పర్సనల్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా.. క్రెడిట్ స్కోర్ ముఖ్యం
ఎవరికైనా అత్యవసరంగా కొంతమొత్తం కావాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లోని వారు చిన్న చిన్న అవసరాలకు, అత్యవసరంగా నగదు అవసరమైతే పర్సనల్ లోన్ తీసుకుంటారు. వ్యక్తిగత లోన్ కాలపరిమితి సాధారణంగా రెండేళ్ల నుండి 5 ఏళ్లు ఉంటుంది. హోంలోన్, వాహనాలపై రుణాలు తీసుకుంటే వడ్డీ రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. అయితే పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ కాబట్టి వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల బ్యాంకులు వడ్డీ రేట్లు కాస్త తగ్గించాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే లోన్ దరఖాస్తు సులభంగా అప్రూవ్ అవుతుంది. అయితే ఇతర కారణాలతో దరఖాస్తులు తిరస్కరింపబడం అవకాశాలు ఉంటాయి.
SBIలో అతి తక్కువకే ఆటో, గోల్డ్, పర్సనల్, హోమ్ లోన్: వడ్డీ ఎంత ఉందంటే?

డాక్యుమెంటేషన్
తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్‌ను ఎంచుకుంటారు. ఆఫర్ డాక్యుమెంట్స్‌ను పూర్తిగా చదవాలి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒక సెట్ డాక్యుమెంట్స్‌తో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేతనజీవులకు, సెల్ఫ్-ఎంప్లాయిడ్‌కు డాక్యుమెంటేషన్ రిక్వైర్‌మెంట్స్ వేర్వేరుగా ఉంటాయి.

అత్యధిక వడ్డీ భారం
పర్సనల్ లోన్ తీసుకునే అంశంలో క్రెడిట్ స్కోర్ చాలా కీలకం. లోన్ అప్రూవ్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ రిజెక్షన్ లేదా అత్యధిక వడ్డీ రేటు భారం ఉండే అవకాశముంది. సాధారణంగా అన్-సెక్యూర్డ్ పర్సనల్ లోన్ 11 శాతం నుండి 24 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.

రుణ పరిమితి
అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు, మరోదారి లేకుంటే స్వల్పకాలీక వ్యక్తిగత రుణాలు తోడ్పడతాయి. ఈ రుణాలపై బ్యాంకులు వడ్డీ రూపంలో భారీ ఆదాయాన్ని పొందుతాయి. అందుకే బ్యాంకులు తమ కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ రుణాలు కూడా అందిస్తాయి. అయితే రుణం లభిస్తుందని అవసరం లేకున్నా తీసుకోవడం మంచిదికాదు. తప్పనిసరిగా అవసరం ఉంటేనే, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవడం మంచిది.