For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Insurance: శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా..? కుటుంబానికి భరోసా..

|

Salary Protection Insurance: మీరు కూడా జీతం తీసుకుంటూ దానిపైనే ఆధారపడి జీవించే వ్యక్తి అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. మీ తరువాత కుటుంబానికి నిరంతరం ఆదాయం ఎలా కొనసాగుతుందనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా. ఈ విషయాన్ని ఆలోచిస్తేనే కొన్ని సార్లు భయం వేస్తూ ఉంటుంది. కానీ.. ఇది తప్పకుండా ఆలోచించి ప్లాన్ చేసుకోవలసిన అత్యవసర ఆర్థిక విషయం. ఈ విషయంలో మీ ఆందోళనకు ఒక పరిష్కారం ఉంది. మీలాంటి వారి కోసమే శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది.

దీనిని తీసుకోవటం వల్ల మీ తరువాత కూడా కుటుంబానికి ఆదాయం నిరంతరాయంగా కొనసాగుతుంది. కానీ ఈ ఇన్సూరెన్స్ మీరు ఉద్యోగం కోల్పోయిన సందర్బంలో ఎలాంటి రక్షణ కల్పించదు. కేవలం మీ మరణం తరువాత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు, వారికి మీరు లేకున్నా నిరంతరం డబ్బు అందిస్తుంది.

ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా పనిచేస్తుంది..?

ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా పనిచేస్తుంది..?

శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ వాస్తవానికి ఒక రకమైన టర్మ్ ఇన్సూరెన్స్. దీనిని తీసుకునేటప్పుడు మీరు రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటి ఎంపిక సాధారణ ఆదాయాన్ని ఎంచుకోవడం, రెండవ ఆప్షన్ టోటల్ అమౌంట్ ఎంచుకోవడం. సాధారణ ఆదాయాన్ని ఎంచుకున్నట్లయితే.. మీ కుటుంబానికి సాధారణ చెల్లింపులు మీ తర్వాత కొనసాగుతాయి. మరోవైపు.. మీరు ఏకమొత్తాన్ని ఎంచుకున్నట్లయితే టోటల్ అమౌంట్ మీ కుటుంబానికి ఒకేసారి చెల్లించటం జరుగుతుంది.

టేక్-హోమ్ శాలరీ ఎంచుకోవచ్చు..

టేక్-హోమ్ శాలరీ ఎంచుకోవచ్చు..

మీరు శాలరీ ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు.. మీరు మీ కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్న నెలవారీ ఆదాయాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఆదాయం మీ ప్రస్తుత టేక్-హోమ్ జీతానికి సమానంగా లేదా తక్కువగా ఉండవచ్చు. ఆ తర్వాత మీరు ప్రీమియం చెల్లించే కాలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. మీరు 30 ఏళ్ల వయస్సులో రెగ్యులర్ ప్రీమియం చెల్లించే టర్మ్ కోసం 15 ఏళ్లపాటు పాలసీని కొనుగోలు చేయవచ్చు.

నెలవారీ ఆదాయం ఎలా..

నెలవారీ ఆదాయం ఎలా..

ఇన్సూరెన్స్ కంపెనీ మీ నెలవారీ ఆదాయంపై వార్షిక శాతాన్ని కూడా పెంచవచ్చు. ఉదాహరణకు.. మీరు ఈ ఆదాయంపై సంవత్సరానికి 6% చక్రవడ్డీని అందించవచ్చు. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు రూ. 50,000 నెలవారీ ఆదాయాన్ని ఎంచుకున్నారని అనుకుందాం. పాలసీ రెండో సంవత్సరంలో రూ.53 వేలకు పెరుగుతుంది. ఆ తరువాతి ఏడాది రూ.56,180 అవుతుంది. ఇప్పుడు పాలసీదారు పాలసీ తీసుకున్న 5వ సంవత్సరం ప్రారంభంలో మరణించినట్లయితే.. నామినీకి రూ. 7.6 లక్షల డెత్ బెనిఫిడ్ తో పాటు రూ. 63,124 పెరిగిన నెలవారీ ఆదాయం లభిస్తుంది.

English summary

Insurance: శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా..? కుటుంబానికి భరోసా.. | know about advantages of Salary Protection Insurance and its advantages

know about advantages of Salary Protection Insurance that helps family members financially after bread earner dies
Story first published: Thursday, July 7, 2022, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X