For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్: ఇలా చేయండి...

|

డిసెంబర్ 15 (ఆదివారం) నుంచి దేశవ్యాప్తంగా FASTag అమలులోకి వచ్చింది. మొదటి రోజు కాబట్టి వాహనదారులు కన్ఫ్యూజ్ అయ్యారు. చాలామందికి FASTag లేవు. అవి ఉన్నప్పటికీ రీఛార్జ్ చేసుకోలేదు. ఇలా ఎన్నో సమస్యలు వచ్చాయి. అయితే FASTag లేనివారి కోసం జనవరి 15 వరకు టోల్ ప్లాజాల వద్ద 25 శాతం లైన్లు ఏర్పాటు చేశారు. FASTag లైన్లలో వెళ్తే కనుక అలాంటి వారు డబుల్ టోల్ కట్టవలసి ఉంటుంది. FASTag వల్ల డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంతో పాటు వాహనదారులకు ఇంధనం ఆదా, ట్రాఫిక్ లేని ప్రయాణం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మొదటిసారి కాబట్టి ప్రారంభంలో సమస్యలు తలెత్తుతున్నాయి.

ఫాస్టాగ్ గురించి కథనాలు

రూ.100 FASTag ఉచితం

రూ.100 FASTag ఉచితం

మీరు FASTag కొనుగోలు చేయకుంటే టోల్ ప్లాజాల వద్ద హైబ్రిడ్ లైన్ల నుంచి వెళ్లి మనీ, ఇతర రూపాల్లో పేమెంట్ చేయవచ్చు. జనవరి 15 వరకు FASTag తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. FASTag లైన్లలో వెళ్తే డబుల్ టోల్ కట్టాల్సి ఉంటుంది. సాధారణంగా FASTag ధర రూ.100. కానీ డిజిటలైజేషన్‌ను, దీనిని ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం ప్రస్తుతం దీనిని ఉచితంగా అందించింది.

FASTag డాక్యుమెంటేషన్

FASTag డాక్యుమెంటేషన్

FASTag కొనుగోలు చేసిన తర్వాత రూ.150 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. అనంతరం దానిని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. KYC డాక్యుమెంట్స్ లేకుంటే FASTag ఇష్యూ చేయరు. FASTag తీసుకోవడానికి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వవలసి ఉంటుంది. అలాగే, మీ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అవసరం.

ఇలా కొనుగోలు చేయండి

ఇలా కొనుగోలు చేయండి

టోల్ ప్లాజా కౌంటర్ల వద్ద FASTag కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎస్బీఐ, ఐసీఐసీఐ,యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకుల నుంచి, పేటీఎం బ్యాంకు వంటి వాటి ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ నుంచి ఆన్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఇలా రీఛార్జ్ చేసుకోవచ్చు

ఇలా రీఛార్జ్ చేసుకోవచ్చు

ఓసారి FASTag కొనుగోలు చేసిన తర్వాత దానిని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI వంటి సాధనాల ద్వారా ఎలాగైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మీ బ్యాంకు అకౌంట్‌కు కూడా లింక్ చేసుకోవచ్చు. అయితే రీచార్జ్ చేయడానికి ముందు వివరాలు ఇచ్చి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. MY FASTag మొబైల్ యాప్ ద్వారా మీకు, మీ వాహనాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి.

English summary

FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్: ఇలా చేయండి... | Without FASTag you will be charged double toll fee, things to know

If you have not bought FASTag for your vehicle yet, get ready to pay double the toll charge from today across national highways in India.
Story first published: Monday, December 16, 2019, 9:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X