For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FD డిపాజిట్‌పై రుణం తీసుకుంటున్నారా.. తెలుసుకోండి: డిఫాల్ట్ అయితే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం

|

తక్కువ ఖర్చుతో నిధులు సేకరించడానికి అత్యంత అనుకూలమైన మార్గాలలో ఫిక్స్డ్ డిపాజిట్(FD) ఒకటి. మీరు రెండు విధులుగా FD పైన రుణం తీసుకోవచ్చు. రుణం తీసుకోవం లేదా ఓవర్ డ్రాఫ్ట్ జారీ చేయమని బ్యాంకును అడగడం. ఓవర్ డ్రాఫ్ట్‌లో స్థిర డిపాజిట్ వ్యాల్యూ ఆధారంగా బ్యాంకు పరిమితి ఉంటుంది. రుణగ్రహీత స్థిర డిపాజిట్ రూ.10 లక్షలు ఉంటే కనుక బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ (OD) ద్వారా రుణం తీసుకునే వారు రూ.9 లక్షల ఉపసంహరించుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ పైన తిరిగి చెల్లించేందుకు నిర్ణీత కాల వ్యవధి లేదు. రుణగ్రహీత డబ్బును కలిగి ఉన్నంత వరకు వడ్డీని చెల్లిస్తుండాలి.

FD వడ్డీ కంటే రుణ వడ్డీ రేటు ఎక్కువ

FD వడ్డీ కంటే రుణ వడ్డీ రేటు ఎక్కువ

FD పైన రుణం తీసుకుంటే ఇతర రుణాల మాదిరిగానే ఉంటుంది. రుణ గ్రహీత ఒకేసారి ఈ డబ్బును పొందుతాడు. అలాగే ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తాడు. సాధారణంగా బ్యాంకులు రుణం ఇచ్చినప్పుడు FD రేటు కంటే రెండు శాతం ఎక్కువగా వసూలు చేస్తాయి. ఒక డిపాజిటర్ FD వడ్డీ రేటు 7 శాతంగా ఉంటే, FD పైన రుణం పొందాలంటే 9 శాతం వడ్డీ ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు FD వడ్డీ రేటు కంటే 0.75 శాతం, 1 శాతం అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి.

క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం

క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం

కొన్ని సందర్భాల్లో FD కంటే ఫిక్స్డ్ డిపాజిట్ పైన రుణం తీసుకోవడం మంచిది. ఉదాహరణకు ఓ బ్యాంకులో మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూ.10 లక్షలుగా ఉంటే, మీకు రూ.3 లక్షల వరకు అవసరమైతే, రుణం తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవసరం కోసం FDని తీసుకుంటే ముందస్తు ఉపసంహరణపై జరిమానా ఉంటుంది. ఇలా జరిమానా చెల్లించడం కంటే రుణం మంచి ఎంపిక. అది పరిమిత కాలంలో చెల్లిస్తే మంచిది. అలా కాకుండా పరిమిత కాలంలో చెల్లించే అంశంపై క్లారిటీ లేకుంటే FDని తీసుకోవడం మంచిది. FD పైన తీసుకునే రుణం డిఫాల్ట్ అయితే క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది.

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

ఎఫ్డీ డిపాజిట్ల‌పై SBI 2.90 శాతం నుండి 5.40 శాతం వ‌ర‌కు వివిధ కాల‌ప‌రిమితుల‌కు వ‌డ్డీ అందిస్తోంది. రుణాల‌పై బ్యాంకు అందించే వ‌డ్డీ రేటు కంటే 1 శాతం అధికంగా వ‌డ్డీ వ‌సూలు చేస్తుంది. ఆన్‌లైన్లో క‌నీసం రూ.25వేల‌ వ‌ర‌కు ఎఫ్డీపై రుణం తీసుకోవ‌చ్చు. బ్యాంకు బ్రాంచీలో క‌నీస ప‌రిమితి లేదు. రుణ విలువ‌లో గ‌రిష్టంగా 90 శాతం రుణం అందిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు 3 శాతం నుండి 5.3 శాతం వరకు FD వడ్డీ అందిస్తోంది. రుణాలపై వడ్డీ 0.75 శాతం అధికం ఉంటుంది. గరిష్టంగా FD వ్యాల్యూపై 95 శాతం రుణం పొందవచ్చు.

మరిన్ని బ్యాంకులు..

మరిన్ని బ్యాంకులు..

ఇండియన్ బ్యాంకు FD వడ్డీ రేటు 2.9 శాతం నుండి 5.25 శాతం. రుణం పై వడ్డీ రేటు 2 శాతం అధికం. అంటే ఇక్కడ FD కంటే అధికం. డిపాజిట్ వ్యాల్యూ గరిష్టంగా 90 శాతం.

సిటీ బ్యాంకు FD వడ్డీ రేటు 1.85 శాతం నుండి 3.5 శాతం. రుణ తీసుకుంటే వడ్డీ రేటు 2.5 శాతం అధికం. కనీస రుణం రూ.1 లక్ష. డిపాజిట్ వ్యాల్యూలో 90 శాతం.

HDFC బ్యాంకు FD వడ్డీ రేటు 2.50 శాతం నుండి 5.50 శాతం. రుణ తీసుకుంటే వడ్డీ రేటు 2 శాతం అధికం. కనీస రుణం రూ.25 వేలు. డిపాజిట్ వ్యాల్యూలో 90 శాతం.

యాక్సీస్ బ్యాంకు FD వడ్డీ రేటు 2.50 శాతం నుండి 5.75 శాతం. రుణ తీసుకుంటే వడ్డీ రేటు 2 శాతం అధికం. కనీస రుణం రూ.25 వేలు. డిపాజిట్ వ్యాల్యూలో 85 శాతం.

English summary

FD డిపాజిట్‌పై రుణం తీసుకుంటున్నారా.. తెలుసుకోండి: డిఫాల్ట్ అయితే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం | Things to know before taking loan against fixed deposit

Fixed deposits are one of the most convenient ways to raise funds at a lower cost. You can borrow against FD in two ways - take a loan or ask the bank to issue an overdraft (OD).
Story first published: Friday, April 23, 2021, 15:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X