For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త లేబర్ కోడ్ తర్వాత ఉద్యోగులకు అధిక గ్రాట్యుటీ వస్తుంది, దీనిని ఎలా లెక్కిస్తారు?

|

అయిదేళ్లపాటు ఒక సంస్థలో ఉద్యోగం పూర్తిచేసిన తర్వాత ఒక ఉద్యోగికి యాజమాన్యం ఇచ్చే కొంతమొత్తం ఇచ్చి ప్రయోజనం కలిగించేదే గ్రాట్యుటీ. అంటే అయిదేళ్ల పాటు సేవలు అందించిన ఉద్యోగికి కంపెనీలు చెల్లించే మొత్తం ఇది. రిటైర్ అయ్యాక లేదా మధ్యలో ఉద్యోగం వదిలేసినా లేక మధ్యలో కంపెనీ ఉద్యోగం నుండి తొలగించినా సదరు ఉద్యోగికి అయిదేళ్లు పూర్తి చేస్తే గ్రాట్యుటీ వస్తుంది. అయితే గ్రాట్యుటీ చెల్లింపులో కొన్ని షరతులు ఉన్నాయి. గ్రాట్యుటీ చట్టం, ప్రయోజనాలు, అర్హత, గ్రాట్యుటీని ఈజీగా లెక్కించవచ్చు.

గ్రాట్యుటీ అంటే ఇదీ..

గ్రాట్యుటీ అంటే ఇదీ..

గ్రాట్యుటీ అంటే కొంతమంది పీఎఫ్ అని భావిస్తుంటారు. కానీ పీఎఫ్‌కు గ్రాట్యుటీకి సంబంధం లేదు. గ్రాట్యుటీ అంటే మీరు పని చేసిన కంపెనీలో మీ సేవలకు బదులుగా చెల్లించే మొత్తం. 1972 కేంద్ర ప్రభుత్వం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్‌ను రూపొందించింది. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి కంపెనీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. యాక్టులోని నిబంధనలు సంస్థలు, ఉద్యోగులకు వర్తిస్తాయి. అయితే గ్రాట్యుటీకి అర్హత సాధించాలంటే ఆ సంస్థలో కనీసం అయిదేళ్లు సేవలు చేసి ఉండాలి. అయితే ఇక నుండి ఈ నిబంధన మారుతోంది. ఏదైనా సంస్థలో ఒక ఏడాది పని చేస్తే గ్రాట్యూటీ చెల్లించాలి.

గ్రాట్యుటీ పెరుగుతుంది

గ్రాట్యుటీ పెరుగుతుంది

ఇప్పుడు కొత్త వేతన కోడ్ అమలు చేసిన తర్వాత కొంతమంది ఉద్యోగులు వారి జీతాలు పునర్మిణామవుతాయి. కంపెనీలు కనీసం 50 శాతం వేతనాన్ని బేసిక్ శాలరీగా చెల్లించాలి. బేసిక్ శాలరీ తక్కువగా ఉంటే కనుక పారిశ్రామిక సంబంధాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, కోడ్ ఆన్ వేజెస్‌కు అనుగుణంగా బేసిక్ వేతనాన్ని సవరించవలసి ఉంటుంది. ప్రాథమిక వేతనంలో పెరుగుదల నేపథ్యంలో గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది.

గ్రాట్యుటీ కోసం దరఖాస్తు

గ్రాట్యుటీ కోసం దరఖాస్తు

శాలరీ రీస్ట్రక్చర్ నేపథ్యంలో వేతనాలు పెరిగి ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపులో పెరుగుదలకు దారి తీస్తుందని, ఏదేమైనా గ్రాట్యుటీని లెక్కించేందుకు కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 కింద అదే విధంగా ఉంది. ఉద్యోగం మానేసినా, రిటైర్ అయినా నెలలోపు గ్రాట్యుటీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ కంపెనీ గ్రాట్యుటీ ఇవ్వకపోతే తక్కువ ఇవ్వజూపినా దీనిపై అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు..

గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు..

పదిహేను రోజుల బేసిక్ శాలరీ, డీఏ, సర్వీస్ పీరియడ్‌ను కలిపి గ్రాట్యుటీని లెక్కిస్తారు. ఆరు నెలల కంటే ఎక్కువగా చేసిన దానిని సంవత్సరం కిందకే లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఓ కంపెనీలో 19 సంవత్సరాలా ఏడు నెలలు పని చేస్తే అతడు 20 ఏళ్లు పని చేసినట్లు. 15 రోజుల బేసిక్ శాలరీ రూ.24 వేలు, డీఏ రూ.26వేలు అనుకుంటే మొత్తం యాభై వేల రూపాయలు అవుతుంది.

ఆ యాభై వేల రూపాయలను పదిహేను రోజులతో గుణించాలి. ఆ వచ్చిన మొత్తాన్ని సర్వీస్ పీరియడ్ 20 ఏళ్లతో గుణించాలి. ఆ వచ్చిన మొత్తాన్ని మీ వర్కింగ్ డేస్ నెలలో వీక్లీ ఆఫ్స్ పోను 26తో భాగించాలి. అప్పుడు వచ్చిన మొత్తం గ్రాట్యుటీ అవుతుంది. గ్రాట్యుటీకి కనిష్టం, గరిష్ట పరిమితి లేదు.

English summary

కొత్త లేబర్ కోడ్ తర్వాత ఉద్యోగులకు అధిక గ్రాట్యుటీ వస్తుంది, దీనిని ఎలా లెక్కిస్తారు? | You may get higher gratuity after new labour code: know how to calculate it

After the new wage code is implemented, some employees are expected to see their salaries being restructured; companies are required to pay atleast 50% of the salary as basic wage.
Story first published: Monday, March 29, 2021, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X