For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBIలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఇలా తెరవండి, ప్రయోజనాలు

|

సుకన్య సమృద్ధి యోజన(SSY) గవర్నమెంట్ బ్యాక్డ్ స్మాల్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం. ఆడపిల్లల భవిష్యత్తు కోసం 2014లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. పోస్టాఫీస్ లేదా ఆథరైజ్డ్ కమర్షియల్ బ్యాంకులో మీ చిన్నారి పేరున SSY ఖాతాను తెరువవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ ఖాతాను తెరువవచ్చు. తల్లిదండ్రులు తమ గరిష్టంగా ఇద్దరు కూతుళ్ల పేరు మీత SSY ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఖాతాను ఎలా తెరువాలో తెలుసుకుందాం...

అవసరమైన డాక్యుమెంట్లు

అవసరమైన డాక్యుమెంట్లు

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచేందుకు అవసరమైన డాక్యుమెంట్స్.. SSY అకౌంట్ ఓపెనింగ్ ఫాం. బెనిఫిషియరీ (చిన్నారి) పుట్టిన తేదీ సర్టిఫికెట్, పాప తల్లిదండ్రులు లేదా సంరక్షుల చిరునామా ప్రూఫ్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఐడీ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

ఎస్బీఐలో ఓపెన్ చేయడం ఎలా?

ఎస్బీఐలో ఓపెన్ చేయడం ఎలా?

SSY అకౌంట్ దరఖాస్తును నింపాలి.

డాక్యుమెంటేషన్, ఫోటోగ్రాఫ్స్ అవసరం.

అవసరమైన డిపాజిట్ పేమెంట్‌ను చేయాలి.

ఖాతా తెరిచేందుకు కనీస డిపాజిట్ రూ.250.

ప్రతి ఏడాది కనీస డిపాజిట్ మొత్తం రూ.250, గరిష్ట డిపాజిట్ మొత్తం రూ.1.50 లక్షలు.

వడ్డీ రేటు, ట్యాక్స్ బెనిఫిట్స్

వడ్డీ రేటు, ట్యాక్స్ బెనిఫిట్స్

ప్రస్తుత మార్చి త్రైమాసికం వరకు వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. వడ్డీ రేటును ఏడాది ప్రాతిపదికన లెక్కిస్తారు. వడ్డీ మొత్తం కూడా ఏడాది ప్రాతిపదికన ఇస్తారు.

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. తాజా ఫైనాన్స్ బిల్లులో ఈ పథకంపై ట్రిపుల్ మినహాయింపు ప్రయోజనాలను పొడిగించారు. ఇందులో పెట్టుబడి మొత్తం, వడ్డీ మొత్తం, ఉపసంహరించుకున్న మొత్తంపై పన్ను వర్తించదు.

ఫీచర్స్

ఫీచర్స్

- సుకన్య సమృద్ధి యోజన కింద ఇద్దరు ఆడపిల్లల పేర్లపై ఖాతాను తెరువవచ్చు. ఒకవేళ మొదటిసారి ఆడపిల్ల జన్మించి, రెండోసారి కవలలు జన్మిస్తే కనుక ముగ్గురిపై ఖాతా తెరువవచ్చు.

- సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు.

- పదిహేనేళ్లు ఇన్వెస్ట్ చేయాలి.

- సుకన్య సమృద్ధి యోజనం నుండి అమ్మాయికి పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతనే డబ్బులు తీసుకునే వీలుంది.

English summary

SBIలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఇలా తెరవండి, ప్రయోజనాలు | Sukanya Samriddhi Yojana : How to open SSY account with SBI?

Sukanya Samriddhi Yojana is a government-backed small savings scheme. This scheme is a good option for parents to invest in their girl child's future. SSY accounts can be opened with post offices or authorised commercial banks. One of the banks providing the service to open a SSY account is the State Bank of India.
Story first published: Wednesday, January 26, 2022, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X