For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలకు బాల్ ఆధార్ కార్డు తీసుకోండి ఇలా..

|

భారత్‌లో వయోజన పౌరులు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) నుండి 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్‌ను పొందవచ్చు. అయిదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకుసంబంధించి తల్లిదండ్రులు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయిదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్ ఉండదు.

తల్లిదండ్రుల యూఐడీతో అనుసంధానించబడిన జనాభా సమాచారం, ఫేసియల్ ఫోటోగ్రాఫ్ ఆధారంగా వారి యూఐడీ ప్రాసెస్ చేయబడుతుంది. ఈ పిల్లలు 5 ఏళ్ల నుండి 15 ఏళ్ల వరకు పది వేళ్ల బయోమెట్రిక్, ఐరిష్, ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. అయిదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బిల్లలకు మాత్రం బాల్ ఆధార్ కార్డు ఉంటుంది.

బాల్ ఆధార్ కార్డు

బాల్ ఆధార్ కార్డు

అయిదేళ్ల సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం బాల్ ఆధార్ కార్డు పొందే వారికి ఓ గమనిక. పిల్లలకు బయోమెట్రిక్ ఉండదు. అయితే పిల్లలు అయిదేళ్ల వయస్సు దాటిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి. UIDAI ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలతో సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి వారి బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయాలి.

అయిదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బ్లూ కలర్, బాల్ ఆధార్ కార్డు ఇస్తారు. బయోమెట్రిక్ అప్ డేట్ తప్పనిసరి. మీ పిల్లల్ని సమీపంలోని ఆధార్ కేంద్రానికి తీసకు వెళ్లి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్ డేట్ చేయాలని UIDAI ట్వీట్ చేసింది.

ఆధార్ కేంద్రాన్ని గుర్తించి....

ఆధార్ కేంద్రాన్ని గుర్తించి....

మీ సమీప ఆధార్ కేంద్రాన్ని ఇలా గుర్తించండి. అపాయింటుమెంట్ తర్వాత సమీపంలోని ఆధార్ కేంద్రానికి పిల్లలను తీసుకు వెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్ అప్ డేట్ పూర్తి చేసుకోవాలి. మీ సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించడానికి ఇలా చేయండి.

appointments.uidai.gov.in/easearch.aspx?AspxAutoDetectCookieSupport=1 లోకి వెళ్లి ఈ స్టెప్స్ పాటించండి.

ఇక్కడ మీ రాష్ట్రం, పోస్టల్ కోడ్, మీ రిలీజియన్‌ను ఎంచుకోవాలి.

అక్కడ అవసరమైన వివరాలు ఇవ్వండి.

Locate Centre ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

మీరు స్థానిక ఆధార్ కేంద్రాన్ని కనుగొని, అపాయింటుమెంట్ ఇచ్చాక మీ పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవడానికి అక్కడకు తీసుకు వెళ్లాలి.

బాల్ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు

బాల్ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు

UIDAI అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించి, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ ఎంపిక పైన క్లిక్ చేయాలి.

మీ పిల్లల పేరు, మీ చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్, అడ్రస్, ప్రాంతం, రాష్ట్రం మొదలైన వివరాలు ఇవ్వాలి.

మీ పల్లల ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ కోసం షెడ్యూల్ చేయడం కోసం Appointment పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ నమోదు స్థితిని ఎంచుకోవాలి. మీకు అనుగుణంగా ఎంచుకోవాలి.

షెడ్యూల్ చేసిన తేదీన మీరు మీ పిల్లలతో ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆప్ రిలేషన్‌షిప్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి.

మీ పిల్లల వయస్సు అయిదేళ్లు ఉంటే బయోమెట్రిక్ డేటా అవసరం. పిల్లల వయస్సు అయిదేళ్ల కంటే తక్కువ ఉంటే బయోమెట్రిక్ అవసరం.

మీ పిల్లల బయోమెట్రిక్ వివరాలను విజయవంతంగా ప్రామాణికరించిన తర్వాత మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రిసిప్ట్ వస్తుంది.

అఫ్లికేషన్ వివరాలు తెలుసుకోవడానికి మీ రిసిప్ట్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. మీ పిల్లల బాల్ ఆధార్ కార్డు 90 రోజుల్లో మీ ఇంటికి చేరుతుంది.

English summary

మీ పిల్లలకు బాల్ ఆధార్ కార్డు తీసుకోండి ఇలా.. | This Update Regarding Baal Aadhaar Card For Your Child

In India, adult citizens and children under the age of five can acquire a 12-digit Aadhaar number from the Unique Identification Authority of India (UIDAI).
Story first published: Tuesday, July 27, 2021, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X