For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య సేతులో గ్రీన్ స్టేటస్: విమానం ఎక్కాలంటే కండిషన్స్ అప్లై! ఇవి తెలుసుకోండి..

|

కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంపై వేల కోట్ల ప్రభావం పడింది. మన దేశం విషయానికి వస్తే రూ.50వేల కోట్లకు పైగా నష్టపోతాయని అంచనా. సడలింపులతో లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నారు. మే 18వ తేదీ నుండి పెద్ద ఎత్తున సడలింపులు ఇచ్చే అవకాశముంది. లాక్ డౌన్ ఎత్తివేశాక ఎయిర్ లైన్స్ ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ విమాన సేవల విషయంలో పలు నిబంధనలతో డ్రాఫ్ట్ రూపొందించింది.

వారు అడిగిన దాని కంటే భారీ ప్యాకేజీ: నిపుణుల సూచన.. జీడీపీలో 10%వారు అడిగిన దాని కంటే భారీ ప్యాకేజీ: నిపుణుల సూచన.. జీడీపీలో 10%

ప్రయాణీకుల జాగ్రత్త కోసం డ్రాఫ్ట్

ప్రయాణీకుల జాగ్రత్త కోసం డ్రాఫ్ట్

ప్రయాణీకులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఈ డ్రాఫ్ట్‌లో పేర్కొంది. మార్చి 25వ తేదీ నుండి దేశీయంగా విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. త్వరలో ప్రారంభమయ్యే అవకాశముంది. డ్రాఫ్ట్ సిద్ధం చేసిన కేంద్రమంత్రిత్వ శాఖ దానిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. లాక్ డౌన్ 3 తర్వాత ఎప్పుడైనా విమానాల గ్రౌండ్ నుండి పైకి లేవవచ్చు. డ్రాఫ్ట్, ఎయిర్ లైన్స్ ప్రారంభం గురించి నేడో రేపో ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

లగేజీ పరిమితి

లగేజీ పరిమితి

- ప్రయాణీకులు కేబిన్ లగేజీకి మించి తీసుకు రావొద్దు. అంటే 20 కేజీలు మించవద్దు. అదీ ఒక్క బ్యాగ్ మాత్రమే.

- 80 సంవత్సరాల వయస్సు దాటిన ఏ ప్రయాణీకుడిని కూడా విమానాల్లోకి అనుమతించరు.

- విమానం బయలుదేరే సమయానికి కనీసం 2 గంటలు ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి.

- కరోనాకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం నింపాలి. క్వారంటైన్ ఉంటే అందుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. క్వారంటైన్‌లో ఉన్నవారు ఐసోలోటెడ్ సెక్యూరిటీ చెకింగ్ యూనిట్‌ను సంప్రదించాలి.

- అందరికీ థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. కేబిన్, కాక్‌పిట్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ ఏజెన్సీలు, విమానాశ్రయ సిబ్బందిని పరీక్షించాకే అనుమతిస్తారు.

ఆరోగ్య సేతులో గ్రీన్ కలర్ ఉంటేనే

ఆరోగ్య సేతులో గ్రీన్ కలర్ ఉంటేనే

- ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ కలర్ స్టేటస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతి. వెబ్ చెక్ ఇన్ ఉంటుంది.

- ప్రయాణీకుడికి ఎవరికైనా అత్యవసర వైద్య సేవలు అవసరమైతే అందుకు వీలుగా మూడు వరుసల సీట్లను ఖాళీగా ఉంచాలని భావిస్తున్నారు.

- భౌతిక దూరం పాటించేందుకు సీటుకు సీటుకు మధ్య ఖాళీగా ఉంచాల్సిన అంశంపై తేల్చాల్సి ఉంది.

- విమానాశ్రయానికి చేరేందుకు ఆథరైజ్డ్ ట్యాక్సీలనే వాడాలి. అధిక ఉష్ణోగ్రత లేదా అధిక వయస్సు ఉన్న వారి ప్రయాణాన్ని తిరస్కరిస్తే అదనపు ఛార్జ్ చెల్లించకుండా ప్రయాణ తేదీ మార్చుకునేందుకు ఎయిర్ లైన్స్ అనుమతించాలి.

విమానాశ్రయాల్లో..

విమానాశ్రయాల్లో..

- మరోవైపు, విమానాశ్రయాలు ఐజోలేషన్ జోన్స్ ఏర్పాటు చేసుకోవాలి.

- ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ లేని విమానాశ్రయాల్లో కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణీకులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలే వైద్య వసతులు ఏర్పాటు చేయాలని సూచించింది.

- భౌతిక దూరం పాటించేలా మార్కింగ్స్ చేయాల్సి ఉంటుంది.

- లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, కుర్చీలు, ఆహార-పానియాల ఔట్ లెట్స్‌ను ఎప్పటికప్పుడు డిస్‌ఇన్ఫెక్టింగ్ చేయాలి.

English summary

ఆరోగ్య సేతులో గ్రీన్ స్టేటస్: విమానం ఎక్కాలంటే కండిషన్స్ అప్లై! ఇవి తెలుసుకోండి.. | No cabin baggage into flights, questionnaire for passengers

As the lockdown in the country probably is coming to an end, the civil aviation ministry has come out with a draft standard operating procedure (SOP) for restarting commercial air passenger services in the country.
Story first published: Wednesday, May 13, 2020, 7:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X