For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో నెల రోజులే గడువు.. 44 లక్షల కంపెనీలకు రూ.1.77 లక్షల కోట్లు

|

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్(ECLGS)ను ప్రకటించింది. ఎంఎస్ఎంఈల కోసం తీసుకొచ్చిన ఈ రుణ హామీ పథకం గడువు తీరిపోవడనికి మరో నెల రోజుల గడువు మాత్రమే ఉంది. అక్టోబర్ 31వ తేదీతో ఈ గడువు ముగియనుంది. అయినప్పటికీ నిర్దేశిత లక్ష్యంలో రుణాలు సగం వరకు మాత్రమే ఇచ్చాయి బ్యాంకులు. ఇప్పటి వరకు మొత్తంగా రూ.1.77 లక్షల కోట్ల రుణాలు మంజూరు అయినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం ట్వీట్ చేసింది.

అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!

రూ.1.25 లక్షల కోట్లు జారీ

రూ.1.25 లక్షల కోట్లు జారీ

కరోనా కారణంగా రూ.3 లక్షల కోట్ల రుణాలకు గాను, సెప్టెంబర్ 21వ తేదీ నాటికి రూ.1.77 లక్షల కోట్ల రుణాల్ని 44.2 లక్షల కోట్ల బిజినెస్ యూనిట్లకు మంజూరు చేశాయి బ్యాంకులు. ఇందులో 25.74 లక్షల కోట్ల బిజినెస్ యూనిట్లకు రూ.1,25,425 లక్షల కోట్ల రుణాలు జారీ అయ్యాయి. మే నెలలో ప్రారంభించిన ఈ రుణ హామీ పథకం గడువు అక్టోబర్ చివరి నాటికి ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రూ.3 లక్షల కోట్లను క్రెడిట్ గ్యారంటీ స్కీం కింద ఎంఎస్ఎంఈలకు కేటాయించింది.

టర్నోవర్ పరిమితి సవరింపు..

టర్నోవర్ పరిమితి సవరింపు..

12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 24 ప్రయివేటు రంగ బ్యాంకులు, 31 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(NBFC)లు ఈ రుణాలను మంజూరు చేశాయి. ఈ రుణ పథకానికి అర్హత పొందేందుకు అవసరమైన టర్నోవర్ పరిమితిని రెట్టింపుచేసి రూ.50 కోట్లకు సవరించారు. ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.65,52 కోట్లు మంజూరు చేయగా, ప్రయివేటు రంగ బ్యాంకులు రూ.57,756 కోట్లు మంజూరు చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా రూ.19,748 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.8,794 కోట్లు మంజురు చేశాయి.

ఇండివిడ్యువల్స్‌కూ...

ఇండివిడ్యువల్స్‌కూ...

సెప్టెంబర్ 21వ తేదీ నాటికి 2.8 లక్షల ఇండివిడ్యువల్స్‌కు రూ.9,849.74 కోట్లు, 49,393 ప్రొఫెషనల్స్‌కు రూ.2,617.08 కోట్లు మంజూరు చేశారు. కాగా, భారత్‌ను ఎగుమతిలో మరింత ముందుకు తీసుకు వెళ్లే లక్ష్యంలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను సంసిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది.

English summary

మరో నెల రోజులే గడువు.. 44 లక్షల కంపెనీలకు రూ.1.77 లక్షల కోట్లు | Banks sanction loans worth Rs 1.77 lakh crore to 44 lakh MSMEs under credit guarantee plan

The Finance Ministry on Thursday said banks have sanctioned loans of about Rs 1.77 lakh crore to 44.2 lakh business units under the Rs 3-lakh crore Emergency Credit Line Guarantee Scheme (ECLGS) for the MSME sector reeling under the slowdown caused by the coronavirus pandemic.
Story first published: Friday, September 25, 2020, 15:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X