశ్రమలు, వ్యాపారాలకు సులభంగా, సమర్థవంతంగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకుగాను నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రస్తుత నిబంధనలను సమగ్రంగా సమీక్షించాల్సిందిగా సంబంధిత నియంత్రణ సంస్థలను కోరనున్నట్లు తెలియజేశారు.

అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టం

అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టం

క్లెయిమ్ చేయని షేర్లు, డివిడెండ్‌లను తిరిగి పొందడం కోసం ఇంటిగ్రేటెడ్ IT పోర్టల్ ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. IFSC గిఫ్ట్ సిటీలో రిజిస్ట్రేషన్లు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కంపెనీల చట్టం కింద నమోదు చేసుకునే సంస్థల విషయంలో వేగంగా స్పందించేందుకు సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌ను సైతం తీసుకువస్తామని చెప్పారు.

English summary

credit guarantee: MSMEలకు కేంద్రం శుభవార్త.. సులభంగా రుణాలు ఇచ్చేందుకు.. | Central government to introduce credit guarantee for MSMEs

Central government schemes for MSME..
Story first published: Wednesday, February 1, 2023, 19:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X