PM KISAN: 11వ విడత పీఎం కిసాన్ కోసం.. మే 31లోగా ఇది పూర్తి చేయండి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan) ప్రయోజనాలు పొందడానికి రైతులు eKYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ మే 31, 2022. పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకున్న రైతులు ఆన్ లైన్‌లో కిసాన్ వెబ్ సైట్ ద్వారా లేదా ఆఫ్ లైన్‌లో కామన్ సర్వీస్ సెంటర్‌కు(CSC)కి వెళ్లి eKYCని పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డుతో సీఎస్సీ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా eKYCని పూర్తి చేయవచ్చు.
జనవరి 1, 2022న పీఎం కిసాన్‌కు సంబంధించి పదకొండో వాయిదా నిధులను త్వరలో విడుదల చేయనుంది. అర్హులైన రైతులు వెంటనే eKYCని అప్ డేట్ చేయాలి.

ఆఫ్ లైన్ ద్వారా ఓటీపీ ఆధారిత eKYCని ఇలా పూర్తి చేయండి.... తొలుత పీఎం కిసాన్ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
ఫార్మర్స్ కార్నర్ కింద ఉన్న eKYC ట్యాబ్‌ను క్లిక్ చేస్తే తర్వాత పేజీకి వెళ్తుంది.
ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
స్క్రీన్ పైన ఎంటర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అయితే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న గెట్ ఏటీపీ పైన క్లిక్ చేయాలి.
మళ్లీ ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు మరో ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేసి సబ్-మిట్ చేయాలి