For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF పెట్టుబడి ప్రయోజనాలెన్నో, అకౌంట్‌ను ఇలా ఓపెన్ చేయవచ్చు

|

వడ్డీ రేటు అంశాన్ని పక్కన పెడితే, సురక్షిత పెట్టుబడిగా భావించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) కీలక పెట్టుబడి సాధనం. ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడి స్కీం కూడా. రిస్క్ ఫ్రీ పెట్టుబడి, మంచి రిటర్న్స్ కోసం చాలామంది ఈ పథకంలో పెట్టుబడి పెడుతుంటారు. ఈ పథకంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. తమ పీపీఎఫ్ అకౌంట్లో ఏడాదికి రూ.500 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు.

పీపీఎఫ్ అకౌంట్ ప్రయోజనాల్లో ముఖ్యంగా అత్యవసర సమయంలో వెంటనే అకౌంట్ హోల్డర్‌కు వెంటనే లోన్ వస్తుంది. వడ్డీ రేటు కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఏడాదికి వడ్డీ రేటు 1 శాతంగా ఉంటుంది. అయితే ఈ ప్రయోజనం అకౌంట్ హోల్డర్ ఖాతాను ఓపెన్ చేసిన మూడు నుండి ఆరేళ్ల వరకు ఉంటుంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ పదిహేను సంవత్సరాలు. ఖాతాదారు ఆరేళ్ల తర్వాత నగదును ఉపసంహరించుకోవచ్చు. ఖాతాదారు మెచ్యూరిటీ తర్వాత కూడా పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకోవచ్చు.

పన్ను ప్రయోజనాలు

పన్ను ప్రయోజనాలు

ఈ స్కీం ద్వారా పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు పన్ను ప్రయోజనాలు దక్కుతాయి. ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం1961 యాక్టులోని సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్ వడ్డీ రేటు పైన కూడా పన్ను ప్రయోజనం ఉంటుంది. ఇండివిడ్యువల్స్ కూడా మెచ్యూరిటీ తర్వాత ఎలాంటి పన్ను భారం లేకుండా నగదును ఉపసంహరించుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ వడ్డీ రేటును ప్రభుత్వం సవరిస్తుంటుంది. ఇటీవలి సవరణ ప్రకారం పీపీఎఫ్ పైన వడ్డీ రేటు ప్రయోజనం 7.1 శాతంగా ఉంది. ప్రభుత్వ ఇతర ఫిక్స్డ్ ఇన్‌కం సాధనాలతో పోలిస్తే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నది ఈ స్కీంకే.

పీపీఎఫ్ ఓపెనింగ్

పీపీఎఫ్ ఓపెనింగ్

పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి తొలుత అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. బ్యాంకు నెట్ బ్యాంకింగ్‌లోకి లాగ్-ఇన్ కావాలి. ఆప్షన్‌లోకి వెళ్లి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలు ఫిల్ చేయాలి. బ్యాంకు పేరు, నామినీ వంటి వివరాలు పూర్తి చేయాలి. డిటైల్స్ వెరిఫై తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇండివిడ్యువల్స్ కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి కూడా ఖాతాను తెరవవచ్చు.

ఎవరికైనా ప్రయోజనం

ఎవరికైనా ప్రయోజనం

ఆర్థికమంత్రిత్వ శాఖ నేషనల్ సేవింగ్స్ ఇనిస్టిట్యూట్ ద్వారా పీపీఎఫ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వ్యాపారస్తులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా పదవీ విరమణ చేసిన వారు కూడా పీఎఫ్ ఖాతాను తెరిచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది వంద శాతం రిస్క్ లేని పెట్టుబడి. స్టాక్ మార్కెట్ మాదిరి భారీ ఒడిదుడుకులు ఉండవు. వడ్డీ వస్తుంది.

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి వడ్డీ ఉంటుంది. మంచి రాబడి వస్తుంది. పదిహేనేళ్ల మెచ్యూరిటీ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు. బ్యాంకుల్లో లేదా పోస్టాఫీస్‌లో పీపీఎఫ్ ఖాతా పొడిగింపు ఫాంను అందచేయవచ్చు.

English summary

PPF పెట్టుబడి ప్రయోజనాలెన్నో, అకౌంట్‌ను ఇలా ఓపెన్ చేయవచ్చు | Know the hidden benefits of PPF investment

PPF or Public Provident Fund is one of the most famous, tax saving investment scheme backed by the Indian government. Many people choose this scheme to get good returns as it is a risk free investment and has a number of advantages.
Story first published: Monday, October 25, 2021, 12:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X