For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సురెన్స్ ప్రీమియం ముందుగా చెల్లిస్తే ఆఫర్, ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు

|

మీరు బీమా ప్రీమియంను ముందుగా చెల్లిస్తే డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది! త్వరలో ఇన్సురెన్స్ కంపెనీలు మీకు ఈ ప్రయోజనం కల్పిస్తాయి. ఈ మేరకు ఇన్సురెన్స్ రెగ్యులేటర్ irdai లైఫ్ ఇన్సురెన్స్ సంస్థలకు డ్రాఫ్ట్ గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. ముందస్తు రెన్యూవల్ ప్రీమియం చెల్లింపులపై షరతులకు లోబడి రాయితీలను ఇచ్చేందుకు బీమా సంస్థలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు irdai తెలిపింది.

పెరిగిన సిలిండర్ ధరలు: హైదరాబాద్‌లో ఎంత అంటే? LPGపై వీటి ప్రభావంపెరిగిన సిలిండర్ ధరలు: హైదరాబాద్‌లో ఎంత అంటే? LPGపై వీటి ప్రభావం

డిస్కౌంట్ ఇలా

డిస్కౌంట్ ఇలా

ఇందులో భాగంగా ఆర్థిక సంవత్సరంలో ముందుగా చెల్లించే అన్ని ప్రీమియంలకు రాయితీ ఉంటుందని, ఇది ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ పైన ఉన్న వడ్డీ రేట్లకు సమానంగా మాత్రమే ఈ డిస్కౌంట్ ఉండాలని తెలిపింది.

జూన్ 1వ తేదీలోగా అమలు చేయాలి

జూన్ 1వ తేదీలోగా అమలు చేయాలి

పాలసీదారులతో సంబంధాల కొనసాగింపు, స్టాండర్డ్ పద్ధతిలో సమాచారాన్ని అందించేందుకు నిర్దిష్ట వ్యవధిలో నోటీసులు పంపించాలని IRDAI నిబంధనలు జారీ చేసింది. పాలసీదారులకు బీమా సంస్థలు, ఆరోగ్య బీమా కవరేజీకి సంబంధించిన ముఖ్య సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది. మార్చి 1న IRDAI జారీ చేసిన సర్క్యులర్‌లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చర్యలు ప్రారంభించాలి. మొత్తానికి 2021 జూన్ 1వ తేదీలోపు జారీ చేసిన గైడ్ లైన్స్ పాటించాలి. IRDAI నిబంధనలు అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు వర్తిస్తాయి.

సమాచారం ఇవ్వాలి

సమాచారం ఇవ్వాలి

బీమా సంస్థలు హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ గురించి ప్రాథమిక సమాచారాన్ని పాలసీదారులకు తెలియజేయాలని, వీటిలో పాలసీ సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం బీమా, కవరేజ్ పరిధి, పాలసీ పరిధిలోని బీమా వ్యక్తుల సంఖ్య, పాలసీ వ్యవధి, సెటిల్మెంంట్ చేసిన క్లెయిమ్స్ మొత్తం, మిగతా బీమా హామీ, బోనస్ ఉంటే ఆ మొత్తం వివరాలు ఉండాలి.

English summary

ఇన్సురెన్స్ ప్రీమియం ముందుగా చెల్లిస్తే ఆఫర్, ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు | Pay life insurance premium in advance, get a discount

you can pay your insurance renewal premium in advance and get a discount. The Insurance Regulatory and Development Authority of India (IRDAI) has issued draft guidelines to the life insurance companies proposing to allow these companies to offer discounts for renewal premium collected in advance.
Story first published: Tuesday, March 2, 2021, 16:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X