For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు

|

Crorepathi Tips: ప్రస్తుత కాలంలో ప్రజల్లో పర్సనల్ ఫైనాన్స్, సేవింగ్స్ వంటి ఆర్థిక అంశాలపై అవగాహన బాగా పెరిగింది. చిన్న పెట్టుబడితో పెద్ద మెుత్తంలో డబ్బును ఎలా కూడబెట్టాలనే దానిపై చాలా మంది కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఉన్న అత్యుత్తమైన మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 డబ్బును రెట్టింపు చేయటం కష్టమేనా..?

డబ్బును రెట్టింపు చేయటం కష్టమేనా..?

డబ్బు సంపాదించడం సులభం. కానీ.. దానిని రెట్టింపు చేయటం కష్టమైన పనే. ఇందుకోసం సరైన ప్రణాళిక, సరైన పెట్టుబడి ఎంపిక చాలా ముఖ్యం. డబ్బును సురక్షితంగా ఉంచటం మాత్రమే కాదు దాని నుంచి మంచి రాబడి పొందటం చాలా కీలకం. ఇందుకోసం చిన్న వయస్సు నుంచే పెట్టటం ప్రారంభించటం అలవరుచుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే, మిలియనీర్ అవ్వడం అంత ఈజీ కాదు.

నిర్ణీత మెుత్తంలో పెట్టుబడి పెడితే..

నిర్ణీత మెుత్తంలో పెట్టుబడి పెడితే..

ఎవరైనా వ్యక్తి క్రమం తప్పకుండా నిర్ణీత మెుత్తాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే తప్పకుండా మిలియనీర్ కావచ్చు. దీని వెనుక కాంపౌండింగ్ ఫార్ములా పనిచేస్తుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ సాధారణ సూత్రం పెట్టుబడి దీర్ఘకాలికంగా ఉండాలి. అసలు పెట్టుబడిపై వడ్డీ, ఇలా వడ్డీ అసలుపై మళ్లీ వడ్డీ సంపాదించటం వల్ల సంపద వేగంగా పెరుగుతుంది.

15x15x15 ఫార్ములాతో సేవింగ్..

15x15x15 ఫార్ములాతో సేవింగ్..

పెట్టుబడి - రూ.15,000

పెట్టుబడి కాలం - 15 సంవత్సరాల

వడ్డీ - 15%

కార్పస్ - 15 ఏళ్ల తర్వాత రూ. కోటి

మొత్తం పెట్టుబడి - రూ.27 లక్షలు

కాంపౌండింగ్ ఎఫెక్ట్ - రూ.73 లక్షల వడ్డీ పొందారు

మ్యూచువల్ ఫండ్స్‌ రూపంలో..

మ్యూచువల్ ఫండ్స్‌ రూపంలో..

మీరు మ్యూచువల్ ఫండ్స్‌తో నెలవారీ SIP చేస్తే రూ.10 వేలతో దీన్ని ప్రారంభించండి. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడి 12 శాతం వరకు ఉంటుంది. ఇక్కడ మీరు 20 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కాలంలో మొత్తం పెట్టుబడి రూ. 24 లక్షలు అవుతుంది. దీనిపై లభించనున్న వడ్డీ రూ.74.93గా ఉంటుంది. అంటే చివరిలో పెట్టుబడిదారునికి రూ.98.93 లక్షలు అందుతుంది. ఇక్కడ కూడా చక్రవడ్డీ ఫార్ములా పనిచేస్తుంది. పైగా ఈ పెట్టుబడిలో రిస్క్ తక్కువగా ఉంటుంది.

English summary

Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు | know how to become crorepati with small saving formula with compounding effect

know how to become crorepati with know this easy formula now
Story first published: Friday, August 19, 2022, 17:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X