For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ATM సెంటర్‌ ఫ్రాంచైజ్ కావాలా..? నెలకు రూ.80 వేల వరకు ఆదాయం.. పూర్తి వివరాలు..

|

SBI ATM: దేశంలోని యువత ఇప్పుడు స్వయం ఉపాధిపై చాలా ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ ఫాంచైజీతో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఎస్‌బీఐ ఏటీఎంను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నెలకు రూ.80 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. పైగా ఇందులో ఎలాంటి రిస్క్ లేకుండా సంపాదన పొందవచ్చు. అసలు ప్రాంఛైజీ ఎలా తీసుకోవాలి, ఏఏ పత్రాలు అవసరం వంటి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోండి..

ఏటీఎం ఇన్టలేషన్..

ఏటీఎం ఇన్టలేషన్..

భారతదేశంలో ఏ బ్యాంకు కూడా బ్యాంకు తరపున ATM మెషీన్‌లను ఇన్‌స్టాల్ చేయలేదు. ప్రయివేటు సంస్థలతో ఒప్పందం చేసుకుంటాయి. బ్యాంక్ తరఫున ఆ కంపెనీలే ఏటీఎం మిషన్లను అమర్చడం జరుగుతుంది. మనం ATM ఫ్రాంచైజీని పొందడం ద్వారా ప్రతి నెలా ఎక్కువ సంపాదించవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఎలా దరఖాస్తు చేయాలి?

SBI ATM లైసెన్స్ పొందాలనుకునే వ్యక్తులు SBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. టాటా ఇండిక్యాష్, ముత్తూట్ ఎటీఎం, ఇండియా వన్ ఎటీఎమ్‌లు దేశంలో మెషిన్ల ఇన్‌స్టాలేషన్ కోసం అనుమతి పొందాయి. మీరు ఈ కంపెనీల వెబ్‌సైట్‌లకు ఆన్‌లైన్‌లో వెళ్లి ATM సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏఏ పత్రాలు అవసరం..

ఏఏ పత్రాలు అవసరం..

ముందుగా SBI ATM ఏర్పాటుకు బ్యాంక్ కొన్ని షరతులు విధిస్తుంది. ఇప్పుడు ఆ షరతులు, అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా SBI ATMని ఇన్‌స్టాల్ చేయడానికి ఈ కింది పత్రాలు అవసరం అవుతాయి.

1. ఐడెంటిటీ ఫ్రూఫ్

2. అడ్రస్ ప్రూఫ్

3. బ్యాంక్ ఖాతా, పాస్‌బుక్

4. ఫోటోగ్రాఫ్

5. ఈ-మెయిల్ ID

6. మొబైల్ నంబర్

7. GST రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు ఇతర ఫైనాన్సియల్ డాక్యుమెంట్లు అవసరం

పైన అడిగిన పత్రాల్లో గుర్తింపు రుజువు కోసం ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఉపయోగించవచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉపయోగించవచ్చు.

ఎంత పెట్టుబడి అవసరం?

ఎంత పెట్టుబడి అవసరం?

SBI ATMని ఇన్‌స్టాల్ చేయడానికి మొత్తం ఐదు లక్షల రూపాయల అవసరం. ఈ మెుత్తంలో రూ. 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాలి. మిగిలిన రూ.3 లక్షలు మూలధనంగా జమ చేయాల్సి ఉంటుంది.

 ఎంత ఆదాయం వస్తుంది?

ఎంత ఆదాయం వస్తుంది?

ATM సెంటర్‌ను ఏర్పాటు చేస్తే వన్-టైమ్ లావాదేవీకి రూ.8, నగదు రహిత సేవలకు రూ. 2 కమీషన్ లభిస్తుంది. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎం సెంటర్ ద్వారా రోజూ 250 లావాదేవీలు జరిగితే కమీషన్ రూపంలో నెలకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు రాబడి వస్తుంది. లావాదేవీలు పెరిగేకొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే రోజుకు యావరేజ్ గా 500 లావాదేవీలు జరిగినట్లయితే నెలకు రూ.90,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు.

 దీనికి ప్రాథమిక అవసరాలు ఇవే..

దీనికి ప్రాథమిక అవసరాలు ఇవే..

* ఏటీఎంను 50 నుంచి 80 చదరపు అడుగుల వాణిజ్య స్థలంలో ఉంచాలి.

* మీ ఏటీఎం లొకేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఏ ఇతర బ్యాంకు ఏటీఎంలు ఉండకూడదు.

* ఏటీఎంను అమర్చే ప్రదేశం సురక్షిత ప్రదేశంలో, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండాలి.

* విద్యుత్ కనెక్షన్ కనీసం 1 KW రేటింగ్, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి.

* మీరు రోజుకు కనీసం 300 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు హామీ ఇవ్వాలి.

* ఏటీఎం సెంటర్‌కు కాంక్రీట్‌ రూఫ్‌ వేసి భద్రత కల్పించాలి.

నిర్వహణ శిక్షణ ఇస్తారు..

నిర్వహణ శిక్షణ ఇస్తారు..

మీ ఫ్రాంచైజ్ దరఖాస్తును స్వీకరించిన వెంటనే SBI ఫ్రాంచైజీ బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. మీ వివరాలను ధృవీకరించిన తర్వాత.. ఏ ATMని ఇన్‌స్టాల్ చేయాలో SBI మీకు సలహా ఇస్తుంది. ఆ తర్వాత ఎస్‌బీఐ ఏటీఎం మెషిన్‌లో డబ్బులు ఎలా జమ చేస్తారు? డబ్బును ఎలా నిర్వహించాలో మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. కార్డ్ జామింగ్, ATMలను రీబూట్ చేయడం వంటి చిన్న చిన్న లోపాలు ఏర్పడినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పిస్తారు.

English summary

SBI ATM సెంటర్‌ ఫ్రాంచైజ్ కావాలా..? నెలకు రూ.80 వేల వరకు ఆదాయం.. పూర్తి వివరాలు.. | know how to apply foe sbi bank atm franchise to earn 80 thousand per month without any risk

know how to apply foe sbi bank atm franchise in detail
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X