For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Driving Licence: RTO ఆఫీసులో టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం.. సులువుగా..

|

Driving Licence: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గతంలో లాగా లైసెన్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఇకపై లేదు. ఎందుకంటే.. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఇకపై డ్రైవింగ్ పరీక్ష కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకపై రవాణాశాఖ గుర్తింపు కలిగిన డ్రైవర్ ట్రెయినింగ్ సెంటర్ల ద్వారా పొందవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాల్లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్‌లను సదరు కేంద్రం జారీ చేయవచ్చు.

శిక్షణ సర్టిఫికెట్ ఆదారంగా..

శిక్షణ సర్టిఫికెట్ ఆదారంగా..

డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లలో దేనిలోనైనా శిక్షణ కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అలా పాస్ అయిన వారికి శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పొందిన తర్వాత.. అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారికి RTO వద్ద ఎలాంటి పరీక్ష లేకుండా.. శిక్షణ సర్టిఫికేట్ ఆధారంగా లైసెన్స్ జారీ చేయటం జరుగుతుంది.

సిమ్యులేటర్లపై శిక్షణ..

సిమ్యులేటర్లపై శిక్షణ..

శిక్షణా కేంద్రాలలో సిమ్యులేటర్లు, డెడికేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉంటాయి. శిక్షణా కేంద్రాల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి పరీక్ష కోసం RTOను సందర్శించకుండానే లైసెన్స్‌లు జారీ అవుతాయి. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రాలు తేలికపాటి మోటారు వాహనాలు (LMVలు), మీడియం అండ్ భారీ వాహనాల (HMVలు) కోసం శిక్షణను అందిస్తాయి.

ఎన్ని గంటల ట్రేనింగ్ ఇస్తారు..

ఎన్ని గంటల ట్రేనింగ్ ఇస్తారు..

LMVల కోసం శిక్షణ మొత్తం వ్యవధి 29 గంటలుగా ఉంటుంది. ఇది కోర్సు ప్రారంభం నుంచి నాలుగు వారాల్లో పూర్తి చేయాలి. శిక్షణా కేంద్రాలు థీరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ సమయంలో అందిస్తాయి. ఈ కేంద్రాలు పరిశ్రమ-నిర్దిష్ట ప్రత్యేక శిక్షణను అందించడానికి కూడా అధికారం కలిగి ఉంటాయి. శిక్షణ కేంద్రాలకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జూన్‌ 2021లో నోటిఫికేషన్‌ జారీ చేసింది.

రాష్ట్రాల ఆందోళన..

రాష్ట్రాల ఆందోళన..

డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను ప్రైవేటీకరించే అవకాశం ఉన్నందున డ్రైవర్ శిక్షణా కేంద్రాలను తెరవడంపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన వెరిఫికేషన్లు, తనిఖీలు లేకుండానే ఇలాంటి కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారనే భయాన్ని వ్యక్తపరిచాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ తాజా పద్ధతి ద్వారా ఇకపై దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారు డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. పైగా మధ్యవర్తులు, ఏజెంట్ల అవసరం లేకుండానే పైన చెప్పిన ప్రక్రియలో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

Read more about: driving licence
English summary

Driving Licence: RTO ఆఫీసులో టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం.. సులువుగా.. | Now getting Driving Licence Without A Test At RTO Office coming into force in india with new system

getting Driving Licence Without A Test At Transport Office know full details
Story first published: Thursday, July 7, 2022, 13:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X