For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అకౌంట్‌తో ఎన్నో ప్రయోజనాలు: పాత సేవింగ్స్ అకౌంట్‌ను జన్ ధన్‌కు ఇలా మార్చుకోండి

|

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ప్రభుత్వ ప్రాయోజిత ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రోగ్రాం. దీనిని 2014లో ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న వ్యక్తులను చేర్చడం, ఆర్థిక సేవల ప్రాప్తిని ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సూచిస్తుంది. వీరికి బ్యాంకు ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్ సేవలు, పెన్షన్లు, బీమా వంటి సరసమైన ఆర్థిక ఉత్పత్తులకు ప్రాప్యత ఉందని నిర్ధారించుకోవడానికి జన్ ధన్ యోజన అకౌంట్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంతో మోడీ సర్కార్ ఈ జన్ ధన్ స్కీంను ప్రారంభించింది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి వాటితో ఈ ఖాతాను తెరువవచ్చు.

జన్ ధన్ అకౌంట్‌కు అర్హులు ఎవరు?

జన్ ధన్ అకౌంట్‌కు అర్హులు ఎవరు?

జన్ ధన్ ఖాతా తెరిచే వ్యక్తులు భారతీయులై ఉండాలి. దరఖాస్తుదారుకు పదేళ్లు నిండాలి. పదేళ్ల వయస్సు ఉంటే అతని/ఆమె తరఫున అకౌంట్ నిర్వహణ కోసం సంరక్షకుడు ఉండాలి. అలాగే దరఖాస్తుదారు రూపే కార్డుకు అర్హులు. ఏటీఎం నుండి ఈ కార్డు ద్వారా నాలుగుసార్లు ఉపసంహరించుకోవచ్చు. దరఖాస్తుదారు తన నేషనాలిటీని నిరూపించుకునేందుకు సరైన డాక్యుమెంటేషన్ లేకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ చెక్ ఆధారంగా ఖాతాను తెరువవచ్చు. ఒక వ్యక్తికి బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే దానిని ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు బదలీ చేసుకోవచ్చు. తద్వారా ఈ అకౌంట్ ప్రయోజనాలు పొందవచ్చు.

జన్ ధన్ అకౌంట్ ప్రయోజనాలు

జన్ ధన్ అకౌంట్ ప్రయోజనాలు

జన్ ధన్ యోజన అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. అయితే బ్యాంకును బట్టి కస్టమర్ చెక్కుబుక్కు వంటి అదనపు సేవలను కోరుకుంటే కనీస మొత్తం అవసరం.

రూపే డెబిట్ కార్డు ఇస్తారు. ఇది దేశంలోని ఏ ఏటీఎం నుండి అయినా డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉపయోగపడుతుది.

జన్ ధన్ అకౌంట్ పైన ఇన్సురెన్స్ ఉంటుంది. అందరు PMJDY ప్లాన్ ఖాతాదారులకు రూ.30,000 లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ ఉంది.

ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్ చొరవ కింద ఖాతా తెరిస్తే 6 నెలల తర్వాత ఖాతాదారుడు రూ.5000 ఓవర్ డ్రాఫ్ట్‌ను పొందవచ్చు.

ఇలా మార్చుకోవచ్చు?

ఇలా మార్చుకోవచ్చు?

ఆకర్షణీయ ప్రోత్సాహకాల కారణంగా చాలామది ఖాతాదారులు తమ మునుపటి డిపాజిట్ ఖాతాలను జన్ ధన్ అకౌంట్‌గా మార్చాలనుకుంటున్నారు. కన్ఫూజన్ ఉండవద్దనుకుంటే జన్ ధన్ యోజన కింద మరొక కొత్త ఖాతాను తెరవడం సముచితం.

అయితే వారు తమ ప్రస్తుత ఖాతాలను కుదించాలనుకుంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద బీమా ప్రయోజనాలను పొందడానికి ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఖాతాదారులకు రూపే కార్డు జారీ చేయాలి.

మీ సేవింగ్స్ ఖాతాను పూర్తిస్థాయి జన్ ధన్ ఖాతాగా మార్చడానికి, ప్రయోజనాలు పొందడానికి మీరు మీ పాన్, ఆధార్ కాపీలను రాతపూర్వక దరఖాస్తు ద్వారా అందించాలి.

English summary

ఈ అకౌంట్‌తో ఎన్నో ప్రయోజనాలు: పాత సేవింగ్స్ అకౌంట్‌ను జన్ ధన్‌కు ఇలా మార్చుకోండి | Know how to convert an Old savings account to Jan Dhan account

The Pradhan Mantri Jan Dhan Yojna is a government-sponsored financial inclusion program that began in 2014. The term "financial inclusion" refers to the inclusion of a growing number of people in the country's financial system and access to financial services.
Story first published: Friday, July 23, 2021, 17:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X