For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NPS rules: నేషనల్ పెన్షన్ సిస్టం స్కీంలో ఇటీవలి మార్పులు

|

సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ పథకాల్లో ప్రభుత్వ ప్రాయోజిత నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) ముఖ్యమైనది. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వేతర ఉద్యోగులకు ఉపయోగపడే పథకం ఇది. PFRDA ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. FY22 చివరి నాటికి NPS పథకం కింద నిర్వహణలో ఉన్న మొత్తం అసెట్ 30 శాతం పెరుగుతుందని, తద్వారా ఇది రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. సెప్టెంబర్ 25, 2021 నాటికి ఇది 18.28 లక్షల ప్రయివేటు వ్యక్తిగత నమోదులు ఉన్నాయి. ఇందులో కార్పోరేట్ రంగం నుండి 12.59 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సబ్‌స్క్రైబర్ల సంఖ్య 22.24 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సబ్‌స్క్రైబర్లు 53.79 లక్షలు.
తక్కువ రిస్క్, అధిక రిటర్న్స్ అందించే పెట్టుబడి సాధనం ఎన్పీఎస్. పన్ను ప్రయోజనాలతో పాటు పదవీ విరమణ అనంతరం అధిక రాబడిని అందిస్తుంది. ఈ ఎన్పీఎస్‌లో ఇటీవల పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యాంశాలను తెలుసుకుందాం.

ఖాతాలు తెరువవచ్చు

ఖాతాలు తెరువవచ్చు

PFRDA ఇటీవల ఆన్‌లైన్, పేపర్‌లెస్ (ఎగ్జిట్) ప్రాసెస్ విధానాన్ని ప్రభుత్వరంగ చందాదారులకు ఇప్పటికే ఉన్న భౌతిక మోడ్‌కి అదనంగా పొడిగించింది. 'సబ్‌స్క్రైబర్ ప్రయోజనాల కోసం ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్ నిష్క్రమణ తక్షణ బ్యాంకు ఖాతా ధృవీకరణతో అనుసంధానించబడుతుంది. ఎన్పీఎస్ పరిధిలోని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది' అని సర్క్యూలర్‌లో తెలిపింది.

రెగ్యులేటర్ ఇటీవల ఎన్పీఎస్‌లో ప్రవేశ వయస్సును 70 ఏళ్లకు పెంచింది. అంతకుముందు ఇది 65 సంవత్సరాలుగా ఉంది. 18-70 సంవత్సరాల వయస్సు ఉన్న ఎవరైనా ఎన్పీఎస్ సభ్యత్వం తీసుకోవచ్చు. ఎన్పీఎస్ ఖాతా నుండి నిష్క్రమించిన వారు కూడా తిరిగి ఖాతాలు తెరువవచ్చు.

ఈ పథకంలో 75 ఏళ్ల వరకు కొనసాగేందుకు అనుమతిస్తుంది.

ముందే నిష్క్రమిస్తే..

ముందే నిష్క్రమిస్తే..

ఎవ‌రైనా 65 ఏళ్ల త‌ర్వాత ఎన్పీఎస్‌సో చేరితే క‌నీసం మూడు సంవత్సరాలు పథకంలో కొనసాగాలి. మూడేళ్లు పూర్తి కాక‌ముందే నిష్క్రమిస్తే ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌గా ప‌రిగ‌ణిస్తారు. ఎవ‌రైనా ముందే ఉపసంహరించుకుంటే నిధిలో 20 శాతం వ‌ర‌కు మాత్రమే పన్నుర‌హిత ఉప‌సంహ‌ర‌ణకు అనుమతిస్తారు. మిగ‌తా మొత్తం జీవిత‌కాలం పెన్షన్‌గా ఉంటుంది.

65 ఏళ్ల తర్వాత ఎన్పీఎస్‌లో చేరితే పెన్షన్ ఫండ్, అసెట్ అలోకేషన్‌ను గరిష్టంగా ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో ఆటో, యాక్టివ్ ఛాయిస్ కింద వరుసగా 15 శాతం, 50 శాతాన్ని ఎంచుకోవచ్చు. పెన్షన్ ఫండ్‌ను ఏడాదికి ఒకసారి మార్చుకోవచ్చు. అదే అసెట్ అలోకేషన్‌ను రెండుసార్లు మార్చుకోవచ్చు.

మొత్తం వెనక్కి

మొత్తం వెనక్కి

రూ.5 లక్షల లోపు ఎన్పీఎస్ నిధి ఉంటే పదవీ విరమణ చేసినా.. స్కీం నుండి బయటకు రావాలని అనుకుంటే ఈ మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఎన్పీఎస్ నుండి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు. రూ.2లక్షల మొత్తం దాటితే పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40 శాతంతో బీమా సంస్థలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఎలాంటి యాన్యుటీ పథకాలను కొనాల్సిన అవసరం లేదు. ఉప‌సంహ‌ర‌ణ మొత్తంలో 60 శాతం ప‌న్నుర‌హితంగా ప‌రిగ‌ణిస్తారు. మిగ‌తా 40 శాతం ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది.

English summary

Recent changes in National Pension System, You should know

NPS is a popular Government backed retirement planning scheme for both Government and non Government sector employees. NPS is regulated by the PFRDA.
Story first published: Monday, October 11, 2021, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X