For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులు సొంతగా UAN నెంబర్ తీసుకోవచ్చు, పెన్షనర్లకూ గుడ్‌న్యూస్

|

న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) తమ అకౌంట్ హోల్డర్ల కోసం సరికొత్త సౌకర్యాన్ని శుక్రవారం నాడు అందుబాటులోకి తీసుకు వచ్చింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)ను ఉద్యోగులు ఇకపై సొంతంగా ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. ఎవరైనా ఉద్యోగాలు మారినా ఒకటే UAN నెంబర్ ఉండే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు UANను యాజమాన్యం ద్వారా పొందవలసి వచ్చేది. ఇక నుంచి ఉద్యోగులు EPFO వెబ్‌‌సైట్ ద్వారా UAN నెంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 2020లో 10% శాలరీ పెంపు, 25% వారికేఉద్యోగులకు గుడ్‌న్యూస్: 2020లో 10% శాలరీ పెంపు, 25% వారికే

ఉద్యోగులు సొంతగా UAN నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు

ఉద్యోగులు సొంతగా UAN నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు

అంటే ఉద్యోగులు తమ యాజమాన్యంపై ఆధారపడకుండా సొంతగా ఈపీఎఫ్ఓ పోర్టల్‌కు వెళ్లి UAN నెంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు. ఉద్యోగికి జీవితకాలం పాటు ఒకే UAN నెంబర్ ఉంటుంది. ఈ నెంబరుతో ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ ట్రాన్సుఫర్ క్లెయిమ్‌తో సంబంధం లేకుండా పీఎఫ్‌ను కొత్త సంస్థకు బదలీ చేసుకోవచ్చు.

డిజిలాకర్ ద్వారా డౌన్‌లోడ్

డిజిలాకర్ ద్వారా డౌన్‌లోడ్

ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ (EPFO) 65 లక్షలమంది పెన్షనర్ల కోసం మరో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వారు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను (PPO), ఇతర పెన్షన్ సంబంధ పత్రాలను ఇకపై డిజిలాకర్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

కాగితరహిత పాలన దిశగా...

కాగితరహిత పాలన దిశగా...

వ్యక్తిగత పెన్షన్‌దారులకు అందుబాటులో ఉండే విధంగా డిపాజిటరీ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆర్డర్ రూపొందించేందుకు ఈపీఎఫ్ఓ, నేషనల్ ఈ-గవర్నరెన్స్ డివిజన్ (NEGD)తో కలిసి పని చేస్తోంది. కాగితరహిత పాలన దిశగా ఈపీఎఫ్ఓ ముందుకు వెళ్తోంది. EPFO 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ ఈ రెండు సౌకర్యాలు ప్రారంభించారు.

English summary

ఉద్యోగులు సొంతగా UAN నెంబర్ తీసుకోవచ్చు, పెన్షనర్లకూ గుడ్‌న్యూస్ | workers can generate UAN from EPFO portal directly

Retirement fund body EPFO on Friday launched a facility for formal sector workers to obtain universal account number online without depending on their employers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X