For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటో, పర్సనల్, గోల్డ్, హోమ్‍‌లోన్లపై SBI బంపరాఫర్: ప్రాసెసింగ్ ఫీజు 0, ఇలా చేస్తే వడ్డీ చాలా తక్కువ

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసింది! పండుగ సీజన్‌లో రుణాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులు, వ్యాపారులు దెబ్బతిన్నారు. డిమాండ్ ప్రభావం బ్యాంకులపై కూడా పడింది. దీంతో పండుగ సీజన్‌లో డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు ఎస్బీఐ యోనో యాప్ దరఖాస్తు చేసే కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. రుణాలు తీసుకునే వారికి ఇది గుడ్‌న్యూస్.

అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!

ప్రాసెసింగ్ ఫీజు రద్దు, క్రెడిట్ స్కోర్‌పై డిస్కౌంట్

ప్రాసెసింగ్ ఫీజు రద్దు, క్రెడిట్ స్కోర్‌పై డిస్కౌంట్

- యోనో యాప్ ద్వారా వెహికిల్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే వారికి 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.

- అప్రూవ్డ్ ప్రాజెక్టుల్లో హోమ్ లోన్ పైన కూడా వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

- అలాగే హోమ్ లోన్ పైన క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం ఆధారంగా 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీలో రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ దరఖాస్తు చేసుకుంటే అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.

లోన్.. ఎన్నో రకాల ప్రయోజనాలు.. ఆఫర్లు

లోన్.. ఎన్నో రకాల ప్రయోజనాలు.. ఆఫర్లు

- 36 నెలలకు 7.5 శాతం వడ్డీ ద్వారా గోల్డ్ లోన్స్ పైన గుడ్ న్యూస్ చెప్పింది.

- సొంత కారును కొనుగోలు చేయాలనుకునే వారికి 7.5 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

- ఎంపిక చేసిన మోడల్స్ పైన 100 శాతం ఆన్ రోడ్ ఫైనాన్స్ ఉంటుందని కూడా ఆఫర్ ఇచ్చింది.

- 7.5 శాతం వడ్డీకే బంగారు రుణాలు, 9.6 శాతం వడ్డీపై పర్సనల్ లోన్స్ అందిస్తున్నట్లు తెలిపింది.

- పండుగ సీజన్‌లో కస్టమర్లు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు గాను ఎస్బీఐ తమ వంతు తోడ్పాటు అందిస్తోందని ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు.

- యోనో యాప్ ద్వారా పేపర్‌లెస్ లోన్ పొందవచ్చునని వెల్లడించింది.

ఎస్సెమ్మెస్ ద్వారా..

ఎస్సెమ్మెస్ ద్వారా..

- యోనో యాప్ ద్వారా కారు లోన్, గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రాథమికంగా ఆమోదం లభిస్తాయి.

- యోనో ప్లాట్‌ఫాం ద్వారా పేపర్‌లెస్, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్, ఇన్‌స్టా హోమ్ టాపప్ లోన్స్ పొందవచ్చు. కేవలం 4 క్లిక్స్ ద్వారా ఇళ్లలోనే ఉండి యోనో ద్వారా పేపర్‌లెస్ వ్యక్తిగత రుణం పొందవచ్చు.

- ఎస్బీఐ కస్టమర్ తమ పర్సనల్ లోన్ అర్హతను తెలుసుకోవచ్చు. 567676కు ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా అర్హతను తెలుసుకోవచ్చు.

- PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఎస్బీఐ అకౌంట్ నెంబర్ చివరి నాలుగు నెంబర్లు టైప్ చేసి 567676కు ఎస్సెమ్మెస్ పంపించాలి. PAPL

English summary

ఆటో, పర్సనల్, గోల్డ్, హోమ్‍‌లోన్లపై SBI బంపరాఫర్: ప్రాసెసింగ్ ఫీజు 0, ఇలా చేస్తే వడ్డీ చాలా తక్కువ | SBI waives processing fees on loans via Yono app

The State Bank of India (SBI) has announced a 100 per cent waiver in its processing fee for all customers applying for car, gold, and personal loans through its YONO platform.
Story first published: Monday, September 28, 2020, 16:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X