For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Credit Cardపై రుణ పరిమితి పెంపునకు ఓకే చెప్పొచ్చా.. దీనివల్ల లాభమా నష్టమా..?

|

ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డు వినియోగం చాలా ఎక్కువైపోయింది.అవసరానికి చేతిలో క్యాష్ లేకుంటే ఆదుకునేది క్రెడిట్ కార్డులే. అయితే దీని వినియోగం సరిగ్గా తెలిస్తే బాగుంటుంది కానీ తెలియకుండా ఇష్టానికి క్రెడిట్ కార్డు వాడితే మాత్రం అంతే స్థాయిలో ఆర్థిక కష్టాలు కూడా తప్పవు. క్రెడిట్ కార్డులు కొత్తగా అప్లయ్ చేసుకుంటే ముందుగా క్రెడిట్ లిమిట్ కాస్త తక్కువగానే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా క్రెడిట్ పరిమితిని పెంచుతాయి ఆయా బ్యాంకులు. ఇక క్రెడిట్ లిమిట్‌ను పెంచుతామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఫోన్లు వస్తే పరిస్థితేంటి.. ఓకే చెప్పాలా.. లేక అక్కర్లేదని సమాధానం ఇవ్వాలా..? క్రెడిట్ కార్డు ఖర్చు పరిమితి పెరిగితే ఎలాంటి లాభాలు ఒనగూరుతాయి.. ఎలాంటి నష్టాలు చేకూరుతాయి..?

ఎక్కువ పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చా..?

ఎక్కువ పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చా..?

క్రెడిట్ కార్డులు.. అవసరానికి ఆదుకునే ఆర్థిక మంత్రం. అయితే ఈ క్రెడిట్ కార్డుల వల్ల ఎంత లాభాలు ఉన్నాయో అంతే నష్టాలు కూడా ఉన్నాయి. కొత్తగా అప్లయ్ చేసుకునేవారికి తక్కువ పరిమితితో కూడిన క్రెడిట్‌ను ఆయా బ్యాంకులు ఇస్తాయి. ఇక కార్డు తీసుకున్న వ్యక్తి ఆదాయంలో పెరుగుదల, తాను క్రెడిట్ కార్డు వినియోగించిన తర్వాత సకాలంలో చెల్లింపుచేసే విధానంపై రుణ పరిమితిని పెంచుతారు. అయితే పెరిగిన క్రెడిట్‌ను అంగీకరిస్తే అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పరిమితి పెరిగితే వడ్డీ కూడా ఆటోమేటిగ్గా పెరుగుతుంది.

 CUR అంటే ఏమిటి..?

CUR అంటే ఏమిటి..?

క్రెడిట్ కార్డుపై ఇచ్చే పరిమితి పెంచితే వచ్చే లాభాల గురించి ముందుగా తెలుసుకుందాం. మీ క్రెడిట్ స్కోరును లెక్కించే సమయంలో క్రెడిట్ బ్యూరో సంస్థలు మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో (CUR)ను పరిగణలోకి తీసుకుంటాయి. క్రెడిట్ కార్డు కలిగిన వ్యక్తి ఆకార్డుపై ఉన్న డబ్బులను ఏమేరకు ఖర్చు చేస్తున్నాడో అనేదాన్ని పరిశీలిస్తాయి. ఇచ్చిన పరిమితిలో 30శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తే ఆ వ్యక్తి ఆర్థిక స్థితిగతులను పసిగడతారు. ఆ వ్యక్తి డీఫాల్టర్‌గా నిలిచే అవకాశాలున్నాయనే అంచనాకు వస్తారు. దీంతో ఒక్కసారిగా 30శాతం పరిమితిని చేరుకోగానే క్రెడిట్ స్కోరును ఈ బ్యూరోలు తగ్గించేస్తాయి. 30శాతంలోగ CURను మెయిన్‌టెయిన్ చేస్తే మంచి క్రెడిట్ స్కోరును సొంతం చేసుకోవచ్చు.

అధిక పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులతో లాభాలేంటి..?

అధిక పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులతో లాభాలేంటి..?

ఆర్థిక ఇబ్బందుల్లో మిమ్మలను క్రెడిట్ కార్డు గట్టెక్కించగలదు. అంటే ఉద్యోగం కోల్పోతే, ఆదాయం లేని సమయంలో క్రెడిట్ కార్డు అప్పటికప్పుడు ఊరటనిచ్చేలా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఎక్కువగా కట్టాల్సి వస్తే ఆ సమయంలో అధిక రుణ మొత్తం ఉన్న క్రెడిట్ కార్డులే సహాయంగా నిలుస్తాయి. ఇక గడువులోగా కార్డు పై వినియోగించిన రుణాన్ని చెల్లించలేకపోతే.. ఆ మొత్తాన్ని ఈఎంఐల కింద మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇలా చేయడం వల్ల ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్‌పై కొంతవరకు వడ్డీని తక్కువగా పడే అవకాశాలున్నాయి. ఇక అదే సమయంలో క్రెడిట్ స్కోరు సరిగ్గా ఉంటే బ్యాంకుల నుంచి అధిక రుణం పొందే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డుపై ఖర్చు చేసి ఆ తర్వాత ఎంత త్వరగా చెల్లింపులు చేశామో అనేదానిపై రుణం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు బ్యాంకు రుణం కోసం ఏ రోజైతే అప్లయ్ చేశామో అదే రోజున ఎలాంటి ఆలస్యం లేకుండా రుణం మంజూరు చేయబడుతుంది.

వడ్డీ భారం ఎక్కువే అవుతుంది

వడ్డీ భారం ఎక్కువే అవుతుంది

ఇక క్రెడిట్ కార్డుల వినియోగంతో ఎదురయ్యే నష్టాలను కూడాఓసారి చూద్దాం. అధిక రుణం కలిగిన క్రెడిట్ కార్డులను పొందడం వల్ల ఖర్చు కూడా అదేస్థాయిలో చేసి చివరకు ఆ డబ్బులు కట్టలేకపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశాలున్నాయి. క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఒక అవగాహనతో వినియోగించనట్లయితే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. మీరు తిరిగి చెల్లించగలమనే ధీమా ఉంటేనే క్రెడిట్ కార్డు పై ఉన్న పరిమితిని ఖర్చు చేయాలని సూచిస్తున్నారు.ఒక వేళ సమయంలోగా చెల్లించనట్లయితే క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయి. భవిష్యత్తులో మీరు తీసుకునే రుణాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం కూడా శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి నెలా క్రెడిట్ కార్డుపై ఖర్చు చేసిన సొమ్మును సమయంలోగా చెల్లించలేకపోతే ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది.

అందుకే క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటేనే మంచిదని ఆ ధీమా ఉంటేనే క్రెడిట్ కార్డును వినియోగించాలని సూచిస్తున్నారు నిపుణులు.

English summary

Credit Cardపై రుణ పరిమితి పెంపునకు ఓకే చెప్పొచ్చా.. దీనివల్ల లాభమా నష్టమా..? | What are the advantages and disadvantages of having a credit card with high limit?

Credit card issuers initially sanction lower credit limits to new card applicants. They are offered higher credit limits later on, as and when card issuers are assured of their repayment behaviour and income growth.
Story first published: Saturday, February 27, 2021, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X