For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడే రిలయన్స్ రైట్స్ ఇష్యూ: కొనుగోలు చేయవచ్చు.. ఇవి తెలుసుకోండి

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ కోసం రికార్డ్ తేదీని మే 14న ఖరారు చేసింది. రూ.53,125 కోట్లతో ప్రకటించిన ఈ రైట్స్ ఇష్యూలో భాగంగా ప్రతి 15 రిలయన్స్ షేర్లకు ఒక షేరును జారీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీ నాటి షేర్ ముగింపు ధరపై 14 శాతం డిస్కౌంట్‌తో ఒక్కో షేర్‌ను రూ.1,257కు జారీ చేయనుంది. రిలయన్స్ దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ రైట్స్ ఇష్యూను ప్రకటించింది.

రిలయన్స్‌కు సంబంధించి మరిన్ని వార్తలు

షేర్ ధర, రాయితీ, దరఖాస్తు

షేర్ ధర, రాయితీ, దరఖాస్తు

అత్యధిక మార్కెట్ వ్యాల్యూ కలిగిన ప్రయివేటు కంపెనీ రిలయన్స్ రైట్స్ ఇష్యూతో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. రుణరహిత కంపెనీగా మార్చాలనే లక్ష్యంతో రైట్స్ ఇష్యూ రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూను ప్రకటించింది. ఆ రోజున రిలయన్స్ షేర్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి 15 షేర్లకు ఒక్కో షేరు చొప్పున కంపెనీ కేటాయిస్తుంది. ఒక్కో షేరు ధరను రూ.1,257గా నిర్ణయించింది. ఏప్రిల్ 30 నాటిధరపై 14 శాతం రాయితీ. రూ.10 ముఖ విలువ కలిగిన 42,26,26,894 షేర్లను జారీ చేస్తుంది.

చెల్లింపులు ఎలా

చెల్లింపులు ఎలా

ఈ ఇష్యూకు దరఖాస్తు చేసేందుకు మొత్తం వ్యాల్యూలో 25 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఒకటి రెండు దఫాలుగా చెల్లించవచ్చు. ఇటీవల టాటా గ్రూప్‌తో పాటు మిగతా రైట్స్ ఇష్యూలకు వాటాదారుల నుండి 25 నుండి 28 శాతం మేర స్పందన లభించింది. రిలయన్స్ ఇష్యూకు భారీ స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. 13 ఏళ్ల కిందట టాటా స్టీల్ రైట్స్ ఇష్యూకు 77 శాతం స్పందన వచ్చింది.

కొనుగోలు చేయవచ్చా?

కొనుగోలు చేయవచ్చా?

రైట్స్ ఇష్యూలో తమకు కేటాయించిన మొత్తం షేర్లకు ప్రమోటర్లు దరఖాస్తు చేస్తారు. అదే సమయంలో స్పందన రాని షేర్లను కొనుగోలు చేస్తారు. రానున్న కొద్ది రోజుల్లో కంపెనీ రాణిస్తుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. నోమురా, సెంట్రమ్, జేఎం వంటి సంస్థలు ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చునని భావిస్తున్నాయి. అంతేకాదు, ముఖేష్ అంబానీ పకడ్బంధీగా కంపెనీని వృద్ధిలోకి తీసుకు వెళ్తున్నాడని భావిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ చమురు సంక్షోభం కారణంగా తాత్కాలిక నష్టం జరిగిందని, అంతేకానీ కంపెనీ వ్యూహాలు, వ్యూహాత్మక పెట్టుబడులు బాగున్నాయని చెబుతున్నారు.

English summary

నేడే రిలయన్స్ రైట్స్ ఇష్యూ: కొనుగోలు చేయవచ్చు.. ఇవి తెలుసుకోండి | Know about Reliance Industries Rs 53,125 crore rights issue

Clarifying on its rights issue, Reliance Industries Limited (RIL) has said that shareholders whose fractional entitlements are being ignored will be given preferential consideration.
Story first published: Thursday, May 14, 2020, 10:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X