For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ UAN పాస్‌వర్డ్‌తో పీఎఫ్ ఫండ్ ఉపసంహరణ ఇలా..

|

ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్(EPF)ను ప్రావిడెంట్ ఫండ్(PF) అని కూడా అంటారు. ఇది ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమం. ఉద్యోగులకు పీఎఫ్ తప్పనిసరి. ఉద్యోగుల శాలరీ నుండి ప్రతి నెల పీఎఫ్ అకౌంట్లోకి చేరుతుంది. అలాగే యజమాని వాటా కూడా వెళ్తుంది. ప్రయివేటు ఉద్యోగుల వాటా కింద యాజమాన్యం వాటా కింద పీఎఫ్ అకౌంట్లోకి 12 శాతం వెళ్తుంది. ఉద్యోగులు, యాజమాన్య వాటా ప్రతి నెల పీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగులు అత్యవసర అవసరాల కోసం కోవిడ్ 19 పేరుతో కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగులు ఉద్యోగం మారితే ఒక సంస్థ నుండి మరొక సంస్థకు పీఎఫ్ అకౌంట్ మార్చుకోవాలి. ఈపీఎఫ్ ఖాతాలపై ఏడాది వడ్డీ రేటు 8.5 శాతం వర్తిస్తుంది.

పీఎఫ్ ఉపసంహరణ కోసం..

పీఎఫ్ ఉపసంహరణ కోసం..

ఈపీఎఫ్ ఖాతాలో జమ అయిన ఫండ్ పైన వడ్డీ వస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్ జమ ఐన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వివిధ సందర్భాల్లో అవసరమైతే అంటే అత్యవసరమైతే పీఎఫ్ అకౌంట్ నుండి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత డబ్బును ఉపసంహరించుకోవడానికి కొన్ని దశలు ఉంటాయి. మీరు పీఎఫ్ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో తెలుసుకుందాం. పీఎఫ్ ఉపసంహరణ కోసం మొదట ఫామ్ 19 / 10C, ఫామ్ 19 / 10C తీసుకోవాలి. ఉద్యోగి రిటైర్ అయిన రెండు నెలల తర్వాత ఈ ఫామ్ నింపవచ్చు.

ఇలా చేయండి...

ఇలా చేయండి...

- యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లోకి యాక్సెస్ కావాలి.

- UAN, పాస్‌వర్డ్ ద్వారా లాగ్-ఇన్ కావాలి.

- డ్రాప్ డ్రౌన్ మెనులోని ఫామ్స్ 31, 9, 10సీని ఎంచుకోవాలి.

- లింక్డ్ బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- సేవలు ముగియడానికి గల కారణాలు వెల్లడించాలి.

- డ్రాప్ డౌన్ మెనూ నుండి ఫామ్ 19ని ఎంచుకోవాలి. దేని కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో ఎంచుకోవాలి.

- పూర్తి అడ్రస్‌ను ఫిల్ చేయాలి. స్కాన్ చేసిన చెక్/పాస్‌బుక్ ఒరిజినల్ కాపీని అప్ లోడ్ చేయాలి.

బ్యాంకులో జమ

బ్యాంకులో జమ

- డిస్క్‌క్లెయిమర్‌ను చెక్ చేసి, గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి.

- మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని అడిగిన స్థానంలో ఫిల్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి.

- ఫామ్ 19ని సబ్‌మిట్ చేసిన తర్వాత అదే విధంగా ఫామ్ 10సీని సబ్‌మిట్ చేయాలి.

- ఈ మొత్తం యూఏఎన్‌తో జత కలిసిన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

English summary

ఆన్‌లైన్ UAN పాస్‌వర్డ్‌తో పీఎఫ్ ఫండ్ ఉపసంహరణ ఇలా.. | Online UAN Password Procedures for Withdrawing Provision Fund Money

EPF also called PF Is also a government sponsored system and is a compulsory deduction for paid employees. This is a fund where both employees and employers contribute 10 percent of an employee’s base salary each month.
Story first published: Sunday, July 25, 2021, 17:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X