For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డును సరిగ్గానే వినియోగిస్తున్నారా? వాటి కోసం పరుగులు వద్దు!

|

అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డు ఉంటే ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా క్రెడిట్ కార్డును ఉపయోగించే పద్ధతిలో ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనం. కానీ కాస్త ఆలస్యం చేస్తే మాత్రం చక్రవడ్డీ చెల్లించాల్సిందే. క్రెడిట్ కార్డు ఉపయోగం పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ లేకుండే క్రెడిట్ హిస్టరీ కూడా దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో మనం దీనిని ఎలా ఉపయోగిస్తామనేదే కీలకం. మనం క్రెడిట్ కార్డును ఎలా వినియోగించాలి, అలాగే మనం సరిగ్గా వినియోగించడం లేదని చెప్పడానికి ఈ కారణాలను గమనించాలి.

మనం క్రెడిట్ కార్డు ద్వారా వినియోగించుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు కొన్నిసార్లు వీలుకాదు. అప్పుడు కనీస మొత్తాన్ని చెల్లించి అధిక వడ్డీరేటు, ఇతర ఛార్జీ నుండి తప్పించుకోవచ్చు. అయితే తరచూ ఇలా కనీస మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుందంటే అప్రమత్తం కావాలి. అంటే మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడో ఓసారి కనీస మొత్తం చెల్లిస్తే పర్వాలేదు. కానీ పలుమార్లు అలా జరిగితే జాగ్రత్త పడాలి. పూర్తి మొత్తం చెల్లించడం ఇబ్బంది అయితే దీనిని ఈఎంఐ కిందకు మార్చుకోవాలి. లేదా ఎక్కువ ఖర్చుతో కూడిన వస్తువును క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయాలంటే ముందే ఈఎంఐ కిందకు మార్చుకోవడం మంచిది. అవసరమైతే క్రెడిట్ కార్డుపై పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకుంటే పడే వడ్డీ, ఛార్జీతో పోల్చుకుంటే పర్సనల్ లోన్ వడ్డీ రేటు తక్కువ.

Warning signs of incorrect credit card usage

మీ క్రెడిట్ లిమిట్‌లో కనీసం మీరు ఎంత మొత్తం వినియోగించుకుంటున్నారని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో వెల్లడిస్తుంది. ఇది 30 శాతానికి మించితే రిస్క్ అని అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ ఈ మార్కు దాటితే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ముప్పై శాతానికి మించితే మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచమని బ్యాంకులను కోరవచ్చు. లేదా అదనపు కార్డు తీసుకోవాలి.

రివార్డ్ పాయింట్స్‌ను కొంతమంది పట్టించుకోరు. మీరు చేసిన ఖర్చు ఆధారంగా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్లకు కాలపరిమితి ఉంటుంది. ఈ కాలపరిమితి దాటితే వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనం కోల్పోయినట్లే. వాస్తవానికి క్రెడిట్ కార్డుకు చెల్లించే వార్షిక రుసుము ఆ కార్డు ప్రయోజనాలను బట్టి ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ ఉంటే కార్డు ఛార్జీ ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఛార్జీ చెల్లించి రివార్డ్ పాయింట్స్ ప్రయోజనం ఉపయోగించుకోకుంటే నష్టపోతారు.
మన రివార్డ్ పాయింట్స్‌ను, ఎలా, ఎక్కడ వినియోగించుకోవాలనే అంశాన్ని తరుచూ చెక్ చేసుకోవడం మంచిది.

క్రెడిట్ కార్డుతో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి పరిమితి ఉంటుంది. నగదు అత్యవసరమైతే తప్ప తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే నగదు తీసుకున్న తర్వాత రోజు నుండి వడ్డీ ప్రారంభమవుతుంది. వడ్డీ రేటు కూడా 23 శాతం నుండి 49 శాతం మధ్య ఉంటుంది. మరో విషయం ఏమంటే నగదు తీసుకుంటే 3.5 శాతం వరకు ఛార్జీ కింద వసూలు చేస్తారు. కాబట్టి నగదు తీసుకోకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. నగదు తీసుకుంటే బిల్లింగ్ సైకిల్ ఉండదు. అత్యవసరంగా తీసుకున్నప్పటికీ త్వరగా చెల్లించడం మంచిది.

ప్రతి క్రెడిట్ కార్డుకు బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ 45 రోజులు అనుకుంటే, మీరు బిల్లింగ్ సైకిల్ తొలి రోజు డబ్బులు తీసుకుంటే 45 రోజుల గడువు ఉంటుంది. 30 రోజులకు తీసుకుంటే 15 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ గడువులో వడ్డీ ఉండదు. కానీ ఆ తర్వాత చెల్లించకుంటే మాత్రం వడ్డీ మీద వడ్డీ పడి భారంగా మారుతుంది. బిల్లింగ్ సైకిల్ ప్రారంభంలోనే కొనుగోలు చేయడం మంచిది. అప్పుడు చెల్లింపులు జరపడానికి ఎక్కువ సమయం ఉంటుంది.

క్రెడిట్ కార్డు వినియోగాన్ని పెంచేందుకు ఆయా సంస్థలు పలు స్కీమ్స్ ప్రకటిస్తాయి. ఇందులో రివార్డ్ పాయింట్స్ ఒకటి. ఇంత వినియోగిస్తే ఇన్నిపాయింట్స్ అని ఉంటుంది. వందల రూపాయల్లో ఖర్చు చేస్తే రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అయితే ఇవి ఖర్చు చేస్తేనే వస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. అందుకే అనవసరంగా ఖర్చు చేయవద్దు. అనవసరమైన ఉత్పత్తులు కొనుగోలుకు దూరంగా ఉండాలి. చేతిలో నగదు లేకపోయినా కొనుగోలు చేసే సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు ఇస్తుంది. కానీ అదే సమయంలో దుబారాకు కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

క్రెడిట్ కార్డు ద్వారా చేసిన ఖర్చులను పూర్తిగా చెల్లించకుండా కనీస మొత్తాన్ని చెల్లించి మిగతా చెల్లింపులు వాయిదా వేయడమే రోలింగ్ క్రెడిట్. ఇది నిత్యం చేయడం సరికాదు. ఇలాంటి క్రెడిట్ మీద ప్రతి సంవత్సరం 40 శాతం వడ్డీ, దాని మీద జీఎస్టీ కలిపితే నెలకు చెల్లించే వడ్డీతే దాదాపు 45 శాతం వరకు అదనపు భారం అవుతుంది.

దుబారా ఖర్చును తగ్గించుకోవడానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డును లాక్ చేసుకోవచ్చు కూడా. ఈ కార్డ్స్ వినియోగించే సమయంలో సింగిల్ ట్రాన్సాక్షన్‌లో ఎంత‌ వ‌ర‌కు తీసుకోవాలనే దానికి పరిమితి సెట్ చేసుకోవచ్చు. సింగిల్ ట్రాన్సాక్షన్‌లో ఓ కార్డుపై రూ.10వేలకు మించి వద్దనుకుంటే అందుకు తగినట్లు సెట్ చేసుకోవచ్చు. కార్డు పరిమితిని సెట్ చేసుకునే విధానం బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంది.

English summary

క్రెడిట్ కార్డును సరిగ్గానే వినియోగిస్తున్నారా? వాటి కోసం పరుగులు వద్దు! | Warning signs of incorrect credit card usage

While credit cards bring multiple benefits for their users, they can cause significant risks for those lacking financial discipline.
Story first published: Monday, September 6, 2021, 21:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X