త్వరలో మీరు మీ ఇన్సురెన్స్ పాలసీ డాక్యుమెంట్లను ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మేరకు బీమా కంపెనీలు డిజిలాకర్ సదుపాయం గురించి రిటైల్ పాలసీదారులకు తెలియజేయాలని, దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియజేయాలని ఇన్సురెనన్స్ రెగ్యులేటర్ Irdai సూచించింది. దీని ప్రకారం పాలసీదారులు తమ పాలసీలను డిజిలాకర్‌లో ఉంచే ప్రక్రియను కూడా బీమా సంస్థలు ప్రారంభించాలి.

డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు
ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్, కారు రిజిస్ట్రేషన్, ఓటరు ఐడీ, పాన్ కార్డు, స్కూల్, కాలేజ్ సర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలను డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు. అయితే త్వరలో బీమా పాలసీలను డిజిలాకర్‌లో కూడా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచవచ్చు. బీమా రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఆలోచనతో, పాలసీదారులకు బీమా ప్రక్రియ సులభతరం చేయాలనే లక్ష్యంతో బీమా కంపెనీలు డిజిలాకర్ ద్వారా డిజిటల్ బీమా పాలసీలను జారీ చేయనున్నట్లు Irdai ప్రకటించింది.

గుర్తింపు పత్రాలుగా...
అన్ని డాక్యుమెంట్స్ కాపీల్ని తమ మొబైల్ ఫోన్లలో భద్రపరచడానికి డిజిలాకర్ ఉపయోగపడుతుంది. డిజిటల్ లాకర్ యాప్‌ను గూగుల్, ఆపిల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, కారు రిజిస్ట్రేషన్, ఓటరు ఐడి, పాన్‌కార్డ్, స్కూల్ సర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలు డిజిలాకర్‌లో దాచుకోవచ్చు. డాక్యుమెంట్స్ డిజిలాకర్ ద్వారా డిజిటల్ రూపంలో ఉన్నప్పటికీ ధృవీకరణ కోసం వీటిని గుర్తింపుగా పత్రాలుగా ఉపయోగపడతాయి.

పాలసీదారులకు ఉపయోగం
బీమా రంగంలో డిజిలాకర్ ఖర్చులు, కస్టమర్ల ఫిర్యాదుల్ని తగ్గించడంలో సహాయపడుతుందని IRDAI తెలిపింది. మొత్తంగా ఇది మంచి కస్టమర్ అనుభవానికి దారితీస్తుందని ఇన్సురెన్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డిజిలాకర్ భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తీసుకువచ్చారు. డిజిలాకర్ ఫిజికల్ డాక్యుమెంట్స్ వాడకాన్ని తొలగించడం లేదా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications