ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ప్రయోజనాలు ఏమిటి?

మెడికల్ ఎమర్జెన్సీ, హఠాత్తుగా ఉద్యోగం పోవడం లేదా ముందస్తు ప్రణాళిక లేని ఈవెంట్ వంటి తక్షణ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడం కోసం చాలామంది మొగ్గు చూపేది తక్షణ వ్యక్తిగత రుణం. ఇలాంటి సందర్భాల్లో ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ త్వరిత క్రెడిట్ కోసం సరైన ఎంపిక. దీనికి డాక్యుమెంటేషన్ ఏమీ ఉండదు. ఆన్‌లైన్ ద్వారా పేపర్‌లెస్ ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు, తక్కువ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు ఉంటాయి.

ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కోసం ఇవి అవసరం

ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కోసం ఇవి అవసరం

- ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కోసం మీ అర్హత చెక్ చేసుకోవాలి. అలాగే డాక్యుమెంటేషన్ ఏవి అవసరమో తెలుసుకోవాలి.

- మంచి ఫైనాన్షియల్ ప్రొఫైల్ కలిగి ఉండాలి.

- సరైన వేదిక ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత

అర్హత

- ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం పలు ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి. ఇందులో కొన్ని...

- లేటెస్ట్ క్రెడిట్ నివేదిక ఆధారంగా బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన.

- మీ నెలవారీ ఆదాయంలో ఇటీవల పెరుగుదల.

- ఇప్పటికే ఉన్న రుణాల గణనీయ మొత్తంలో తిరిగి చెల్లించడం.

డాక్యుమెంటేషన్

డాక్యుమెంటేషన్

- సాధారణంగా బ్యాంకులు ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు ప్రీ-అప్రూవ్డ్ రుణాలను అందిస్తాయి. దీని అర్థం మీరు రుణం పొందడానికి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని అర్థం.

- రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు ఇప్పటికే బ్యాంకు కస్టమర్ కాకపోయి ఉంటే ఈ కింది పత్రాలను సమర్పించాలి. ఇది కూడా ఎంచుకున్న స్కీం ప్రకారం ఉంటుంది.

- పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, 3 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్

ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌కు ముందు చేయాల్సిన పనులు

ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌కు ముందు చేయాల్సిన పనులు

వ్యక్తిగత రుణం పొందడానికి గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

- రుణం కోసం ఎక్కువ దరఖాస్తులు చేయవద్దు.

- వీలైనంత వరకు రుణాన్ని ఏకీకృతం చేయాలి.

- గత ఆరు నెలల్లో మీరు వ్యక్తిగత రుణం పొందలేదని నిర్ధారించుకోవాలి.

- మీ ప్రస్తుత ఈఎంఐలు మీ నికర టేక్-హోమ్ చెల్లింపులో మూడింట రెండు వంతులు మించకుండా చూసుకోవాలి.

- సెక్యూర్డ్, అన్-సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ అవసరం.

- హెల్తీ క్రెడిట్ స్కోర్ అవసరం.

- మీ క్రెడిట్ బకాయిలను సకాలంలో చెల్లించాలి.

- పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయంతో మీరు ఎంత తిరిగి చెల్లించవలసి ఉంటుంది, ఎంత తరుచు చెల్లించవలసి ఉంటుందో తెలుసుకోండి.

- వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పరిశీలించి రుణం తీసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇతర ప్రయోజనాలు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇతర ప్రయోజనాలు

- వ్యక్తిగత రుణం దరఖాస్తుకు వివిధ మార్గాలు ఉన్నాయి. మీకు ఏది సులభంగా అనిపిస్తే అలాచేయవచ్చు.

- ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్ లైన్ ప్రాసెస్ ఉంటాయి.

- ముందస్తు చెల్లింపుకు, ముందస్తు ముగింపుకు ఛార్జీలు వర్తిస్తాయి.

- అలా తీసుకున్న లోన్స్‌ను జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మంజూరు చేయమని కోరవచ్చు.

- ముందస్తు రుణాలకు ప్రాసెసింగ్ సమయం చాలా తక్కువ. పలు సందర్భాల్లో తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తాయి బ్యాంకులు.

- ప్రీ-అప్రూవ్డ్ రుణాలకు కావాల్సిన సమయాన్ని రుణగ్రహీత ఎంచుకోవచ్చు. పన్నెండు నెలల నుండి 60 నెలల సమయం ఉంటుంది.

- - డబ్బును దేనికి ఎంత వెచ్చిస్తున్నారో చెప్పవలసిన అవసరం లేదు.

- ఆఫర్ వచ్చిన వారు, బ్యాంకు ప్రతినిధిని సంప్రదించి అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి నిధులు నేరుగా మీ బ్యాంకులో జమ చేస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+