For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI నగదు ఉపసంహరణ, కొత్త రూల్స్ ఇవే.. తెలుసుకోండి

|

ప్రభుత్వరంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తమ అకౌంట్ హోల్డర్స్‌కు పరిమిత సంఖ్యలో ఏటీఎం నుండి ఉచిత నగదును ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇస్తుంది. నగదు ఉపసంహరణ ఉచిత పరిమితి మించితే ఛార్జీ ఉంటుంది. కానీ చిన్న, నో ఫ్రిల్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవని ఎస్బీఐ తన వెబ్ సైట్‌లో పేర్కొంది.

ఐటీ రంగానికి ఊహించని దెబ్బ: ఈసారి నష్టపోయినా... కంపెనీల ఆశ అదేఐటీ రంగానికి ఊహించని దెబ్బ: ఈసారి నష్టపోయినా... కంపెనీల ఆశ అదే

ఉచిత ట్రాన్సాక్షన్స్

ఉచిత ట్రాన్సాక్షన్స్

రూ.25,000 లోపు సగటు నెలవారీ మొత్తం ఉన్న కస్టమర్ ఏటీఎంలో ఉచితంగా ఎనిమిది ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఎస్బీఐలో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఇవి ఆరు మెట్రో నగరాలకే వర్తిస్తాయి. ఇతర నగరాల్లో ఎస్బీఐలో 5, ఇతర ఏటీఎంలలో 5 వరకు చేసుకోవచ్చు.

రూ.లక్ష వరకు..

రూ.లక్ష వరకు..

రూ.25,000 నుండి లక్ష వరకు యావరేజ్ మినిమం బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ హోల్డర్స్ ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎనిమిది వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మెట్రోల్లో 3, ఇతర నగరాల్లో 5 చేసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

రూ.1,00,000 యావరేజ్ మినిమం బ్యాలెన్స్ ఉంటే ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉచితం.

అన్ని లొకేషన్స్‌లలో శాలరీ అకౌంట్ హోల్డర్స్‌కు అన్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉచితం.

ఒక్కో ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీ

ఒక్కో ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీ

పరిమితి మించి ఏటీఎంలలో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఒక్కోదానికి రూ.10 నుండి రూ.20 వరకు ఛార్జీ (జీఎస్టీ అదనం) వసూలు చేస్తారు. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు వర్తిస్తుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 నుండి రూ.8 వరకు ప్లస్ జీఎస్టీ ఉంటుంది.

ఇన్‌సఫిసియెంట్ బ్యాలెన్స్‌కు రూ.20 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ విధిస్తుంది.

ఇదిలా ఉండగా, సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్స్ కోత విధించడంతో 31 మే నుండి 2.7 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది.

English summary

SBI నగదు ఉపసంహరణ, కొత్త రూల్స్ ఇవే.. తెలుసుకోండి | New Rules: SBI cash withdrawal from savings account

India’s largest public sector bank,State Bank of India (SBI) has revised its cash withdrawal rules from savings account. The new rules will come to effect from 1 July.
Story first published: Monday, July 6, 2020, 20:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X