For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా... SBI మ్యూచువల్ ఫండ్ సిప్ క్యాన్సిలేషన్ ఇలా చేయండి

|

పెట్టుబడిదారులు ఓ సిప్‌ను ప్రారంభిస్తే, వారికి ఇష్టం ఉన్నంత కాలం దానిని కొనసాగించవచ్చు. అంటే దానిని ఎప్పుడైనా ముగించవచ్చు. ఎవరైనా పెట్టుబడిదారు సిప్ మొత్తాన్ని సర్దుబాటు చేయాలనుకుంటే దానిని ఆపివేసి, కొత్త దానిని ప్రారంభించాలి. ఎస్బీఐ దీర్ఘకాలిక, మధ్యకాలిక, షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌ను అందిస్తోంది. అలాగే, ఈ బ్యాంకు మ్యూచువల్ ఫండ్ సంబంధిత సేవలు అందిస్తోంది. ఇందులో మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్స్, మ్యూచువల్ ఫండ్ గైడ్స్, ట్యాక్సి సేవింగ్స్ చాయిస్ మరెన్నో అందిస్తోంది.

క్యాన్సిల్ చేయడం తప్పనిసరి

క్యాన్సిల్ చేయడం తప్పనిసరి

మీరు ఎస్బీఐ బ్యాంకు మ్యూచువల్ ఫండ్‌లో సిప్‌ను కలిగి ఉంటే, దానిని లిక్విడేట్ చేయాలనుకుంటే దానిని తప్పనిసరిగా రద్దు చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికే ఉన్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌ను ఎలా క్యాన్సిల్ చేయాలో తెలియాలి. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఎస్బీఐ బ్యాంకు మ్యూచువల్ ఫండ్‌ను రద్దు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో నుండి మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా వీటిని క్యాన్సిల్ చేయవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా క్యాన్సిలేషన్

ఆన్‌లైన్ ద్వారా క్యాన్సిలేషన్

- మొదట ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

- క్రెడెన్షియల్స్ ద్వారా లాగ్-ఇన్ కావాలి.

- మేనేజ్ అకౌంట్ ఆప్షన్‌లోకి వెళ్లాలి.

- మీరు క్యాన్సిల్ చేయాలనుకున్న సిప్‌ను ఎంచుకోవాలి. దానిని కన్‌ఫర్మ్ చేయాలి.

- వివరాలు నింపండి.

- ఆ తర్వాత దానిని సబ్‌మిట్ చేయాలి.

- ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్ సైట్‌లోకి వెళ్లి లింక్ ద్వారా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు.

ఏజెంట్ ద్వారా క్యాన్సిలేషన్, ఆఫ్ లైన్ ద్వారా

ఏజెంట్ ద్వారా క్యాన్సిలేషన్, ఆఫ్ లైన్ ద్వారా

ఎస్బీఐ బ్యాంకు సిప్‌ను క్లోజ్ చేయడానికి మరో ఆప్షన్ ఏజెంట్. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏజెంట్‌ను సంప్రదించి, మీ సిప్ క్లోజింగ్ గురించి తెలపాలి. అభ్యర్థనను సమర్పించిన అనంతరం మీరు సంబంధిత వివరాలను అందించవచ్చు. మీ సిప్ మ్యూచువల్ ఫండ్ పోర్టల్ అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి లాగ్-ఇన్ అవుతారు.

బ్యాంకు బ్రాంచీని సంప్రదించి బ్యాంకు ఖాతా, ఫోలియో నెంబర్, సిప్ స్కీం నేమ్, సిప్ అమౌంట్, పాన్ వివరాలు అందించాలి.

ఇవి అవసరం

ఇవి అవసరం

సిప్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్‌కు పలు వివరాలు అవసరం. సిప్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్‌కు ఇవి అవసరం...

స్కీం ఏమిటి, ప్లాన్, సిప్ ఆటో డెబిట్ డేట్, ఫ్రీక్వెన్సీ(వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ), సిప్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అవసరం.

పైన పేర్కొన్న వ్యక్తిగత వివరాలతో పాటు మీరు ఎస్టీపీ రద్దు అభ్యర్థన కోసం ఈ క్రింది వివరాలు అందించాలి.

రెగ్యులర్, ఎస్టీపీ, సీఏఎస్ ఎస్టీపీ, ఫ్లెక్స్ ఎస్టీపీ వంటివి.

ఎస్టీపీ ఫ్రీక్వెన్సీ.

ఎన్‌రోల్‌మెంట్ పీరియడ్ (డెయిలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ)

ఎస్టీపీ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం

SWP క్యాన్సిలేషన్ రిక్వెస్ట్

పైన పేర్కొన్న వివరాలతో పాటు స్వాప్ క్యాన్సిలేషన్ కోసం.. ప్లాన్, ఆప్షన్ ఫ్రీక్వెన్సీ, SWP ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం, SWP తేదీ అవసరం.

English summary

ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా... SBI మ్యూచువల్ ఫండ్ సిప్ క్యాన్సిలేషన్ ఇలా చేయండి | These are required to cancel Mutual Fund SIP with the SBI

For the SIP Cancellation Request with SBI you have to specify the details like scheme, plan, SIP auto debit date and etc.
Story first published: Friday, July 16, 2021, 17:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X