For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

YONO Gold loan: SBI గుడ్‌న్యూస్, బంగారం రుణ వడ్డీ రేట్లపై ఆఫర్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో బంగారంపై రుణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో బంగారం రుణ వడ్డీ రేట్ల పైన ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రాయితీలను అందిస్తోంది. ఆభరణాల పైన మాత్రమే కాకుండా, బ్యాంకులు విక్రయించిన గోల్డ్ కాయిన్స్ తాకట్టు పైన కూడా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తోంది. ముఖ్యంగా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి కనిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఈ రుణాలకు అర్హులు. రెండు ఫోటోలు, అడ్రస్ ఐడీ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. కనిష్టంగా రూ.20వేలు, గరిష్టంగా రూ.50 లక్షల వరకు రుణం తీసుకోవచ్చును. రుణ కాలపరిమితి మూడేళ్లు.

బంగారం రుణాలు

బంగారం రుణాలు

అత్యవసర సమయంలో ఎవరికైనా రుణాలు కావాల్సి వస్తే బంగారం పైన రుణాలు చాలా సులభమైనవి. హామీతో కూడిన రుణాలు కాబట్టి బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు సులభంగా మంజూరు చేస్తాయి. సురక్షిత రుణం కాబట్టి వడ్డీ రేట్లు కూడా అనుకూలంగా ఉంటాయి. అందుకే చాలామంది అత్యవసర సమయంలో బంగారం రుణాల వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో బంగారు రుణాలను మరింత సౌకర్యవంతంగా, ప్రయోజనకరంగా చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 7.5 శాతం వడ్డీ రేటుతో ఈ రుణాలు అందిస్తోంది. యోనో మొబైల్ యాప్ ద్వారా రుణం కోసం చాలా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

డాక్యుమెంట్స్ ఏవి అవసరం

డాక్యుమెంట్స్ ఏవి అవసరం

డాక్యుమెంట్స్ ఏవి అవసరం?

బంగారం రుణం కోసం ఒక దరఖాస్తును పూర్తి చేయాలి. దీంతో పాటు గుర్తింపు కార్డు చిరునామా ప్రూఫ్ అవసరం.

- కాలపరిమితి ఎంత?

కాలపరిమితి విషయానికి వస్తే 36 నెలలు ఉంటుంది. అయితే బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ అయితే మాత్రం 12 నెలలు ఉంటుంది. రుణ వ్యవధి సమయంలో రీపేమెంట్ ఆబ్లిగేషన్ లేదు.

- ఎంత రుణం ఇస్తారు?

కనీసం రూ.20,000 నుండి గరిష్టంగా రూ.50 లక్షల వరకు రుణం అందిస్తారు.

- వడ్డీ రేటు ఎంత?

ఎస్బీఐ బంగారు రుణ వడ్డీ రేటు ప్రస్తుతం 7.5 శాతంగా ఉంది.

- అర్హత ఏమిటి?

పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న, స్థిర ఆదాయం కలిగిన వ్యక్తులు ఎస్బీఐ గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పెన్షనర్లు కూడా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఆదాయ రుజువు అవసరం లేదు.

యోనో యాప్ ద్వారా దరఖాస్తు ఇలా..

యోనో యాప్ ద్వారా దరఖాస్తు ఇలా..

- రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

- యోనో ఎస్బీఐ అకౌంట్‌లోకి లాగ్-ఇన్ కావాలి. హోమ్ పేజీలోకి వెళ్లి, టాప్ లెఫ్ట్ మెనూలో క్లిక్ చేయండి.

- లోన్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత గోల్డ్ లోన్స్ పైన క్లిక్ చేయాలి.

- అప్లై నౌ పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత బంగారం, ఆభరణాలకు సంబంధించిన వివరాలు నింపాలి. బంగారం బరువు, బంగారం రూపం, నెట్ వెయిట్ వంటి వివరాలు ఇవ్వాలి.

- ఆ తర్వాత ఏం చేస్తారు, అడ్రస్ వంటివి కూడా పూర్తి చేయాలి.

బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు ఇలా..

బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు ఇలా..

- సమీపంలోని బ్యాంకు బ్రాంచీకి వెళ్లాలి.

- ఒక కస్టమర్ ఇప్పుడు బ్యాంకు బ్రాంచీని సంప్రదించి ఆభరణం లేదా బంగారాన్ని తాకట్టు పెట్టాలి.

- రెండు ఫోటోగ్రాఫ్స్, KYC డాక్యుమెంట్స్ అవసరం.

- వెరిఫికేషన్ తర్వాత మీబంగారం రుణాలు సాంక్షన్ అవుతాయి.

English summary

YONO Gold loan: SBI గుడ్‌న్యూస్, బంగారం రుణ వడ్డీ రేట్లపై ఆఫర్ | SBI offers interest rate discount on gold loan: Apply for gold loan using YONO?

The SBI is now offering gold loans at an interest rate of 7.5 percent. SBI Gold Loan can be availed by a pledge of gold ornaments including gold coins sold by banks with minimum paperwork and low-interest rate.
Story first published: Saturday, August 7, 2021, 8:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X