For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

mAadhaar యాప్ తెలుసా? డౌన్‌లోడ్, ప్రయోజనాలు, సేవలు.. ఇంకా ఎన్నో ఫీచర్స్

|

బ్యాంకు అకౌంట్ తీయాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలనుకున్నా, పాస్ పోర్ట్ లేదా ఓటర్ ఐడీ కావాలన్నా, ప్రభుత్వ పథకాలకైనా.. ఇలా ఏ అవసరమైనా ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారింది! ఇలాంటి ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం mAadhaar యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజాగా, ఇందులో మార్పులు చేసి కొత్త వర్షన్‌ను తెచ్చింది.

మారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీమారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీ

mAadhaar అంటే ఏమిటి?

mAadhaar అంటే ఏమిటి?

UIDAI తీసుకు వచ్చిన అధికారిక మొబైల్ యాప్ mAadhaar. పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, పోటోగ్రాఫ్, ఆధార్ నెంబర్ స్మార్ట్ ఫోన్‌లకు లింక్ అయి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, iOS స్మార్ట్ ఫోన్‍‌లలో లభిస్తుంది. ఈ సౌకర్యంతో యాప్ ద్వారా తమ వివరాలు చూపించవచ్చు.

mAadhaar యాప్ డౌన్‌లోడ్ ఎలా?

mAadhaar యాప్ డౌన్‌లోడ్ ఎలా?

- mAadhaar యాప్‌ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...

- గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

- mAadhaar UIDAI app ను ఎంచుకోవాలి.

- Install బటన్ పైన క్లిక్ చేయాలి.

- యాప్ డౌన్ లోడ్ అయిన తర్వాత దానిని ఓపెన్ చేయండి

- పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఆ తర్వాత పాస్ వర్డ్ ఎంటర్ చేసి ముందుకు వెళ్లాలి.

mAadhaar డౌన్‌లోడ్.. అనుసంధానం

mAadhaar డౌన్‌లోడ్.. అనుసంధానం

mAadhaar యాప్‌ను ప్లేస్టోర్/యాప్ స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. OTP నమోదు చేయాలి. ఆ తర్వాత యాప్‌లోకి వెళ్లి ఆధార్ కార్డు నెంబర్ పేర్కొనాలి. మళ్లీ OTP వస్తుంది. దీనిని ఎంటర్ చేసిన తర్వాత యాప్‌కు మీ ఆధార్ అనుసంధానమవుతుంది.

ఆధార్ లాక్

ఆధార్ లాక్

సెక్యూరిటీ mAadhaar యాప్‌లో అనేక చర్యలు తీసుకున్నారు. ఆధార్ లాక్ క్రియేట్ చేయాలంటే MY Aadhaar ఆప్షన్ ఎంచుకోవాలి. MY Aadhaar ఓపెన్ చేసేందుకు లాక్ కోడ్ అవసరం. ఫోర్ డిజిట్‌తో కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేయాలి. లోనికి వెళ్లాక Set Aadhaar Lock ఆప్షన్ ఎంచుకొని వర్చువల్ ఐడీని సృష్టించుకోవాలి. ఐడీ జనరేట్ అయ్యే సమయంలో సెక్యూరిటీ కాప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. OTP వచ్చాక దానిని నమోదు చేస్తే వర్చువల్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఆధార్ లాక్ ఓపెన్ చేసేందుకు ఇది అవసరం.

వర్చువల్ ఐడీ మరిచిపోతే..

వర్చువల్ ఐడీ మరిచిపోతే..

ఎప్పుడైనా వర్చువల్ ఐడీ మరిచిపోతే 1947కు సందేశం పంపించాలి. అప్పుడు మీ ఐడీ మీకు అందిస్తారు. బయోమెట్రిక్ లాక్ ఆఫ్షన్ కూడా ఉంది. దానిని సెలక్ట్ మరొకరు దుర్వినియోగం చేసే అవకాశం లేదు! బయోమెట్రిక్ లాక్ కోసం OTPతో చేయాలి.

ఆధార్ - mAadhaar లింక్ ఎలా చేయాలి?

ఆధార్ - mAadhaar లింక్ ఎలా చేయాలి?

- mAadhaar యాప్ ఓపెన్ చేయాలి. పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.

- ఆధార్ నెంబర్ సహా మీ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. లేదా ఆధార్ కార్డు బార్ కోడ్ స్కానింగ్ ద్వారా కూడా ప్రొఫైల్ క్రియేట్ చేయవచ్చు.

- ఆ తర్వాత స్క్రీన్ బాటంలోని Verify బటన్ పైన క్లిక్ చేయండి.

- వివరాలు సరిగా ఉంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.

- మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారానే ఇది క్రియేట్ చేస్తే OTP ప్రత్యేకంగా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది.

- OTP ఎంటర్ చేశాక పేరు, జెండర్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇతర వివరాలు కలిగిన ఆధార్ ప్రొఫైల్ కనిపిస్తుంది.

mAadhaar లో ప్రొఫైల్ ఎలా చూడాలి?

mAadhaar లో ప్రొఫైల్ ఎలా చూడాలి?

- mAadhaar యాప్ ఓపెన్ చేయండి.

- పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.

- మీరు మీ ప్రొఫైల్ పేజీలో ఉంటారు.

- మీరు పాస్ వర్డ్ మరిచిపోతే.. Reset password పైన క్లిక్ చేయాలి. దీంతో కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు.

mAadhaar ప్రయోజనాలు..

mAadhaar ప్రయోజనాలు..

- mAadhaar ప్రత్యేక లక్షణాలతో వచ్చింది. బయోమెట్రిక్ డేటా ద్వారా కూడా లాక్ లేదా అన్ లాక్ చేయవచ్చు.

- మీరు ఫిజికల్ ఆధార్ కార్డు వెంట తీసుకు వెళ్లవలసిన అవసరం లేదు.

- ఎస్సెమ్మెస్ ఆధారిత OTPకి బదులు టైమ్ ఆధారిత వన్ టైమ్ పాస్ వర్డ్ లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సురక్షితం.

mAadhaar... ఇవి తెలుసుకోండి..

mAadhaar... ఇవి తెలుసుకోండి..

- యాప్ డౌన్ లోడ్ చేసేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగించండి.

- OTP రిసీవ్ చేసుకునే సమయంలో ఇతర యాప్స్‌ను నావిగేట్ చేయవద్దు.

- ఒక యూజర్ ఒక మొబైల్ ఫోన్‌లో మూడు ప్రొఫైల్స్‌కు మాత్రమే యాక్సెస్ పొందగలరు.

- QR కోడ్ ద్వారా మీ డెమోగ్రఫిక్ సంబంధిత సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లకు షేర్ చేయవచ్చు.

- ఆధార్ యాప్‌ను ఒక డివైజ్‌లో మాత్రమే ఉపయోగించాలి.

mAadhaar సేవలు..

mAadhaar సేవలు..

mAadhaar ఓపెన్ చేయగానే వివిధ రకాల సేవలు కనిపిస్తాయి. ఆధార్ డౌన్ లోడ్, ఆధార్ రీప్రింట్ ఆర్డర్, ఆన్ లైన్ ద్వారా అడ్రస్ అప్ డేట్, పేపర్ లెస్ ఆఫ్ లైన్ ఈ-కేవైసీ, క్యూఆర్ కోడ్ స్కానర్, వర్చువల్ ఐడీ జనరేటర్, జనరేట్ క్యూఆర్ కోడ్, వెరిఫై ఆదార్, వెరిఫై ఈ-మెయిల్ లేదా మొబైల్, రిట్రైవ్ EID/UID, ఆధార్ అప్ డేట్ హిస్టరీ, రిక్వెస్ట్ అడ్రస్ వ్యాలిడేషన్ లెట్టర్, ఆధార్ స్టేటస్ సర్వీస్ ఉంటాయి.

ఇవి ముఖ్యం...

ఇవి ముఖ్యం...

ఇందులో మీకు ముఖ్యంగా అవసరమయ్యేవి ఆధార్ డౌన్ లోడ్, ఆర్డర్ ఆధార్ రీప్రింట్, అప్ డేట్ అడ్రస్ ఆన్ లైన్, ఆధార్ స్టేటస్ సర్వీస్. ఆధార్‌ను పీడీఎఫ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే, ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ద్వారా ఆధార్ ఒరిజినల్ ప్రింట్ కావాలంటే ఆర్డర్ చేయాలి. దీనికి కొంత ఖర్చు, స్పీడ్ పోస్ట్ ద్వారా రావడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. అడ్రస్ వంటివి మార్చుకోవడానికి అప్ డేట్ అడ్రస్ ఆన్ లైన్ ఉపయోగపడుతుంది. ఆధార్ స్టేటస్ సర్వీస్ ద్వారా ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశముంటుంది.

English summary

mAadhaar యాప్ తెలుసా? డౌన్‌లోడ్, ప్రయోజనాలు, సేవలు.. ఇంకా ఎన్నో ఫీచర్స్ | Know about mAadhaar app: How to download and how to use

mAadhaar is official mobile application developed by Unique Identification Authority of India (UIDAI) to provide an interface to Aadhaar Number Holders to carry their demographic information viz.
Story first published: Monday, November 25, 2019, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X