For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీక్లీ ఆఫ్, కాంప్ ఆఫ్, నైట్ షిఫ్ట్స్... : ఉద్యోగులకు గుడ్‌న్యూస్... ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?

|

న్యూఢిల్లీ: వేతన (సెంట్రల్) నిబంధనల ముసాయిదాను యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. స్టేక్ హోల్డర్స్ నుంచి, సాధారణ ప్రజల నుంచి ఇన్‌పుట్ కోరుతోంది. ఈ నిబంధనలు అమలు చేస్తే కనుక దానిని కోడ్ ఆఫ్ వేజెస్ (సెంట్రల్) రూల్స్, 2019గా పిలుస్తారు. కార్మిక చట్టాలను సవరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ డ్రాఫ్ట్ విడుదల చేసింది. కోడ్ ఆప్ వేజెస్ 2019లోని సెక్షన్ 67 కింద జారీ చేసి ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. ముసాయిదాకు ఈ ఏడాది ఆగస్ట్ 8వ తేదీన రాష్ట్రపతి సమ్మతి లభించింది.

భారత్‌లో పెట్టుబడులపై కార్ల కంపెనీల జాగ్రత్త, అవే దెబ్బతీశాయాభారత్‌లో పెట్టుబడులపై కార్ల కంపెనీల జాగ్రత్త, అవే దెబ్బతీశాయా

నైట్ షిఫ్ట్ చేస్తే 24 గంటల వీక్లీ ఆఫ్ తప్పనిసరి

నైట్ షిఫ్ట్ చేస్తే 24 గంటల వీక్లీ ఆఫ్ తప్పనిసరి

- వేతన నిబంధనల ముసాయిదా 2019లో వీక్లీ ఆఫ్, నైట్ షిఫ్ట్ అంశాల ప్రస్తావన ఉంది. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి.

- వేతన నిబంధనల ముసాయిదా 2019 ప్రకారం నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేసేవారికి పూర్తిగా 24 గంటల వీక్లీ ఆఫ్ కచ్చితంగా ఉండాలి.

- ఈ గంటల లెక్క షిఫ్ట్ ముగిసిన తర్వాత సమయం నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 24 గంటల అనంతరమే మరో షిఫ్ట్ ఉండాలి.

వారానికి ఒకరోజు సెలవు తప్పనిసరి

వారానికి ఒకరోజు సెలవు తప్పనిసరి

- ఉద్యోగుల డ్యూటీ టైమ్ అర్ధరాత్రి దాటిపోతే అప్పుడు వారిని నైట్ షిఫ్ట్ కిందకు పరిగణలోకి తీసుకుంటారు.

- ఉద్యోగి ముందు రోజు అధిక సమయం ఉన్నప్పటికీ, వీక్లీ ఆఫ్ అయితే 24 గంటలు ఉండాలి.

- వర్కర్లకు వీక్లీ ఆఫ్ తప్పనిసరి. వారంలో ఒకరోజు ఉద్యోగులందరికీ సెలవు దినం ఉండాలి.

- సాధారణంగా ఆదివారం సెలవుగా ఉండాలి. అయినప్పటికీ యజమాని ఏదో ఒకరోజు మాత్రం సెలవు ఇవ్వాలి.

- ఒక ఉద్యోగి ఆరు రోజుల పాటు ప్రతిరోజు (నిరంతరాయంగా) పని చేసినందున వారాంతపు సెలవు తప్పనిసరి.

- ఉద్యోగికి సెలవు రోజును ముందుగానే తెలియజేయాలి.

కాంప్ ఆఫ్ తీసుకోవచ్చు

కాంప్ ఆఫ్ తీసుకోవచ్చు

- వర్కర్ ఆఫ్ రోజు పని చేస్తే మరో రోజు సెలవు తీసుకోవచ్చు. ఇలాంటి వాటిని కాంప్ ఆఫ్ అంటారు.

- ఉద్యోగి వీక్ ఆఫ్ తీసుకోకుండా పని చేశాడంటే మరొక రోజు తీసుకోవచ్చు.

- ఉద్యోగిని వరుసగా 10 రోజుల పాటు పని చేయించకూడదు.

- ఉద్యోగి విశ్రాంతి లేదా ఆఫ్ డే రోజు పని చేసి, ఆ తర్వాత కాంప్ ఆఫ్ తీసుకోకుంటే ఆ రోజుకు గాను వేతనం ఇవ్వాలి. దీనిని ఓవర్ టైమ్ రేటుతో ఇవ్వాలి.

English summary

వీక్లీ ఆఫ్, కాంప్ ఆఫ్, నైట్ షిఫ్ట్స్... : ఉద్యోగులకు గుడ్‌న్యూస్... ప్రభుత్వం ఏం కోరుకుంటోంది? | Payment for Weekly Off, Compensatory Off to Night Shift, other employees

The Union Ministry of Labour and Employment has put Preliminary draft of the Wages (Central) Rules under Section 67 of the Code on Wages, 2019 in the public domain for inputs from stakeholders and general public.
Story first published: Friday, November 8, 2019, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X