For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI యోనో యాప్ ద్వారా ఇలా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి

|

ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త. మీరు ఈ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకుకు చెందిన యోనో యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయవచ్చు. యోనోలోని ట్యాక్స్2విన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ను దాఖలు చేసే వెసులుబాటు కల్పిస్తోంది ఎస్బీఐ. ఈ సౌకర్యాన్ని గతంలోనే తీసుకు వచ్చినప్పటికీ, ఇటీవల ఇందుకు సంబంధించి తమ కస్టమర్లకు సమాచారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. 'మీరు ITR దాఖలు చేయాలని భావిస్తున్నారా? యోనో యాప్‌లోని ట్యాక్స్2విన్ ద్వారా ఉచితంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇందుకోసం మీ వద్ద ఐదు డాక్యుమెంట్స్ ఉండాలి. ఎస్బీఐయోనో (sbiyono.sbi) డౌన్ లోడ్ చేసుకొని ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు' అని ట్వీట్ చేసింది.

కావాల్సిన డాక్యుమెంట్స్

కావాల్సిన డాక్యుమెంట్స్

ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి కింది డాక్యుమెంట్స్ అవసరం.

1) పాన్ కార్డు - PAN card

2) ఆధార్ కార్డు - Aadhaar card

3) ఫామ్ 16 - Form-16

4) ట్యాక్స్ డిడక్షన్ వివరాలు - Tax deduction details

5) ఇంటరెస్ట్ ఇన్‌కం సర్టిఫికెట్ - Interest income certificates

6) - ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్ Investment proofs for tax saving

ఇలా ఫైలింగ్

ఇలా ఫైలింగ్

ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి కస్టమర్లు కింది స్టెప్స్ పాటించాలి.

- కస్టమర్లు మొదట ఎస్బీఐ యోనో యాప్‌లోగా లాగ్-ఇన్ కావాలి.

- ఆ తర్వాత యూజర్లు Shops and Orders ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- ఆ తర్వాత Tax and Investment పైన క్లిక్ చేయాలి.

- అక్కడ Tax2Win అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. అందులోని స్టెప్స్‌ను అనుసరించడం ద్వారా ఐటీఆర్‌ను సులభంగా దాఖలు చేయవచ్చు.

ఐటీ రిటర్న్స్ గడువు

ఐటీ రిటర్న్స్ గడువు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఆర్థిక‌ సంవ‌త్స‌రం 2020-21గాను వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు ఆదాయ‌పు రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఈ గ‌డువు తేదీని డిసెంబ‌ర్ 31,2021 పెంచుతున్న‌ట్లు తెలిపింది. కరోనా మహమ్మరి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. ఈ గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

English summary

SBI యోనో యాప్ ద్వారా ఇలా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి | You can file ITR through SBI YONO, Check the list of documents required

The Income Tax payers must note that one can file Income Tax Returns (ITR) with Tax2Win on YONO App.
Story first published: Thursday, October 7, 2021, 21:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X