For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ.. ఇలా చేయండి

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ ఖాతాదారుల కోసం ఓటీపీ ఆధారిత ఏటీఎం ఉపసంహరణను అందిస్తోంది. రూ.10,000 అంతకంటే ఎక్కువ వ్యాల్యూ కలిగిన ట్రాన్సాక్షన్స్ పైన డెబిట్ కార్డు పిన్ నెంబర్‌తో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు బ్యాంకు పంపిన ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. ఏటీఎం వద్ద జరిగే మోసాలను నివారించడంలో ఇది ఉపకరిస్తుంది. ఓటీపీ నాలుగు అంకెల అథెంటిక్ నెంబర్. ఇది కేవలం సింగిల్ ట్రాన్సాక్షన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎస్బీఐ ఈ సౌకర్యాన్ని జనవరి 1, 2020 నుండి తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

- SBI ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకోవడానికి ఓటీపీ అవసరం.

- బ్యాంకు ఓటీపీని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పంపిస్తుంది.

- ఓటీపీ ఫోర్ డిజిట్ నెంబర్. కస్టమర్లు తమ సింగిల్ ట్రాన్సాక్షన్ కోసం దీనిని వినియోగించవచ్చు.

- మీరు ఒకసారి మీరు ఉపసంహరించుకోవాలనుకున్న అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ స్క్రీన్ డిస్‌ప్లే అవుతుంది.

Know the SBI OTP based ATM cash withdrawal

- బ్యాంకుతో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

ఏటీఎంల వద్ద జరిగే మోసాలకు చెక్ పెట్టడానికి ఏటీఎంల వద్ద కార్డు రహిత నగదు ఉపసంహరణలను ప్రవేశ పెట్టడానికి అన్ని బ్యాంకులను అనుమతించాలని ఆర్బీఐ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. యూపీఐ వ్యవస్థను వినియోగిస్తున్న అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో కార్డ్‌లెస్ క్యాష్ ఉపసంహరణ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

English summary

SBI ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ.. ఇలా చేయండి | Know the SBI OTP based ATM cash withdrawal

SBI customers can avail of the bank’s OTP based cash withdrawal facility which protects them from unauthorised transactions at ATMs. The OTP is a four-digit number that authenticates the user for a single transaction.
Story first published: Monday, April 11, 2022, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X