For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Post Office Savings Account Rules: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ నిబంధనలు తెలుసుకోండి

|

డిపార్టుమెంట్ ఆఫ్ పోస్ట్స్ నవంబర్ 5, 2021వ తేదీన పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ నిర్వహణ పైన ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. సేవింగ్స్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించి కొత్త పాస్ బుక్ జారీ చేయడం, జాయింట్ ఖాతా తెరవడం, POSB చెక్కు జారీ చేయడ వంటి వివిధ POSB కార్యకలాపాల ఆందోళనలపై స్పష్టత ఇచ్చింది. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా నిర్వహణకు సంబంధించి ఇచ్చిన వివరణ ఇలా ఉంది...

కొత్త పాస్‌బుక్ జారీ

కొత్త పాస్‌బుక్ జారీ

ఏదైనా ఇతర CBS-POలో పాత పాస్‌బుక్‌కు బదులు కొత్త పాస్‌బుక్‌ను జారీ చేయడానికి సంబంధించిన నిబంధన POSB CBS మ్యాన్యువల్‌లోని రూల్ 44లో నిర్దేశించింది. POSB CBS మాన్యువల్‌లోని రూల్ 44లో నిర్దేశించిన విధానాన్ని అనుసరించి ఏదైనా CBS PO ఉపయోగించిన లేదా పాతగా మారి చెడిపోయిన పాస్‌బుక్‌కు బదులు ఏదైనా మరో దానిని ఇతర CBS POలు జారీ చేయవచ్చునని స్పష్టం చేసింది.

GSPR 2018 రూల్ 5(5) ప్రకారం అంధులు లేదా దృష్టిలోపం ఉన్నవారు లేదా నిరక్షరాస్యులైన డిపాజిటర్లు అక్షరాస్యులైన డిపాజిటర్‌తో కలిసి ఉమ్మడి ఖాతాను తెరువవచ్చును. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ నిరక్షరాస్యులైన డిపాజిటర్లు సంయుక్తంగా ఉమ్మడి ఖాతాను తెరవడానికి స్కీం నియమాలలో ఎలాంటి పరిమితిలేదు. ఇద్దరు లేదా ముగ్గురు నిరక్షరాస్యులైన డిపాజిటర్లు మరియు అక్షరాస్యులైన డిపాజిటర్లు సంయుక్తంగా ఖాతాను తెరువవచ్చు.

చెక్కు జారీ..

చెక్కు జారీ..

POSB CBS మ్యాన్యువల్, POSB మ్యాన్యువల్ వ్యాల్యూమ్ 1 నిబంధనల ప్రకారం చెక్కు సదుపాయాన్ని పొందడానికి డిపాజిటర్ అక్షరాస్యతను కలిగి ఉండాలి. రూ.500 బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంతో పాటు రన్నింగ్ హ్యాండ్‌లో సైన్-ఇన్ చేయగలగాలి. మైనర్ స్వయంగా నిర్వహించే ఖాతాలకు చెక్కు సౌకర్యం కల్పించలేదు.

POSA స్కీమ్ 2019ని సవరించారు. POSA స్కీంలోని పేరా (3)(e) కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే ఖాతాను తెరవాలి. బేసిక్ సేవింగ్స్ ఖాతా అనేది ప్రత్యేక రకం ఖాతా. ఒక వ్యక్తి బేసిక్‌తో పాటు PO సేవింగ్స్ సింగిల్ ఖాతాను తెరువవచ్చును.

నగదు స్వీకరణ పరిమితి పెంపు

నగదు స్వీకరణ పరిమితి పెంపు

ఒకరోజులో ఒక ఖాతాలో బ్రాంచ్ పోస్టాఫీస్ వద్ద నగదు స్వీకరణ పరిమితిని రూ.25,000 నుండి రూ.50,000కు పెంచారు.

మైనర్ లేదా అన్-సౌండ్ మైండ్ వ్యక్తి ఖాతాను సందర్భానుసారంగా సంరక్షకుడు ఆపరేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న సంరక్షకుడి మార్పు కోర్టు ఆదేశాలపై మాత్రమే అనుమతించబడుతుంది.

English summary

Post Office Savings Account Rules: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ నిబంధనలు తెలుసుకోండి | Know About Post Office Savings Account Rules

The Department of Posts released clarifications on the operation of post office savings accounts in a circular dated November 5, 2021. The clarifications on different POSB Operations concerns such as the issuing of a new passbook, opening of a joint account, issuing a POSB Cheque to a Savings Joint Account, opening of a Basic Savings Account, and more.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X