For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలు

|

కరోనా మహమ్మారి సమయంలో, ఆ తర్వాత రోజుల్లో సీనియర్ సిటిజన్లు జీవితాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో, ఆ తర్వాత రోజుల్లోను సీనియర్ సిటిజన్లు ఎలాంటి ఇబ్బందులుపడలేదని ప్రభుత్వం పేర్కొంది. క్లిష్ట సమయంలో సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినట్లు ప్రభుత్వం తెలిపింది. క్లిష్టసమయాల్లో వారికి సులభమైన సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించింది. కరోనా సమయంలో తీసుకున్న చర్యలపై కేంద్రమంత్రి కూడా రాజ్యసభకు తెలిపారు.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్!ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్!

పెన్షన్ సకాలంలో క్రెడిట్ అయ్యేలా

పెన్షన్ సకాలంలో క్రెడిట్ అయ్యేలా

పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) జారీ చేసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా సీపీఎస్ఓ లేదా బ్యాంకులకు పంపించని సందర్భాలలో పెన్షన్ సకాలంలో క్రెడిట్ అయ్యేలా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, ఎలక్ట్రానిక్ మోడ్స్ ఉపయోగించేందుకు బ్యాంకుల సీపీఏవో, సీపీపీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తోంది.

ఒక ఉద్యోగి బకాయిలను ఖరారు చేసేందుకు మందు పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నచోట లేదా పెన్షన్ దావాను సమర్పించలేకపోయినా సీసీఎస్ (పెన్షన్) రూల్స్ 1972లోని రూల్ 64, కోవిడ్ 19 సమయంలో పెన్షన్ ప్రయోజనాలను తక్షణమే తాత్కాలికంగా మంజూరు చేసేలా సడలించింది.

ఇంటి నుండి సేవలు

ఇంటి నుండి సేవలు

ఈ-పీపీవో (ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్)-డిజిలాకర్ అనుసంధానానికి ఒక నిబంధన చేయబడింది. దీంతో డీజీ లాకర్‌లో పీపీవో శాశ్వత రికార్డ్ ఉంటుంది. పెన్షనర్ పీపీవో ఇన్‌స్టాంట్ కాపీని ప్రింట్ అవుట్ పొందవచ్చు.

లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు గడువును పెంచారు. కేంద్రం పెన్షన్‌దారులు దీనిని ఫిబ్రవరి 28, 2021 వరకు సమర్పించవచ్చు.

లైఫ్ సర్టిఫికెట్లను డిజిటల్‌గా సమర్పించేందుకు, పెన్షనర్లకు ఇంటింటికి సదుపాయాలు కల్పించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ముందుకొచ్చింది. పెన్షన్‌దారులు బ్యాంకు శాఖను సందర్శించకుండానే ఇంటి నుండి ఈ సేవలు పొందుతారు.

డోర్ బ్యాంకింగ్

డోర్ బ్యాంకింగ్

వంద ప్రధాన నగరాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల కస్టమర్ల కోసం డోర్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. లైఫ్ సర్టిఫికెట్ల సేకరణ కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ కిందకు వస్తుంది. లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ చేయమని బ్యాంకులకు ఆదేశాలు వచ్చాయి.

కరోనా వంటి క్లిష్ట సమయంలో పెన్షనర్ల భయం పోగొట్టేందుకు పెన్షనర్ల శాఖ పలు వెబినార్స్ నిర్వహించింది.

English summary

కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలు | Pensioners benefits increased since lockdown

Elaborating on the measures taken to ease the life of the senior citizens during the lockdown and the days after that, Union Minister Jitendra Singh said that the pension department has ensured that pensioners do not face any difficulty in such unprecedented times regarding their retirement benefits.
Story first published: Monday, February 15, 2021, 16:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X