For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crorepati Investment: కోటీశ్వరులను చేసే స్కీమ్.. రోజూ రూ.417 సేవ్ చేస్తే చాలు.. ప్రభుత్వ గ్యారెంటీ..

|

Saving Scheme: ప్రస్తుతం ఉన్న రోజుల్లో చిన్న మధ్య తరగతి ఆదాయాలు కలిగిన వ్యక్తులు కోటీశ్వరులు కావటం అంత ఈజీ కాదు. ఇది మనందకీ సహజంగా ఉండే ఆలోచన. అయితే క్రమపద్ధతిలో ప్లాన్ ప్రకారం సరైన పెట్టుబడులు పెడితే అది చేరుకోగలిగిన లక్ష్యమేనంటున్నారు ఫైనాన్స్ నిపుణులు. అలా చిన్నపాటి పొదుపు పెద్ద కార్పస్ అందిస్తుందని వారు చెబుతున్నారు. కేవలం రోజుకు రూ.417 సేవ్ చేయటంతో కోటీశ్వరులుగా ఎలా మారాలో ఇప్పుడు తెలుసుకోండి.

PPF పెట్టుబడులు..

PPF పెట్టుబడులు..

పెట్టుబడి విషయంలో రిస్క్ తీసుకోకూడదని భావించే చిన్న పొదుపుదారుల ప్రయోజనం కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)ను భారత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పథకాల్లో ఒకటని చెప్పుకోవాలి. దీనిలో పెట్టుబడులు టాక్స్ ఆదా చేసుకోవటానికి ఉపయోగపడతాయి.

ఆకర్షనీయమైన వడ్డీ రేటు..

ఆకర్షనీయమైన వడ్డీ రేటు..

PPF ఇప్పుడు 7.1% వార్షిక వడ్డీ రేటును పెట్టుబడిదారులకు అందిస్తోంది. వడ్డీ నెలవారీ ప్రాతిపదికన లెక్కించబడుతుంది. పెట్టుబడిదారులు వారి PPF ఖాతాలో వరుసగా 15 సంవత్సరాల వరకు పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయితే.. 15 సంవత్సరాల చివరిలో డబ్బు అవసరం లేకపోతే.. PPF ఖాతాను అవసరమైనన్ని సంవత్సరాలకు పొడిగించుకునే వెసులుబాటు ఉంది. PPF ఖాతా పొడిగింపు ఫారమ్‌ను ఫైల్ చేయడం ద్వారా దీన్ని ఐదేళ్ల ఇంక్రిమెంట్‌ల్లో చేసుకోవచ్చు. ఇందులో ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది.

రిస్క్ లేని పెట్టుబడి సాధనం..

రిస్క్ లేని పెట్టుబడి సాధనం..

పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకపోవటం వల్ల దీనికి ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇందులో తెలివిగా పెట్టుబడి పెడితే రూ. కోటి సేవ్ చేసుకోవచ్చు. దీనిని సాధించటానికి పెట్టుబడిదారులు తప్పనిసరిగా కింద తెలిపిన పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.

 రూ. కోటి పోగుచేయటం ఎలా..?

రూ. కోటి పోగుచేయటం ఎలా..?

మీరు PPF ఖాతాలో ప్రతిరోజూ రూ.417 పెట్టుబడి పెట్టినట్లయితే.. నెలకు సుమారు రూ.12,500 అవుతుంది. అంటే ఏడాదికి గరిష్ఠ పరిమితికి మించి కొంత ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. ఇలా సేవ్ చేయటం వల్ల 15 ఏళ్ల కాలపరిమితి తరువాత పెట్టుబడి విలువ దాదాపు రూ.40.58 లక్షలు అవుతుంది. ఆ తరువాత డబ్బు తీసుకోకుండా మరో ఐదేళ్లు పొడిగించాలి. ఇలా 25 ఏళ్లు కొనసాగిస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ.1.03 కోట్లు చేతికి వస్తాయి. ఒక వ్యక్తి 25 ఏళ్ల వయ్యస్సులో ఇలా పెట్టుబడి పెడితే 50 ఏళ్లు వచ్చేసరికి కోటి రూపాయలు పొందవచ్చు.

 టాక్స్ చెల్లించక్కర్లేదు..

టాక్స్ చెల్లించక్కర్లేదు..

అవును ఈ కాలంలో మీ పెట్టుబపై వడ్డీ ఆదాయం దాదాపుగా రూ.66 లక్షలు వస్తుంది. 25 ఏళ్లలో మెుత్తం పెట్టుబడి రూ.37 లక్షలు అవతుంది. ఈ పూర్తి మెుత్తం ఆదాయపన్ను చట్టం ప్రకారం పన్ను రహితమైనది. రాబడిని పెంచుకోవటానికి చక్కటి మార్గం ఏమిటంటే.. ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ లోపు డబ్బు డిపాజిట్ చేయటం వల్ల వడ్డీ నెలవారీగా లెక్కించబడుతుంది.

English summary

Crorepati Investment: కోటీశ్వరులను చేసే స్కీమ్.. రోజూ రూ.417 సేవ్ చేస్తే చాలు.. ప్రభుత్వ గ్యారెంటీ.. | small investors can become crorepati by saving 417 rupees on daily basis for 25 years in public provident fund know details

small investors can become crorepati by saving 417 rupees daily
Story first published: Monday, August 1, 2022, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X