For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్పులేదు: PPF, సుకన్య, పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

|

అక్టోబర్-నవంబర్-డిసెంబర్ 2021 త్రైమాసికానికి గాను స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. అంటే పీపీఎప్, ఎన్ఎస్సీ, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర వంటి స్మాల్ సేవింగ్స్ పథకాల వడ్డీ రేటులో మార్పు ఉండదు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేటు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తిస్తుంది. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేటును ప్రకటిస్తుంది. వడ్డీ రేటును సవరించవచ్చు లేదా స్థిరంగా ఉంచవచ్చు. ప్రభుత్వం సెక్యూరిటీస్ యావరేజ్ యీల్డ్స్ ఆధారంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.

బ్యాంకు వడ్డీ రేటు కంటే ఆకర్షణీయంగా

బ్యాంకు వడ్డీ రేటు కంటే ఆకర్షణీయంగా

స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు(చిన్న మొత్తాల పొదుపు పథకాలు) స్థిరంగా ఉన్నందున, ఇన్వెస్టర్లకు గత త్రైమాసికం వలె స్థిర ఆదాయం ఉంటుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీరేటు.. బ్యాంక్ వడ్డీ రేటు కంటే ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఏడాది నుండి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్స్ పైన 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. పోస్టాఫీస్ పథకాలపై నాలుగు శాతం నుండి 7.1 శాతం వడ్డీ రేటు ఉంది.

వివిధ పథకాలపై వడ్డీ రేట్లు

వివిధ పథకాలపై వడ్డీ రేట్లు

సర్క్యులర్ ప్రకారం పీపీఎఫ్ 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎన్ఎస్‌సీ 6.8 శాతం వడ్డీ రేటు, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం అకౌంట్ పైన 6.6 శాతం వడ్డీ రేటు వస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పైన 7.4 శాతం వడ్డీ రేటు ఉంది. 5 ఏళ్ల మంత్లీ ఇన్‌కం అకౌంట్ స్కీం పైన 6.6 శాతం వడ్డీ రేటు ఉంది. 5 ఏళ్ల NSC స్కీంలో 6.8 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. వన్ ఇయర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.5 శాతం, అయిదేళ్ల డిపాజట్ 6.7 శాతంగా ఉంది. వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేటు అక్టోబర్ 1, 2021 నుండి ప్రారంభమై డిసెంబర్ 31, 2021 వరకు వర్తిస్తాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు త్రైమాసికం ప్రాతిపదిక నోటిఫై అవుతాయి.

పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలు, వడ్డీ రేట్లు

పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలు, వడ్డీ రేట్లు

పీపీఎప్, ఎన్ఎస్‌సీ, ఎస్ఎస్‌వైతో పాటు ఇతర పథకాల్లో సెప్టెంబర్ 30 వరకు చేరిన వారు ఎంత వడ్డీ రేటు పొందారో, అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఇన్వెస్ట్ చేసిన వారు అంతేమొత్తం వడ్డీని పొందుతారు. పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వివిధ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

సేవింగ్స్ ఖాతాపై 4 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి ఏడాది.

1 ఏడాది నుండి 3 ఏళ్ల టైమ్ డిపాజిట్‌పై 5.5 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి త్రైమాసికం.

5 ఏళ్ల టైమ్ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి త్రైమాసికం.

5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి త్రైమాసికం.

5 ఏళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీంపై 7.4 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి త్రైమాసికం.

5 ఏళ్ల మంత్లీ ఇన్‌కం అకౌంట్‌పై 6.6 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి నెలవారీగా.

5 ఏళ్ల జాతీయ పొదుపు పత్రాలపై 6.8 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి వార్షికంగా.

పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి వార్షికంగా.

కిసాన్ వికాస్ పత్రాపై 6.9 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి వార్షికంగా. మెచ్యూరిటీ సమయం 124 నెలలు.

సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ రేటు, కాంపౌండింగ్ వ్యవధి వార్షికంగా.

English summary

మార్పులేదు: PPF, సుకన్య, పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే? | PPF, other small savings scheme rates remain unchanged

The government has kept the post office small savings schemes interest rates unchanged for the October-November-December 2021 quarter. There is no change in interest rate of PPF, NSC and other small savings schemes at least for the next three months.
Story first published: Friday, October 1, 2021, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X