ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సంస్థ ఫోన్‌పే (PhonePe) తమ కస్టమర్లకు మరో అద్భుత సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మన ఖాతాలో డబ్బులు ఉండి కూడా ఏటీఎంలో డబ్బులు లేకపోవడం వల్ల లేదా అత్యవసర సమయాల్లో పెద్ద క్యూలైన్ ఉండటం వంటి వివిధ కారణాల వల్ల ఇబ్బందులు పడుతుంటాం. ఇలాంటి ఇబ్బందులకు ఫుల్‌స్టాప్ పెట్టేలా ఫోన్‌పే మంచి సౌకర్యాన్ని తీసుకు వచ్చింది తమ కస్టమర్లకు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.

ఏటీఎం లేకపోయినా... ఫోన్‌పే ఏటీఎం
ఇప్పటి వరకు ఫోన్‌పే ద్వారా చెల్లింపులు మాత్రమే చేయవచ్చు. కానీ ఇక నుంచి ఈ యాప్ ద్వారా నగదును కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇదే ఫోన్‌పే ఏటీఎం (PhonePe ATM). ఏటీఎంలో డబ్బులు లేకపోవడం లేదా ఏటీఎంలు సమీపంలో లేకపోవడం వంటి కారణాలతో డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందులుపడేవారికి ఇది మంచి సదుపాయం.

రూ.1,000 మాత్రమే తీసుకోగలం
ఫోన్‌పే కస్టమర్లు ఈ యాప్ సదుపాయం ఉన్న దుకాణదారుల వద్దకు వెళ్లి నగదును తీసుకోవచ్చు. అయితే ఒక కస్టమర్ కేవలం రూ.1,000కి మించి తీసుకునే అవకాశం లేదు. ఈ ఫీచర్‌ను ఫోన్‌పే ఇటీవలే (జనవరి 23)న లాంచ్ చేసింది.

దుకాణాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు
మీకు దగ్గరలోని దుకాణాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసి స్టోర్స్‌లోకి వెళ్లి ఫోన్‌పే ఏటీఎం మీద క్లిక్ చేస్తే మన దగ్గరలోని ఫోన్‌పే సదుపాయం కలిగిన దుకాణాలు కూడా కనిపిస్తాయి.

ఎలాంటి ఛార్జీలు లేవు
మొదట దీనిని ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా మన బ్యాంకు ఖాతాలోని డబ్బును దుకాణదారుడి ద్గగరకు వెళ్లి అతని వద్ద నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు నగదు ట్రాన్సాక్షన్స్‌ల్లో ఇబ్బందులను తొలగించేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఫోన్‌పే తెలిపింది.

కస్టమర్స్ స్పందన ఆధారంగా..
ఢిల్లీ-ఎన్సీఆర్‌లో దాదాపు 75,000 మంది మర్చంట్స్ ఫోన్‌పే కలిగి ఉన్నారు. ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ కస్టమర్స్ స్పందన ఆధారంగా దీనిని అంతటా అమలు చేయనుంది.

ఫోన్‌పే ఫీచర్స్
ఫోన్‌పేలో క్రెడిట్, డెబిట్ కార్డు లింకింగ్, మనీ స్టోరేజ్, మనీ ట్రాన్సుఫర్, పిన్ ఆథరైజేషన్, వ్యాలెట్ టాప్ యూపీ, బ్యాంకు బ్యాలెన్స్ చెక్, పీవోఎస్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్ లింకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications