For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్రం కఠిన నిబంధనలు: సోషల్ మీడియా సంస్థలు, OTTలకు కేంద్రం లక్ష్మణ రేఖ

|

తప్పుడు సమాచారవ్యాప్తికి సంబంధించి ఖాతాల తొలగింపు అంశంపై ఇటీవల సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్-ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం సోషల్ మీడియాకు సంబంధించి కఠిన మార్గదర్శకాలు తీసుకు వచ్చింది. సోషల్, డిజిటల్ మీడియా, ఓటీటీ మాధ్యమాల్లో అభ్యంతరకర, విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు వీటిని జారీ చేస్తన్నట్లు తెలిపింది.

దేశ భద్రత, మహిళల గౌరవం, శాంతిభద్రతలకు భంగం కలిగించే వార్తలు, పోస్టులు, వీడియోలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి సంస్థ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఆదేశించింది.

అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్

ఇలా చేయాల్సిందే...

ఇలా చేయాల్సిందే...

తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు సోషల్ మీడయా యాజమాన్యాలు చేపట్టవలసిన చర్యలను నిర్ధారిస్తూ కఠిన నిబంధనావళిని విడుదల చేసింది. తమ ప్లాట్ ఫామ్స్ పైన ప్రసారమయ్యే కంటెంటుకు సంబంధించి యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు అనుసరించాల్సిన నియమాలను నిర్ధారించింది. వివాదాస్పద సమాచారంపై తక్షణమే స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులను నియమించాలని, భారత్‌లోని చిరునామాతా ఆఫీస్ ఉండాలని పేర్కొంది.

వెంటనే స్పందించాలి

వెంటనే స్పందించాలి

నియమ, నిబంధనల్ని 'ది ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ & డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్' పేరుతో ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ వెల్లడించారు. దర్యాఫ్తు సంస్థలతో సమన్వయం కోసం వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోల్ మీడియా, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ యాజమాన్యాలు ఇక్కడ ప్రత్యేక ప్రతినిధులను నియమించుకోవాలి. వివాదాస్పద సమాచారాన్ని మొదట రూపొందించిన వ్యక్తిని 24 గంటల్లో గుర్తించి, ఆ సమాచారాన్ని, ఆ ఖాతాను తొలగించాలని సూచించారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే సమాచారంపై కూడా ఫిర్యాదు అందిన 24 గంటల్లో స్పందించాలని, నగ్న, మార్ఫింగ్ చిత్రాలను 24 గంటల్లో తొలగించాలని, వివాదాస్పద సమాచారంపై ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు.

వర్గీకరణ

వర్గీకరణ

ప్రతి సంస్థ భారత్‌లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కార అధికారిని నియమించుకొని, ప్రతి ఫిర్యాదును 15 రోజుల్లో పరిష్కరించాలి. ఓటీటీలు స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రసారం చేసే వాటిని వీక్షకుల వయస్సును బట్టి 5 కేటగిరీలుగా వర్గీకరించాలి. యూ, యూఏ+7, యూఏ+13, యూఏ+16, ఏ ఉండాలి. చివరి మూడింటికి పేరెంటెల్ లాక్స్ విధానం ఉండాలి. ఏకి సంబంధించి వయస్సును ధృవీకరించిన తర్వాతే చూసే విధానం ఉండాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు రిటైల్ జడ్జిలు లేదా స్వతంత్ర ప్రముఖ వ్యక్తుల నేతృత్వంలో ఆరుగురు సభ్యుల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఐటీ శాఖ వద్ద నమోదు చేసుకోవాలి.

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఓటీటీ పాటిస్తుందా అనేది ఇది పర్యవేక్షిస్తుంది. ఓటీటీ సంస్థ పదిహేను రోజుల్లో ఈ ఫిర్యాదులు పరిశీలించాలి. ఏదైనా సంస్థది తప్పని తేలితో ఓటీటీ సంస్థలు ఆ సంస్థ క్షమాపణలు కోరుతూ ఓటీటీ సంస్థలు స్క్రోలింగ్ వేయాలి.ఇక డిజిటల్ మీడియా సంస్థలు అసత్యాలు, వదంతులు ప్రసారం చేయవద్దు. స్వీయ నియంత్రణ పాటించాలి. వార్తలు ప్రసారం చేస్తే ప్రెస్ కౌన్సిల్ నియమావళిని అనుసరించాలి.

English summary

కేంద్రం కఠిన నిబంధనలు: సోషల్ మీడియా సంస్థలు, OTTలకు కేంద్రం లక్ష్మణ రేఖ | Point Guide to New IT Rules as government Tightens grip on Social Media, OTT Content

The Centre on Thursday released new guidelines for regulating social media and OTT streaming platforms to curb what it described as misuse of content, and make Big Tech firms like Facebook and Twitter more accountable to legal requests for swift removal of content.
Story first published: Friday, February 26, 2021, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X