For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే.. దరఖాస్తు ప్రాసెస్ సవరించిన UIDAI!

|

ఆధార్ కార్డులో ఎలాంటి ఆధారం లేకుండా చిరునామాను మార్చే సేవలను నిలిపివేసినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఇటీవల ధృవీకరించింది. ఆధార్ కార్డులో తమ చిరునామా వివరాలను మార్చాలని కోరుకునే దరఖాస్తుదారు ఇప్పుడు UIDAI జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఏదైనా చిరునామా రుజువును సమర్పించవలసి ఉంటుంది. ఆగస్ట్ 10, 2021న చేసిన ట్వీట్ ప్రకారం UIDAI చెప్పిన దాని ప్రకారం 'అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ ఫెసిలిటీ సేవలు నిలిపివేయబడినవి. మరో ఈ జాబితాలోని మరో చెల్లుబాటు అయ్యే PoA డాక్యుమెంట్‌ను ఉపయోగించి మీ చిరునామా నవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి' అని పేర్కొంది. ఆధార్ కార్డులో మీ చిరునామాను మార్చుకోవడానికి ఈ దిగువ విషయాలు గమనించండి.

ఆధార్ కార్డు‌లో అడ్రస్ మార్చుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ చూడండి. మీ అడ్రస్ ప్రూఫ్ కోసం దిగువ పేర్కొనబడిన ఏదైనా డాక్యుమెంట్‌ను సమర్పించవచ్చు లేదా ఉపయోగించవచ్చు.

UIDAI Modifies Application Process For Address Change In Aadhaar Card

1. పాస్ పోర్ట్

2. బ్యాంకు స్టేట్మెంట్/ పాస్ పోర్ట్

3. పోస్టాఫీస్ అకౌంట్ స్టేట్మెంట్/పాస్ బుక్

4. రేషన్ కార్డు

5. వోటర్ ఐడీ

6. డ్రైవింగ్ లైసెన్స్

7. గవర్నమెంట్ ఫోటో ఐడీ కార్డ్/PSU జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు

8. విద్యుత్ బిల్లు (మూడు నెలల లోపుది అయి ఉండాలి)

9. వాటర్ బిల్లు (మూడు నెలల లోపుది అయి ఉండాలి)

10. టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు (మూడు నెలల లోపుది అయి ఉండాలి)

11. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ (మూడు నెలల లోపుది అయి ఉండాలి)

12. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ (మూడు నెలల లోపుది అయి ఉండాలి)

13. ఇన్సురెన్స్ పాలసీ

14. బ్యాంకు లెటర్ హెడ్ పైన ఫోటో కాపీ కలిగిన సంతకం చేసిన లెటర్.

15. రిజిస్టర్డ్ కంపెనీ లెటర్ హెడ్ పైన ఫోటో కాపీ కలిగిన సంతకం చేసిన లెటర్.

16. గుర్తింపు పొందిన విద్యా సంస్థ లెటర్ హెడ్ పైన ఫోటో కాపీ కలిగిన సంతకం చేసిన లెటర్. గుర్తింపు పొందిన విద్యా సంస్థ లెటర్ హెడ్ లేదా ఫోటో ఐడీ కలిగిన అడ్రస్ ప్రూఫ్.

17. NREGA జాబ్ కార్డు

18. ఆర్మ్స్ లైసెన్స్

19. పెన్షనర్ కార్డు

20. ఫ్రీడమ్ ఫైటర్ కార్డు

21. కిసాన్ పాస్ బుక్

22. CGHS/ ECHS కార్డు

23. ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దారు జారీ చేసిన ఫోటో కాఫీ కలిగిన అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికెట్.

24. విలేజ్ పంచాయత్ హెడ్ లేదా సమాన అధికారి జారీ చేసిన అడ్రస్ సర్టిఫికెట్ (గ్రామీణ ప్రాంతాల్లో).

25. ఇన్‌కం ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డర్ 26. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.

27. రిజిస్టర్డ్ సేల్/ లీజ్/ రెంట్ అగ్రిమెంట్

28. పోస్టల్ డిపార్టుమెంట్ జారీ చేసిన ఫోటో కాపీ కలిగిన అడ్రస్ కార్డు.

29. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫోటో కాపీ కలిగిన క్యాస్ట్ అండ్ డొమిసిల్ సర్టిఫికెట్

30. డిజబులిటీ ఐడీ కార్డు/ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా కాంద్ర ప్రభుత్వం లేదా అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన హ్యాండీ క్యాప్డ్ మెడికల్ సర్టిఫికెట్.

31. గ్యాస్ కనెక్షన్ బిల్లు (మూడు నెలల లోపుది అయి ఉండాలి)

32. భాగస్వామి పాస్ పోర్టు

33. మైనర్ అయితే తల్లిదండ్రుల పాస్ పోర్ట్.

34. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అకామిడేషన్ అలాట్మెంట్ లెటర్ (3 సంవత్సరాల లోపు ఉండాలి.)

35. ప్రభుత్వం జారీ చేసినమ్యారేజ్ సర్టిఫికెట్. ఇందులో అడ్రస్ ఉండాలి.

36. ప్రభుత్వం జారీ చేసిన భామాషా కార్డు/జన్ ఆధార్ కార్డు.

37. Certificate from Superintendent/ Warden/ Matron/ Head of Institution of recognized shelter homes or orphanages etc. on UIDAI standard certificate format for enrolment/ update

38.Certificate of Address having photo issued by Municipal Councillor on UIDAI standard certificate format for enrolment/ update

39. గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ జారీ చేసిన ఐడెంటిటీ కార్డు.

40. ఫోటో గ్రాఫ్ కలిగిన SSLC బుక్

41. స్కూల్ ఐడెంటిటీ కార్డు

42. పేరు, చిరునామా కలిగిన స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC)/ స్కూల్ ట్రాన్సుఫర్ సర్టిఫికెట్(TC).

43. పేరు, చిరునామా, ఫోటో గ్రాఫ్ కలిగిన స్కూల్ ారీ చేసిన పత్రం.

44. గుర్తింపు పందిన ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ హెడ్.. పేరు, అడ్రస్, ఫోటో కలిగిన సర్టిఫికెట్ జారీ చేసినప్పుడు. ( UIDAI standard certificate format for enrolment/ update)

45. ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్టిఫికెట్. ఇందులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో గ్రాఫ్ ఉండాలి. (UIDAI standard certificate format for enrolment/ update.)

English summary

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే.. దరఖాస్తు ప్రాసెస్ సవరించిన UIDAI! | UIDAI Modifies Application Process For Address Change In Aadhaar Card

According to UIDAI, here is the list of documents that serves as proof of address to change address in your Aadhaar Card. You can submit or use any of the below-listed documents as your proof of address.
Story first published: Tuesday, August 17, 2021, 19:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X