For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే వార్త, ధరలు భారీగా తగ్గింపు: కొత్త ప్లాన్ ఎప్పటి నుండి అంటే

|

నెట్ ఫ్లిక్స్ ఇండియా అదిరిపోయే న్యూస్ చెప్పింది. 2016లో భారత్‌లో సేవలు ప్రారంభించినప్పటి నుండి మొదటిసారి నెట్ ఫ్లిక్స్ ధరలను తగ్గించింది. ఎంట్రీ లెవల్ బేసిక్ ప్లాన్ రూ.499 నుండి ఏకంగా రూ.199కి తగ్గించింది. ఎంట్రీ లెవల్ బేసిక్ ప్లాన్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ (SD) ద్వారా షోలు, సినిమాలు సింగిల్ మొబైల్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ లేదా టెలివిజన్ స్క్రీన్ పైన చూడవచ్చు. రెండు స్క్రీన్స్‌కు అవకాశం కలిగిన స్టాండర్డ్ టైర్ (హై-డెఫినిషన్-HD) కంటెట్‌ను రూ.649 నుండి రూ.499కి తగ్గించింది. నాలుగింటిని సపోర్ట్ చేసే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్రీమియం టైర్ (అల్ట్రా హై డెఫినిషిన్(అల్ట్రా-HD) కంటెంట్‌ను రూ.799 నుండి రూ.649కి తగ్గించింది. 2019 జూలై నెలలో లాంచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను రూ.199 నుండి రూ.149కి తగ్గించింది.

కొత్త బిల్లింగ్ ఎప్పటి నుండి అంటే?

కొత్త బిల్లింగ్ ఎప్పటి నుండి అంటే?

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ తన కస్టమర్లకు ధరలు తగ్గించడం శుభవార్త. పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తన యూజర్ బేస్‌ను పెంచుకోవడానికి నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా తర్వాత డిజిటల్ కంటెంట్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎంట్రీ లెవల్ బేసిక్ ప్లాన్ ధరను రూ.199కి, స్టాండర్డ్ టైర్ ధరలను రూ.499కి, ఖరీదైన ప్రీమియం టైర్ ధరను రూ.649కి తగ్గించింది. మొబైల్ ఓన్లీ ప్లాన్ ఇక నుండి రూ.149కే అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ధరలు ఆయా కస్టమర్ల తదుపరి బిల్లింగ్ సైకిల్ నుండి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

ఆటో అప్ గ్రేడ్ ఫీచర్

ఆటో అప్ గ్రేడ్ ఫీచర్

నెట్ ఫ్లిక్స్ యూజర్‌ను పెంచుకునేందుకు ఆటో అప్ గ్రేడ్ ఫీచర్‌ను ఇటీవల తీసుకు వచ్చింది. ఒకవేళ యూజర్ రూ.499 బేసిక్ ప్లాన్ పన ఉండి, తాను స్టాండర్డ్‌కు మారాలని భావిస్తే రూ.499కే స్టాండర్డ్ ప్లాన్‌లోకి మారవచ్చు. అంటే తక్కువ ధరకే యూజర్లు కొత్త ప్లాన్‌లోకి అప్ గ్రేడ్ కావొచ్చు. నెట్ ఫ్లిక్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే భారత్‌లో వృద్ధికి అవరోధంగా మారిందని అంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ ఎంటర్నైన్మెంట్ జీ5, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ సోనీ లైవ్ నుండి నెట్ ఫ్లిక్స్ పోటీని ఎదుర్కొంటోంది.

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఖరీదు

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఖరీదు

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం మరింత ఖరీదు అవుతోంది. కొత్తగా సభ్యత్వం తీసుకునే వారు 50 శాతం అదనంగా చెల్లించాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వం రూ.999 కాగా, దీనిని రూ.1499కి పెంచుతున్నారు. ఈ పెంచిన ధరలు నేటి నుండి అమలులోకి వస్తాయని ఇటీవలే ప్రకటించింది. డిసెంబర్ 14వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాలంటే రూ.1499 చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం మూడు విధాలుగా ఉంటుంది. నెలవారీ, త్రైమాసికం, వార్షికసభ్యత్వాలు ఉంటాయి. ప్రస్తుతం నెలవారీ సభ్యత్వ ఛార్జ్ రూ.129గా ఉండగా, పెంచిన ధరతో రూ.179కి పెరిగింది. అంటే 38 శాతం అధికం. మూడు నెలల మెంబర్‌షిప్ రూ.329 నుండి 39 శాతం పెరిగి రూ.459 అవుతోంది. వార్షిక సభ్యత్వం రూ.999 నుండి రూ.1499కి పెరిగింది. అంటే 50 శాతం పెరుగుదల.

English summary

నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే వార్త, ధరలు భారీగా తగ్గింపు: కొత్త ప్లాన్ ఎప్పటి నుండి అంటే | Netflix slashes its India pricing, now avNetflix slashes its India pricing, now available at Rs 149 per monthailable at Rs 149 per month

Netflix is reducing its India pricing for the first time since the service's foray in 2016 as it looks to ramp up its user base amid intense competition and a rising appetite for digital content in the country.
Story first published: Tuesday, December 14, 2021, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X