యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI).. ఆధార్ కార్డులో పేరు, జెండర్, పుట్టిన తేదీ మార్పు చేసుకునే నిబంధనలను మార్చింది. వీటిని ఇష్టం వచ్చినన్నుసార్లు మార్చుకోవడానికి కుదరదు. ఇప్పుడు దానిని పరిమితం చేసింది. గతంలో అవసరమైనప్పుడల్లా ఆధార్ కార్డులో వివరాలు మార్చుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు రూల్స్ మారాయి. ఆధార్ అప్ డేట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అవేమిటో తెలుసుకోండి...

ఆధార్‌లో పేరును ఎన్నిసార్లు మార్పులు చేసుకోవచ్చు?
UIDAI ఆఫీస్ మెమోరాండం ప్రకారం ఆధార్ కార్డులో మీ పేరును కేవలం రెండుసార్లు మాత్రమే మార్చుకునే వెసులుబాటు ఉంది.

ఆధార్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్పులు చేసుకోవచ్చు?
UIDAI ఆఫీస్ మెమోరాండం ప్రకారం పుట్టిన తేదీని నవీకరించేందుకు సంబంధించిన నియామకాలను కఠినతరం చేసింది. పుట్టిన తేదీలో మార్పును ఒకేసారి చేసుకోవచ్చు. అంతేకాదు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లో తొలిసారి నమోదైన పుట్టిన తేదీ మార్పును ప్లస్ 3 ఏళ్లు లేదా మైనస్ 3 ఏళ్లు మాత్రమే చేసుకోవచ్చు.

పుట్టిన తేదీ మార్పుకు అవసరమైన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు కూడా అవసరం. కచ్చితమైన ప్రూఫ్స్ ఉంటేనే మార్చుకోవచ్చు. ఒకవేళ ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఎవరికైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుంటే ప్రకటించిన లేదా అప్రాక్సిమేట్ వయస్సును నమోదు చేస్తుంది. ఇండివిడ్యువల్స్ ఎవరైనా భవిష్యత్తులో పుట్టిన తేదీని మార్చుకోవాలనుకుంటే డాక్యుమెంట్ ప్రూఫ్స్ అవసరం.

ఆధార్‌లో జెండర్‌ను ఎన్నిసార్లు మార్పులు చేసుకోవచ్చు?
ఆధార్ కార్డులో జెండర్‌ను కేవలం ఒకసారి మాత్రమే అప్ డేట్ చేసుకోగలం. UIDAI ఆఫీస్ మెమోరాండంలో ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేసింది.

పరిమితికి మించి మార్పులు కావాలంటే?
పరిమితికి మించి మార్పులు చేసుకోవాలంటే UIDAI రీజినల్ ఆఫీస్‌కు వెళ్లవలసి ఉంటుంది. యతేా పరిమితి దాటిన తర్వాత కూడా మళ్లీ ఆధార్ అప్‌డేట్ ఎందుకు అవసరమైందో తెలియజేస్తూ [email protected] కు మెయిల్ చేయాలి. మీరు చెప్పిన కారణాలకు రీజినల్ ఆఫీస్ ఒకే చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ రిక్వెస్ట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్తుంది. అప్పుడు ఆధార్ అప్ డేట్ అవుతుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications